MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ప్రభాస్ కన్నీళ్లు పెట్టిన సందర్భం, పాన్ ఇండియా స్టార్ ఎమోషనల్ కామెంట్స్

ప్రభాస్ కన్నీళ్లు పెట్టిన సందర్భం, పాన్ ఇండియా స్టార్ ఎమోషనల్ కామెంట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా డై హార్ట్ ప్యాన్స్ ఉన్న స్టార్ హీరో. ఆరడుగులకు పైగా హైట్, టోన్డ్ బాడీతో.. అదిరిపోయే కటౌట్ ప్రభాస్ ది. అటువంటి ప్రభాస్ కన్నీరు పెట్టిన సందర్భం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 10 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : facebook / prabhas

హ్యాట్రిక్ విన్నింగ్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రయత్నం

యంగ్ రెబల్ స్టార్ దూసుకుపోతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో హడావిడి చేస్తున్నాడు. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ప్రభాస్, ఆతరువాత వరుసగా మూడు పాన్ ఇండియా ప్లాప్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా సరే ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన క్రేజ్ కూడా అలాగే ఉంది. టైమ్ కోసం ఎదురు చూస్తూ.. తన పని తాను చేసకుంటూ వెళ్లిన యంగ్ రెబల్ స్టార్ కు, సలార్, కల్కీ రూపంలో మళ్లీ టైమ్ వచ్చింది. కోల్పోయిన ఫామ్ తిరిగి వచ్చింది. అదే జోష్ తో హ్యాట్రిక్ హిట్ కు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్.

DID YOU
KNOW
?
ప్రభాస్ డబుల్ యాక్షన్
పాన్ ఇండియ హీరో ప్రభాస్ బాహుబలి తరువాత మరోసారి రాజాసాబ్ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : facebook / prabhas

ప్రభాస్ పాత వీడియో వైరల్

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. కల్కి 2898 ఏ.డి. చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసిన ఆయన, కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. కన్నప్ప మూవీలో ప్రభాస్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్‌కు సంబంధించి ఓ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

Related image1
కృష్ణకు తెలియకుండా మహేష్ బాబు చేసిన సాహసం, అంత రిస్క్ చేశాడా?
Related image2
జపాన్ లో ప్రభాస్, అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన నాగార్జున, టాలీవుడ్ కింగ్ కు అక్కడ అంత క్రేజ్ ఉందా?
35
Image Credit : instagram / prabhas

ప్రభాస్ కళ్లలో నీళ్లు తిరిగిన సందర్భం

ఈ వీడియోలో ప్రభాస్ తన తొలి సినిమా ఈశ్వర్ సమయంలో జరిగిన ఓ భావోద్వేగ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమం జరుగుతుండగా నేను ఓ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు, ఈ ఈశ్వర్‌కు మూడు గుండెలు' అని చెప్పాను. అయితే టెన్షన్‌లో ఉన్న కారణంగా డైలాగ్ తప్పుగా వచ్చింది. అప్పుడే మా నాన్న నా చేతిని పట్టుకుని ‘యస్’ అన్నారు. అప్పుడే నా కళ్లలో నీళ్లు వచ్చాయి," అని ప్రభాస్ ఆ వీడియోలో చెప్పారు.

45
Image Credit : x/BaahubaliMovie

బాహుబలి సిరీస్ లతో ఇంటర్నేషనల్ క్రేజ్

ఈ వ్యాఖ్యల ద్వారా తన కెరీర్ ప్రారంభంలో తండ్రి ఆశీర్వాదం తనకు ఎంత ప్రేరణ ఇచ్చిందో ప్రభాస్ వెల్లడించారు. ఈశ్వర్ సినిమాతో 2002లో హీరోగా పరిచయమైన ప్రభాస్, తరువాత వర్షం చిత్రంతో తొలిసారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈసినిమాతో ఆయనకు స్టార్ డమ్ వచ్చింది. అనంతరం వరుస సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రభాస్, బాహుబలి సిరీస్‌తో ఇంటర్నేషనల్ లెవెల్‌లో క్రేజ్‌ను సంపాదించారు.

55
Image Credit : instagram

ఐదారేళ్లకు సరిపడా సినిమాలు

ప్రస్తుతం ప్రభాస్ ఐదారేళ్లకు సరిపడా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘రాజాసాబ్’ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు టీమ్. రాజాసాబ్ తరువాత ప్రభాస్ హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాతో పాటు సలార్ 2 , కల్కీ 2 సినిమాలు కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని కథలను వింటున్న ప్రభాస్ త్వరాలో అందులో కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Related Stories
Recommended image1
కృష్ణకు తెలియకుండా మహేష్ బాబు చేసిన సాహసం, అంత రిస్క్ చేశాడా?
Recommended image2
జపాన్ లో ప్రభాస్, అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన నాగార్జున, టాలీవుడ్ కింగ్ కు అక్కడ అంత క్రేజ్ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved