కృష్ణకు తెలియకుండా మహేష్ బాబు చేసిన సాహసం, అంత రిస్క్ చేశాడా?
సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న తన తండ్రికి తెలియకుండా మహేష్ బాబు చేసిన రిస్క్ ఏంటో తెలుసా?

కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు. కెరీర్ బిగినింగ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేష్.. ఆతరువాత కాలంలో హీరోగా మారాడు. అయితే హీరోగా కెరీర్ మొదట్లో పెద్దగా నడవలేదు కానీ.. ఆతరువాత కాలంలో మాత్రం ప్రిన్స్ మహేష్ బాబు కాస్తా.. టాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తూ.. గ్లోబల్ ఇమేజ్ వైపు దూసుకుపోతున్నాడు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తాడుమహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రితో కలిసి చాలా సినిమాల్లో నటించిన మహేష్ బాబు, కృష్ణకు తెలియకుండా చేసిన రిస్క్ ఏంటో తెలుసా?
KNOW
కృష్ఖకు తెలియకుండా మహేష్ బాబు సాహసం.
మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించేప్పుడు చాలా అల్లరి చేసేవాడట. నటన విషయంలోమాత్రం పర్ఫెక్ట్ గా ఉండేవారట. ముఖ్యంగా ఆయనకు యాక్షన్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం, కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఫైటింగ్స్ కూడా చేశారు మహేష్ అయితే ఆ సమయంలో రిస్క్ ఫైట్లు చేయడానికి ఖచ్చితంగా డూప్ లు వాడేవారు. అయితే కృష్ణ లేని సమయం చూసుకుని మహేష్ బాబు డూప్ లేకుండా ఫైటింగ్ చేస్తాను అని అనేవాడట. యాక్షన్ సీన్స్ ను తాను స్వయంగా చేసేవాడట. ఈ విషయాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. టాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్స్‌గా స్టార్ డమ్ చూసిన రామ్ లక్ష్మణ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినీ పరిశ్రమలో ఫైటర్స్‌గా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు స్టార్ ఫైట్ మాస్టర్స్‌గా ఎదిగిన ఈ ఇద్దరు సోదరులు ఇండస్ట్రీలో తిరుగులేని కెరీర్ ను కొనసాగించారు.
డూప్ లేకుండా మహేష్ బాబు ఫైట్స్
ఈ సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ, నటసార్వభౌమ కృష్ణ గారి కుమారుడు, ఇప్పుడు టాలీవుడ్ సూపర్‌స్టార్ అయిన మహేష్ బాబు చిన్నప్పుడు చేసిన ఓ సినిమాలో ఫైటర్స్‌గా తామూ పాల్గొన్నామని తెలిపారు. "ఆ సినిమా షూటింగ్ సమయంలో మేము ఫైటర్స్. ఆ చిత్రానికి ఫైట్ మాస్టర్ సత్యరాజ్ గారు. అప్పట్లో మహేష్ బాబు బాలనటుడిగా ఉన్నారు, ఫైట్ సీన్ సమయంలో మహేష్ బాబు సత్యరాజ్ గారి వద్దకు వచ్చి – 'మా నాన్నకు చెప్పొద్దు. నేను డూప్ లేకుండా చేస్తాను' అని చెప్పారు. చిన్నవయస్సులోనే అంత ధైర్యంగా డూప్ లేకుండా ఫైట్ చేయాలని నిర్ణయించుకోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది," అని రామ్ వెల్లడించారు.
ఈ విషయాన్ని తాము కూడా మహేష్ బాబు తండ్రి కృష్ణ గారికి చెప్పలేదని, మహేష్ బాబు నిజమైన నటనకు అర్హత కలిగినవాడని అప్పుడే గ్రహించామని తెలిపారు. “అది ఓ చిన్న పిల్లాడి తెగువ. డూప్ లేకుండా ఫైట్స్ చేయాలనే పట్టుదల మహేష్ బాబులో చిన్నప్పటి నుంచే ఉంది,” అని రామ్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆతరువాత కాలంలో తామే ఫైట్ మాస్టర్స్‌గా మారి మహేష్ బాబుతో కలిసి అనేక సినిమాల్లో పనిచేశామని తెలిపారు. “చిరంజీవి గారు, బాలకృష్ణ , వెంకటేశ్ , నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం మాకు ఉంది. కానీ మహేష్ బాబుతో మాకు ఉండే అనుబంధం ప్రత్యేకమైనది,” అని వారు అన్నారు.
మహేష్ బాబుతో సూపర్ హిట్ సినిమాలు చేసిన రామ్ లక్ష్మణ్
మహేష్ బాబుతో రామ్ లక్ష్మణ్ చేసిన హిట్ సినిమాల లిస్ట్ లో ఒక్కడు, అతిధి, పోకిరి, బిజినెస్‌మేన్, 1: నేనొక్కడినే వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయిమహేష్ బాబు లాంటి డెడికేషన్ ఉన్న నటుడితో పనిచేయడం గొప్ప విషయమని ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ లక్ష్మణ్ అన్నారు. ఇక ప్రస్తుతం వయసు మీదపడటంతో సినిమాలు తగ్గించారు రామ్ లక్ష్మణ్.
మహేష్ బాబు సినిమాలు
ప్రస్తుతం మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను ఎవరికంటా పడకుండా చాలా సీక్రేట్ గా చేస్తున్నారు రాజమౌళి. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈసినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సబంధించి అప్ డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.