- Home
- Entertainment
- పుకార్లు పటాపంచలు చేసిన ప్రభాస్ హీరోయిన్, ట్రోలర్స్ కి షాకిస్తూ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ బయటపెట్టింది
పుకార్లు పటాపంచలు చేసిన ప్రభాస్ హీరోయిన్, ట్రోలర్స్ కి షాకిస్తూ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ బయటపెట్టింది
సోషల్ మీడియాలో డ్యాన్సర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఇమాన్వి ఏకంగా ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసింది.

Imanvi, Prabhas
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజి. సీతారామం లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ తెరకెక్కించిన హను రాఘవపూడి ఈసారి ప్రభాస్ కోసం బ్రిటిష్ నేపథ్యం ఉన్న కథ ఎంచుకున్నారు. భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా హను రాఘవపూడి కొత్త అమ్మాయిని ఎంచుకున్నారు. ఆమె పేరు ఇమాన్వి.
ప్రభాస్ మూవీలో ఛాన్స్
సోషల్ మీడియాలో డ్యాన్సర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఇమాన్వి ఏకంగా ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసింది. ఫౌజి చిత్రం ప్రారంభం అయినప్పుడు ఇమాన్వి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆమె గురించి నెటిజన్లు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇమాన్విపై ట్రోలింగ్
అయితే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత మరోసారి ఇమాన్వి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఇతర వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆమె గురించి స్పష్టమైన సమాచారం ఎక్కడా లేదు. కొన్ని రూమర్స్ ప్రకారం ఆమె పాకిస్తాన్ అమ్మాయి అని, ఆమె తండ్రి పాకిస్తాన్ మిలటరీలో మాజీ అధికారి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనితో ఇమాన్విని వెంటనే ప్రభాస్ చిత్రం నుంచి తొలగించాలి అని నెటిజన్లు డిమాండ్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు.
Imanvi
పుకార్లు పటాపంచలు అయ్యేలా క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
ఈ క్రమంలో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇమాన్వి రంగంలోకి దిగింది. తనగురించి వినిపిస్తున్న పుకార్లని పటాపంచలు చేసింది. తనకి, పాకిస్తానీ ఏ విధమైన సంబంధం లేదని తాను ఇండో అమెరికన్ అమ్మాయిని అని ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. 'ముందుగా నేను పహల్గాంలో జరిగిన సంఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ సంఘటన వల్ల నా హృదయం బరువెక్కింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
నాకు, నా ఫ్యామిలీకి పాకిస్తాన్ తో సంబంధం లేదు
విద్వేషం రెచ్చగొట్టేలా నా గురించి, నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి వచ్చిన ఫేక్ వార్తల విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ముందుగా నాకు పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధం లేదు. పాకిస్తాన్ మిలటరీలో మా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఇది ఆన్ లైన్ లో ట్రోలర్స్ సృష్టించిన ఫేక్ న్యూస్ మాత్రమే.
నేను ఇండో అమెరికన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని
నేను హిందీ, తెలుగు, గుజరాతీ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నేను జన్మించింది అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చారు. వెంటనే వారు అమెరికా పౌరులుగా మారారు. USAలో నా యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నటి గా, కొరియోగ్రాఫర్‌గా, నర్తకిగా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. ఈ రంగంలో చాలా పని చేసిన తర్వాత, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
నా రక్తంలో లోతుగా భారతీయత నెలకొంది. సోషల్ మీడియాని విద్వేషం కోసం కాకుండా ఐక్యత కోసం ఉపయోగించండి అంటూ ఇమాన్వి తనని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చింది.