MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసలే పెదనాన్న పోయిన బాధలో ఉంటే ప్రభాస్‌పై ఇలాంటి చీప్‌ రూమర్సేంటి?.. `ఆదిపురుష్‌` టీమ్‌పై ఫ్యాన్స్ ఫైర్‌

అసలే పెదనాన్న పోయిన బాధలో ఉంటే ప్రభాస్‌పై ఇలాంటి చీప్‌ రూమర్సేంటి?.. `ఆదిపురుష్‌` టీమ్‌పై ఫ్యాన్స్ ఫైర్‌

ప్రభాస్‌, కృతి సనన్‌ డేటింగ్‌ చేస్తున్నారని, `ఆదిపురుష్‌` టైమ్‌లో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ ఇప్పుడు డేటింగ్‌లో ఉన్నట్టు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్‌ అవుతున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 21 2022, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
prabhas

prabhas

ప్రభాస్‌ పుట్టెడు బాధలో ఉన్నారు. గత వారం పెదనాన్న కృష్ణంరాజు మరణంతో వారి ఫ్యామిలీ అంతా విషాదంలో మునిగిపోయింది. పెదనాన్న లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రభాస్‌. అయోమయ స్థితిలో తీవ్ర విషాదంలో ఉండిపోయారు. దాన్నుంచి ఇప్పట్లో బయటపడే పరిస్థితి లేదు. అందుకే ఆయన షూటింగ్‌లను కూడా పక్కనపెట్టి ఫ్యామిలీ కోసమే టైమ్‌ని కేటాయిస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్‌పై కొత్త రూమర్‌ వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. `ఆదిపురుష్‌` హీరోయిన్‌ కృతి సనన్‌తో డార్లింగ్‌ డేటింగ్‌ చేస్తున్నారంటూ బాలీవుడ్‌ మీడియాలో, ఇటు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ప్రభాస్‌ గురించి తరచూ అనుష్కతో పెళ్లి రూమర్స్ వస్తుంటాయి, కానీ ఈ సారి దానికి భిన్నంగా కృతితో డేటింగ్‌ రూమర్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

36

ఇందులో నిజం లేదని, ఇది కేవలం గాసిప్‌ మాత్రమే అని అందరికి అర్థమవుతుంది. ఇదే విషయంపై ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. `ఆదిపురుష్‌` టీమ్‌పై విరుచుకుపడుతున్నారు. `ఆదిపురుష్‌` సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. అయితే సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి బజ్‌ లేదు. ఈ నేపథ్యంలో హైప్‌ పెంచేందుకు, ప్రమోషన్‌ కార్యక్రమాలు స్టార్ట్ చేసేందుకు చిత్ర బృందం, ముఖ్యంగా పీఆర్‌ టీమ్‌ ఇలాంటి ట్రిక్కు ప్లే చేసిందని అంటున్నారు.

46

దీంతో `ఆదిపురుష్‌` టీమ్‌పై మండిపడుతున్నారు రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్. ఓ వైపు పెదనాన్న పోయిన బాధలో ప్రభాస్‌ ఉంటే, ఇలాంటి చీప్‌ ట్రిక్కులేంటీ? అంటూ ప్రశ్నిస్తున్నారు. `షేమ్‌ఆన్‌ఆదిపురుష్‌పీఆర్‌టీమ్‌` అంటూ యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రభాస్‌కి, కృతికి మధ్య నిజంగానే రిలేషన్‌ ఉంటే దాన్ని మేము ఆనందిస్తాము. కానీ ఇలాంటి చౌకబారు ప్రమోషన్‌ ట్రిక్కులు ప్లే చేసి వారి పరువు తీయకండి అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. క్లిష్ట సమయంలో ప్రభాస్‌ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసేందుకు కొందరు సినీ వర్గాలు కావాలని చేసిన కుట్ర ఇది అంటూ మండి పడుతున్నారు. వీరికి నెటిజన్లు కూడా మద్దతు పలకడం విశేషం. 
 

56

`ఆదిపురుష్‌`రామాయణం అనే గొప్ప కథతో రూపొందుతుంది. భారతీయ సంస్కృతిని చాటే చిత్రం రాబోతుంది. అందులో ఉత్తమమైన పాత్రల్లో ప్రభాస్‌, కృతిలు నటిస్తున్నారు. వారిగురించి మంచిగా, గొప్పగా చెప్పాల్సింది పోయి ఇలాంటి నీచమైన రూమర్స్ క్రియేట్‌ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారిపోయింది. 

66

ఇక ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందిన `ఆదిపురుష్‌` చిత్రంలో ప్రభాస్‌..రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ చేస్తున్నారు. సుమారు 500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఈ నెలలోనే విడుదలచేయాలని, అక్టోబర్ 3న టీజర్‌ని రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం భావిస్తుందట. దసరా కానుకగా `ఆదిపురుష్‌` చిత్రం నుంచి ట్రీట్‌ ఇవ్వాలని చూస్తోంది యూనిట్. మరి ట్రీట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
బ్ర‌హ్మానందం చెప్పిన ఈ మాట‌లు వింటే.. మ‌న‌సు తేలిక కావ‌డం ఖాయం. ఏం చెప్పాడు భ‌య్యా అస‌లు
Recommended image2
Tarun To Raj Tarun: తరుణ్ నుంచి రాజ్ తరుణ్ వరకు, టాలీవుడ్ ని ఎలాల్సిన హీరోలు.. ఒక్క ఫ్లాప్ తో అంతా పతనం
Recommended image3
Jana Nayagan: సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved