కన్నప్ప 5 సార్లు చూస్తా, కాకపోతే.. మంచు విష్ణుకు ప్రభాస్ అభిమాని షాకింగ్ కండిషన్
ప్రభాస్ అభిమాని ఒకరు మంచు విష్ణుకు ఒక్క కండిషన్ పెట్టాడు . కన్నప్ప సినిమా ఎలా ఉన్నా ఐదు సార్లు చూస్తాను. కాకపోతే ఒక కండిషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి విష్ణు స్పందించారు.
మంచు విష్ణు లేటెస్ట్ మూవీ కన్నప్ప. వాస్తవ సంఘటనల ఆధారంగా కన్నప్ప తెరకెక్కుతుంది. ఒక పరమ శివ భక్తుడి కథే కన్నప్ప. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మూవీ ప్రధాన భాగం న్యూజిలాండ్ లో షూట్ చేశారు. కన్నప్ప డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే 2025కి వాయిదా పడింది.
మంచు విష్ణు, మోహన్ బాబు తో పాటు విష్ణు కుమార్తెలు ఆవియానా, వివియానా ఈ చిత్రంలో నటిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేస్తున్నారు. కన్నప్ప మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ శివుడి పాత్ర చేస్తున్నాడంటూ పుకార్లు వెలువడ్డాయి. కాగా శివుడి పాత్రను అక్షయ్ కుమార్ చేస్తున్నారు. ప్రభాస్ నందీశ్వరుడిగా చేస్తున్నాడని సమాచారం.
కన్నప్ప మూవీలోని ప్రభాస్ లుక్ ఇంకా రివీల్ చేయలేదు. ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్న క్రమంలో కన్నప్ప చిత్రంపై ఆయన అభిమానులకు ఆసక్తి నెలకొంది. ప్రభాస్ అభిమాని విష్ణుకు ఒక రిక్వెస్ట్ చేసుకున్నాడు. కన్నప్ప మూవీ ఎలా ఉన్నా.. ఐదు సార్లు చూస్తాను. కానీ ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉండాలి, అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్ పై విష్ణు స్పందించారు. ఖచ్చితంగా ప్రభాస్ రోల్ అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ అభిమానులు ఎంజాయ్ చేస్తారని మంచు విష్ణు హామీ ఇచ్చాడు.
Kannappa Teaser
మంచు విష్ణు రిప్లై వైరల్ అవుతుంది. కాగా కన్నప్ప మూవీతో మంచు విష్ణు భారీ రిస్క్ చేస్తున్నాడు. కన్నప్ప బడ్జెట్ రూ 100 కోట్లు అట. మంచు విష్ణుకు ఉన్న మార్కెట్ రీత్యా, అసలు ఎంత వరకు రికవరీ అవుతుందనే సందేహాలు ఉన్నాయి. కనీసం కోటి రూపాయల వసూళ్ల కోసం కిందా మీద పడుతున్న విష్ణు, పాన్ ఇండియా మూవీ చేసి, తిరిగి రికవరీ చేయడం అసాధ్యం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేవలం ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తున్నారనే, ఒక పాజిటివ్ ఒపీనియన్ తో ముందుకు వెళుతున్నారు. స్టార్ హీరోల గెస్ట్ రోల్స్ తో కన్నప్ప మూవీని కాపాడటం సాధ్యమేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి. మరోవైపు మంచు ఫ్యామిలీ విబేధాలు నెలకొన్నాయి. మనోజ్ తో విష్ణు, మోహన్ బాబులకు వివాదం చోటు చేసుకుంది. భౌతిక దాడులు, పోలీస్ కేసుల వరకు మేటర్ వెళ్ళింది.