ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా.? హీరో ఎవరంటే.!
Prabhas: పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సంగతి మీకు తెలుసా.? అది తెలుగు మూవీ కాదండీ.! ఓ బాలీవుడ్ చిత్రం. మరి అందులో హీరో ఎవరో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

ది రాజా సాబ్ మూవీ..
ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతీ తెరకెక్కించిన చిత్రం 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. ఈ చిత్రాన్ని నిలబెట్టింది. ఇప్పటికే రెండొందలకు పైగా కోట్లు సంపాదించిన ఈ చిత్రం.. ఫైనల్ రన్‌లో కొన్ని లాస్‌లతో ముగుస్తుందని విశ్లేషకుల అంచనా..
ఈశ్వర్ మూవీతో అరంగేట్రం..
సీనియర్ నటుడు కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి సినిమాతోనే తన నటనకు గానూ మంచి మార్కులు తెచ్చుకుని.. అనంతరం ఛత్రపతిగా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ మూవీ హిట్‌తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు ప్రభాస్.
బాహుబలితో పాన్ ఇండియా స్టేటస్..
ఇక ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ సంపాదించినా సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై.. ఎంత పెద్ద హిట్ అయ్యాయ్యో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో తెగ పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ అవుతున్నాయి.
గెస్ట్ రోల్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటించిన సంగతి మీకు తెలుసా.? అయితే హీరోగా కాదండీ.. ఓ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు. అది కూడా కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ప్రభాస్ ఆ సినిమాలో కనిపిస్తాడు. ఆ మూవీ డైరెక్టర్‌తో ఉన్న రిలేషన్ కారణంగానే ప్రభాస్ ఈ గెస్ట్ రోల్ చేశారట.
ఆ మూవీ ఏంటంటే..?
బాహుబలి సినిమా కంటే ముందే ఈ మూవీ విడుదలైంది. ఇక ప్రభాస్ నటించిన ఆ బాలీవుడ్ మూవీ మరేదో కాదు యాక్షన్ జాక్సన్. ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఇలా కొన్ని సెకన్ల పాటు గెస్ట్ పాత్రలో కనిపించి సందడి చేశాడు ప్రభాస్. అజయ్ దేవగణ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే ప్రభాస్ ఇందులో నటించిన విషయం కూడా చాలామందికి తెలియదు.

