MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ప్రభాస్,అనుష్క, త్రిష, సల్మాన్.. 40 ఏళ్ళు దాటినా.. పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్స్ ఎవరంటే?

ప్రభాస్,అనుష్క, త్రిష, సల్మాన్.. 40 ఏళ్ళు దాటినా.. పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్స్ ఎవరంటే?

ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యా చిలర్లకు కొదవ లేదు. కాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ మాత్రం కొంత మందే ఉన్నారు. 40 ఏళ్లు దాటినా.. పెళ్లీ పెటాకులు లేకుండా.. ఇక చేసుకుంటారు అన్ననమ్మకం కూడా లేకుండా.. ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వీరు. మరి అలాంటివారు ఇండస్ట్రీలో ఎవరెరు ఉన్నారంటే..?  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 21 2024, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

సెలబ్రిటీ అయినా.. సామాన్యుడు అయినా.. ఒకప్పుడు 20 ఏళ్ళ లోపు పెళ్ళి చేసేవారు.. అది కాస్తా ఆతరువాత 30 కి చేరింది. ఇప్పుడు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదు. రకరకాల కారణాలతో లైఫ్ టైమ్ బ్యాచిలర్స్ గా ఉండటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టార్స్. అందులో ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి సల్మాన్ ఖాన్. ఈయన ఇండస్ట్రీలో బ్యాచిలర్ల సంఘానికి అత్యక్షుడు.. 60 ఏళ్లు వస్తున్నాయి సల్మాన్ కు.. కాని ఇంత వరకూ పెళ్ళి చేసకోలేదు. ఇక చేసుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Prabhas

Prabhas

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఆయన కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న సంగతి  తెలిసిందే. 45 ఏళ్లు వచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి గురంచే రచ్చ జరుగుతోంది. రెబల్ ఫ్యాన్స్ ఆయన పెళ్ళి చూడాలని ఆశపడుతున్నారు. కాని పెళ్లి గురించి ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు ప్రభాస్. 

311
Actor Vishal

Actor Vishal

ఇండస్ట్రీలో మరో మోస్ట్ బ్యాచిలర్ హీరో విశాల్. తమిళంలో స్టార్ హీరోగా మారిన ఈ తెలుగు కుర్రాడు.. 46 ఏళ్ళు వచ్చినా..ఇంకా పెళ్ళి పీటలు ఎక్కలేదు. కాని ఓ రెండు సార్లు ఎంగేజ్మెంట్ వరకూ వెళ్ళాడు.. ఓ లవ ఫేల్యూర్స్ ను ఫేస్ చేశాడు. ఇలా ముచ్చటగా మూడు సార్లు పెళ్లి ఆగిపోయి.. ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ నుఎంజాయ్ చేస్తున్నాడు. 

411

నలబై ఏళ్లు దాటినా పెళ్ళి చేసుకోని హీరోలలో తరుణ్ కూడా చేరారు. లవర్ బాయ్ గా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన ఆయన.. ఆతరువాత హీరోగా అవకాశాలు లేక ఫెయిడ్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ బిజినెస్ లు చేసుకుంటూ.. అప్పుడప్పుడుహీరోగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంత వరకూ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. 

511

నాలుగు పదులు దాటినా పెళ్లి గురించి ఆలోచించని హీరోయిన్లలో అనుష్క ముందు వరుసలో ఉంది. సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అసలు పేరు స్వీటీ.. దాదాపు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీని జేజమ్మ లా ఏలుతున్నఈ స్టార్ హీరోయిన్ 40 ఏళ్లు దాటి రెండు మూడేళ్లు పైనే అవుతోంది. అయినా ఇంకా పెళ్ళిపీటలేకక్కలేదు. ప్రభాస్ తో లవ్ లో ఉంది అని.. త్వరలో పెళ్ళాడబోతుందని రూమర్లు గట్టిగా వినిపిస్తున్నా.. పెళ్ళి గురించి వీరిద్దరు ఊసెత్తడం లేదు.

611

హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ త్రిష. నాలుగుపదుల వయస్సుల దాటినా.. కుర్ర హీరోయిన్లను మించిన అందంతో అద్భుతం చేస్తోంది త్రిష కృష్ణన్. గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న త్రిష.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. గతంలో ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్ చేసి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న త్రిష.. సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు.

711

మెస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్లలో సీనియర్ హీరో్లు ఇద్దరు ఉన్నారు. అందులో ముందుగా అందాల తార నగ్మ గురించి మాట్లాడుకోవాలి.. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. సౌత్.. నార్త్ హీరోలతో నటించి మెప్పించింది. కాని ఈ ముద్దు గుమ్మ పెళ్ళి చేసుకోలేదు. ప్రస్తుతం పొలిటీషియన్ గా రాణిస్తున్న నగ్మ.. గతంలో స్టార్ క్రికెటర్ సౌరప్ గంగూలీతో డేటింగ్ చేసిందన్నది టాక్. ఈ బ్యూటీకి ప్రస్తుం 50 ఏళ్లు.. ఇంకా పెళ్ళి చేసుకుంటందన్న నమ్మకం లేదు. 

811

ఇక పెళ్ళి ఊసెత్తని హీరోయిన్లలో టబు కూడా ఒకరు. గ్లామర్ హీరోయిన్ గా 90స్ లో వెండితెరను ఒక ఊపుఊపేసిన ఈ తార.. ప్రస్తుతం గ్లామర్ కలిగిన క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. కాని 52 ఏళ్ళు వచ్చినా పెళ్ళి మాత్రం చేసుకోలేదు. 
 

911

మెగాస్టార్ చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున‌, మోహ‌న్‌బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించిన శోభన వయస్సు 50 ఏళ్లు దాటింది. ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో పాటు శిక్ష‌ణ ఇస్తూ లైఫ్ గ‌డిపేస్తోంది. ఇక టీవీ సీరియల్ ద్వారా పాపుల‌ర్ అయిన సితార ప్ర‌స్తుతం వెండితెర‌తో పాటు ఇటు బుల్లితెర మీద కూడా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టిస్తోంది. ఈమె వ‌య‌స్సు 47 సంవ‌త్స‌రాలు. అయినా కూడా ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు.

 

1011

ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని స్టార్స్ చాలా మంది ఉన్నారు. హీరోలా హ్యాండ్సమ్ గా ఉన్నా.. క్యారెక్టర్ రోల్స్ కే పరిమితం అయిన స్టార్ సుబ్బరాజు. ఇతను కూడా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. 46 ఏళ్ళు వచ్చినా..ఇంకా బ్యాచిలర్ లఫ్ నే ఏంజయా చేస్తున్నాడు సుబ్బరాజు. అసలు  పెళ్లికి నో అని చెప్పేశారు అని టాక్. ఓ  ఇంటర్వ్యూ లో పెళ్లి మీద ప్రశ్న కి ఒక మంచి సెన్సిబుల్ ఆన్సర్ కూడా ఇచ్చాడు సుబ్బరాజు. పెద్దలు అలిగారు అని పెళ్లి చేసుకోకూడదన్నారు.

1111

ఇక అసలు ఇండియా మొత్తమీద ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బ్యాచిలర్ల సంఘం అధ్యక్షుడుగా నిలిచాడు ఆర్ నారాయణ మూర్తి. ఆయన వయస్సు 70 ఏళ్ళు దాటింది. అయితే ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నారు. అయితే ఓ సందర్భంలో బ్యాచిలర్ లవ్ అనేది నరకం అన్నారు. ఎవరూ అలా ఉండాలి అని అనుకోవద్దు అన్నారు. మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినా.. ఆరోగ్యం బాగోలేకపోయినా.. పలకరించే దిక్కు ఉండాలి అన్నారు. తాను చేసిన పొరపాటు ఇంకెవరై చేయద్దన్నారు నారాయణమూర్తి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
టబు
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved