ప్రభాస్, రామ్ చరణ్ , అల్లు అర్జున్, నయనతార.. సొంత విమానం కలిగి ఉన్న సౌత్ స్టార్స్ వీళ్ళే...
సౌత్ ఇండియన్ స్టార్స్ గా.. పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుని.. భారీగా సంపాదిస్తూ.. సొంత విమానాలు కలిగి ఉన్న ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..?
సినీ ప్రముఖులు విలాసవంతమైన జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. భారీగా సంపాదిస్తారు కాబట్టి.. అంతే లగ్జరీ లైఫ్ ను కోరకుంటారు. సినిమాల్లో నటిస్తూ కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. వారు ఆ డబ్బును వివిద రంగాల్లో పెట్టుబడి పెట్టడం, వ్యాపారం ప్రారంభించడం ద్వారా ఇంకా ఎక్కువగా సంపాదిస్తూ.. విలావసంతమైన కార్లు, ఇళ్ల కోసం ఖర్చు చేస్తారు. అందులో కొంత మంది ఆ డబ్బుతో.. సొంతంగా విమానం కూడా కొన్నవారు ఉన్నారు. ఇంతకీ ప్రైవేట్ ప్లేన్ ఉన్న సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.
పాన్ ఇండియాస్టార్ ప్రభాస్‌కి సొంతంగా ఓ విమానం ఉంది. దీన్ని ఆయన తరచూ వాడుతుంటారు. `బాహుబలి` తర్వాత దీన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆయన ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టాలీవుడ్ తో పాటు ఇండియాలోనే అతి పెద్ద సినిమా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ.. అందులో పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు రామ్ చరణ్. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించిన తర్వాత చరణ్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. అయితే నటుడిగా మాత్రమే కాకుండా వ్యాపార వేత్తగా కూడా చరణ్ ఎదుగుతున్నాడు. రకరకాల వ్యాపారాల్లో అతను పెట్టుబడి పెటట్ి ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు... అతనికి ప్రైవేట్ విమానం కూడా ఉంది. అతను తన భార్యతో కలిసి ప్రయాణించడానికి ఈ విమానాన్ని ఉపయోగిస్తాడు. ఈ విమానంలో ఆయన తండ్రి చిరంజీవి కూడా అప్పుడప్పుడు విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యంత సంపన్న నటుల్లో నాగార్జున ఒకరు. ఆయనకు సినిమాకి మించి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. వేల కోట్లకు అధిపతి అయిన ఆయనకు సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఈ విమానాన్ని నాగార్జున మాత్రమే కాకుండా ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా ఉపయోగిస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ గా వెలుటు వెలుగుతూ.. కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న మహేష్ బాబుకి ప్రైవేట్ విమానం కూడా ఉంది. కాని అప్పడప్పుడు మాత్రమే అతను కుటుంబ విహారయాత్రలు మరియు వ్యాపార పర్యటనల కోసం ఈ విమానాన్ని ఉపయోగిస్తున్నాడని టాక్. .
అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ కి ఎదిగాడు. గీతా ఆర్ట్స్, అల్లు స్టూడియోస్ తో పాటు, ఆహా లాంటి బిజినెస్ లు అల్లు ఫ్యామిలీ కలిగి ఉన్నాయి. అంతే కాదు వీరికి ప్రైవేట్ జెట్ కూడా ఉంది. అతను ఈ 6-సీటర్ విమానాన్ని ఇటీవలే కొనుగోలు చేశాడు. అల్లు అర్జున్ తన కుటుంబంతో సరదాగా ట్రిప్ చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నాడు.
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అయిన నటి నయనతారకు కూడా ఓ ప్రైవేట్ ప్లేన్ ఉంది. ఆమె తన భర్తతో కలిసి గతంలో రొమాంటిక్ టూర్లు ఈ ప్లైట్ ద్వారానే తిరిగారు.అంతే కాదు ప్రస్తుతం తమ కుమారులు వయారి మరియు ఉలాగ్‌లతో కలిసి ప్రయాణించడానికి ఈ విమానాన్ని ఉపయోగిస్తుంది. దీని విలువ 10 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.