- Home
- Entertainment
- Tollywood Stars who own Charted Flights: ఖరీదైన లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్స్
Tollywood Stars who own Charted Flights: ఖరీదైన లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్స్
కోట్లు తీసుకునే స్టార్ హీరోల లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాలు, ఖరీదైన కార్లు విలాసవంతమైన జీవితం. ప్రభాస్ లాంటి హీరో సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటుండగా.. ఆయనకు సొంత విమానం ఉంది. ప్రభాస్ తో పాటు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ఓన్ చార్టెడ్ ఫ్లైట్ కలిగివున్నారు.

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎన్టీఆర్ (NTR)ఒకరు. ఒక్కొక్క సినిమాకు 30-40 కోట్లు తీసుకునే ఎన్టీఆర్... ఆర్ ఆర్ ఆర్ తర్వాత వంద కోట్ల హీరో అవుతాడు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ చాలా కాలం క్రితమే చార్టెడ్ ఫ్లైట్ కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తన ప్రయాణాలకు ఓన్ ఫ్లైట్ వాడతారు. ఆయన కూడా సొంత విమానం కలిగి ఉన్నారు. పుష్పతో బన్నీ రేంజ్ మారిపోగా... ఇలాంటి ఫ్లైట్ లు మరిన్ని కొనడం ఆయనకు అసాధ్యం కాదు.
దేశంలోనే అతిపెద్ద స్టార్ గా ఎదిగారు ప్రభాస్(Prabhas). ఆయన ఒక్కో సినిమాకు రూ. 100 నుండి 150 కోట్లు తీసుకుంటున్నారు. ముంబై టు హైదరాబాద్ తీరిక లేకుండా తిరిగే ప్రభాస్ కి సొంత విమానం లేకపోతే ఎలా? అందుకే ఒక లగ్జరీ విమానం చాలా కాలం క్రితమే కొన్నారు.
టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu)సినిమాలతో పాటు వ్యాపార ప్రకటనల ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. ఈ టాప్ హీరోకి కూడా ఓన్ ఫ్లైట్ ఉంది. దేశీయ ప్రయాణాలు మహేష్ ఇందులోనే చేస్తారు. ఇక ముంబై ఆయన అత్తారిల్లు కాగా, తరచుగా అక్కడికి చార్టెడ్ ఫ్లైట్ లో వెళతారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా ఫుల్ బిజీ. తరచుగా హైదరాబాద్ టు ఆంధ్రా చక్కర్లు కొట్టడానికి పవన్ ఓ చార్టెడ్ ఫ్లైట్ సమకూర్చుకున్నారు.
కింగ్ నాగార్జున సినిమాలతో పాటు వివిధ వ్యాపారాల ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు. ఇద్దరు కొడుకు నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోలుగా స్థిరపడ్డారు. దీంతో నాగార్జున చాలా కాలం క్రితం విమానం కొనుక్కున్నారు.
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మెగా స్టార్ చిరంజీవి ఇప్పటికీ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల లిస్ట్ లో ఉన్నారు. మెగా స్టార్ , రామ్ చరణ్ తన సొంత చార్టెడ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తారు.
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సొంత విమానం కలిగి ఉండటం విశేషం. తనకు వచ్చి ఫేమ్ తో వ్యాపారాలు చేస్తూ కోట్లు ఆర్జిస్తున్న విజయ్ దేవరకొండ ముంబై కి వెళ్లాలంటే సొంత చార్టెడ్ ఫ్లైట్ లో వెళతారు. ఈయన కంటే ముందు హీరోలుగా స్థిరపడ్డ నాని, శర్వానంద్ లాంటి వాళ్లకు మాత్రం సొంత ఫ్లైట్స్ లేవు.