- Home
- Entertainment
- 'ఆదిపురుష్' తొలిరోజు లెక్క రూ.85 కోట్లు.. బాక్సాఫీస్ జాతరే, పీవీఆర్ సీఈవో షాకింగ్ కామెంట్స్
'ఆదిపురుష్' తొలిరోజు లెక్క రూ.85 కోట్లు.. బాక్సాఫీస్ జాతరే, పీవీఆర్ సీఈవో షాకింగ్ కామెంట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ప్రభాస్ తొలిసారి పాన్ ఇండియా పౌరాణిక చిత్రంలో నటించడంతో ఆదిపురుష్ పై విపరీతమైన హైప్ ఉంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ప్రభాస్ తొలిసారి పాన్ ఇండియా పౌరాణిక చిత్రంలో నటించడంతో ఆదిపురుష్ పై విపరీతమైన హైప్ ఉంది. రామాయణం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.
మరికొన్ని గంటల్లోనే ఆదిపురుష్ మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ గమనిస్తే ఫస్ట్ డే రోజున ఆదిపురుష్ బాక్సాఫీస్ జాతర ఖాయం ని ట్రేడ్ విశ్లేషకులంతా అంచనా వేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ చిత్రంపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ వాటిని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ప్రభాస్ ని రాముడిగా వెండితెరపై చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే ప్రధాన మల్టిఫ్లెక్స్ లలో ఇండియా వ్యాప్తంగా 4 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనట్లు తెలుస్తోంది.
దీనితో ఊహకందని బాక్సాఫీస్ లెక్కలు తొలిరోజు నమోదు కాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్, బాహుబలి, పఠాన్ లాంటి చిత్రాల బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు కాబోతున్నాయి అని అంచనా వేస్తున్నారు. దీనితో పివిఆర్ సీఈవో గౌతమ్ దత్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిపురుష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషల్లో ఆదిపురుష్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హిందీలో కంటే తెలుగులో ప్రభాస్ క్రేజ్ డబుల్. తొలిరోజు ఆదిపురుష్ చిత్రం ఇండియా వ్యాప్తంగా 85 కోట్ల వర్క్స్ షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నాం. తెలుగులో ఊహించని విధంగా అత్యధిక షేర్ నమోదు కాబోతోంది. ఆ తర్వాత హిందీలో కలెక్షన్స్ అత్యధికంగా ఉంటాయి అని ఆయన అన్నారు.
Adipurush Pre Release Event
మరికొందరు ట్రేడ్ విశ్లేషకులు వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ చిత్రం తొలి రోజు 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టడం ఖాయం అని అంటున్నారు. ఆదిపురుష్ మ్యానియా తో దేశం మొత్తం ఊగిపోతోంది అని అంటున్నారు. తెలుగులో ఎలాగూ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ హిందీలో కలెక్షన్స్ పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గత రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.