ప్రభాస్ తో సినిమాను రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అభిమానించని వారు ఉండరు. ఆయనతో సినిమా అంటే స్టార్ హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. కాని ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో సినిమాను రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో కల్కి 2898 ఎ.డి. సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్, ఫౌజీ వంటి భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు స్పిరిట్ అనే ప్రాజెక్ట్ కూడా త్వరలో ప్రారంభంకానుండగా, మరిన్ని సినిమాల కోసం చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటి నుంచి ప్రభాస్ ప్రతి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో 2019లో విడుదలైన సాహో మూవీపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకుల నిరీక్షణల మేరకు ప్రభావితం చేయలేకపోయింది.
ప్రభాస్ సినిమా అంటే హీరోయిన్లు ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఎవరు నో చెప్పరు. ప్రభాస్ ఫేయిల్యూర్స్ లో ఉన్నా కాని.. ఆయనతో సినిమాకు దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదీ ప్రభాస్ రేంజ్ . కానీ ప్రభాస్ సినిమాను కూడా రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఉందని మీకు తెలుసా? అది కూడా ఆయన పాన్ ఇండియా స్టార్ అయిన తరువాత ఆయన సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ గురించి మీకు తెలుసా?
ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సమాచారం ప్రకారం, బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ కంటే ముందు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను మేకర్స్ సంప్రదించారు. అయితే, ఆమె ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపకుండా తిరస్కరించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మేకర్స్ ఆమె కోసం దాదాపు 6 నెలలపాటు ఎదురు చూశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె స్థానంలో శ్రద్ధా కపూర్‌ను తీసుకుని సినిమా తెరకెక్కించారు.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 435 కోట్ల వసూళ్లు రాబట్టగా, భారత్‌లో మాత్రమే రూ.150 కోట్ల నికర కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమా బాలీవుడ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. కాని తెలుగు ఆడియన్స్ మాత్రం పెద్దగా ఆదరించలేకపోయారు. ఈ సినిమాకు శ్రద్ధా కపూర్ ప్లస్ అయ్యారు. ప్రభాస్‌తో ఆమె జోడీకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బాహుబలి లాంటి హిట్ సినిమా తరువాత బాహుబలి 2 విడుదలకు ముందు సాహో ఆఫర్ వచ్చినప్పటికీ, కత్రినా ఎందుకు తిరస్కరించిందన్నది స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంలో నిజం ఎంతో కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రాజాసాబ్’ లో నటిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈసినిమా తరువాత హనురాఘవపూడి డైరెక్షన్ లో యుద్ధ నేపథ్యంలో ‘ఫౌజీ’ మూవీని చేస్తున్నాడు ప్రభాస్. దీనితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి2 , ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2 సినిమాలు చేయాల్సి ఉంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.