MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Prabhas: ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన మూడు సినిమాలేంటో తెలుసా? ఆ సినిమాలు చేయకుండా ఉంటే?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన మూడు సినిమాలేంటో తెలుసా? ఆ సినిమాలు చేయకుండా ఉంటే?

బాహుబలి నుంచి ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న రెంబల్ స్టార్ కొన్ని సినిమాలు చేసి.. తన కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసుకున్నాడు. ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన మూడు సినిమాలేంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 22 2026, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాన్ ఇండియాను ఏలుతున్న ప్రభాస్..
Image Credit : Asianet News

పాన్ ఇండియాను ఏలుతున్న ప్రభాస్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్‌గా వెలుగు వెలిగిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌లో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టాయి. ముఖ్యంగా బాహుబలి, బాహుబలి 2, సినిమాల విజయాలతో ప్రభాస్ ఓవర్‌నైట్‌లో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అప్పటి నుంచి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన మూడు సినిమాలు..
Image Credit : Prabhas\Instagram

ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన మూడు సినిమాలు..

అయితే ప్రభాస్ కెరీర్‌లో కొన్ని సినిమాలు మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. భారీ అంచనాలతో.. అద్భుతాలు చేస్తాయని అనుకున్న మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రిజెల్ట్ ను సాధింకపోగా.. ప్రభాస్ ఇమేజ్‌పై కూడా ప్రభావం చూపించాయి. ఆ మూడు సినిమాలు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని అభిమానులు ఇప్పటికీ బాధపడుతున్నారు.

Related Articles

Related image1
NTR Dragon: 4 నెలల్లో 15 కేజీలు.. ఎన్టీఆర్ చూసి భయంతో ఆయన ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా?
Related image2
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
36
డిజాస్టర్ గా నిలిచిన రాజాసాబ్..
Image Credit : Instagram

డిజాస్టర్ గా నిలిచిన రాజాసాబ్..

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి తీవ్ర నిరాశపరిచింది రాజాసాబ్. భారీ అంచనాలు సృష్టించిన ఈ మూవీ పక్కాగా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. డైరెక్టర్ మారుతీ కూడా ఈ మూవీ హిట్ అవ్వకపోతే నా ఇంటికి రండి అని అడ్రెస్ కూడా ఇచ్చాడు. కానీ రాజాసాబ్, కథ, స్క్రీన్ ప్లే దారుణంగా ఉండటం, ప్రభాస్ ను ఆ పాత్రలో జనం చూడలేకపోయారు. అభిమానులైతే కోపంతో ఊగిపోయారు. డైరెక్టర్ మారుతీ.. ప్రభాస్‌ను డిఫరెంట్ గా చూపించాలని ప్రయత్నం చేశారు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ పాత్రను భయపడే స్వభావంతో చూపించడం అభిమానులకు అంతగా నచ్చలేదని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

46
ప్రభాస్ కెరీర్ ను ఇబ్బంది పెట్టిన సినిమా
Image Credit : Asianet News

ప్రభాస్ కెరీర్ ను ఇబ్బంది పెట్టిన సినిమా

ప్రభాస్ కెరీర్ ను ఇబ్బంది పెట్టిన మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమా రిలీజ్ తరువాత భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన Om Raut ప్రభాస్‌ను సరిగా ప్రెజెంట్ చేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విజువల్స్, డైలాగ్స్, కథనంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సినిమా చేయకపోయినా బాగుండేదని అభిమానులు కామెంట్లు చేసిన పరిస్థితి కనిపించింది.

56
ప్రభాస్ కు కొత్త ఇమేజ్ ఇవ్వాలని..
Image Credit : instagram

ప్రభాస్ కు కొత్త ఇమేజ్ ఇవ్వాలని..

ఇక ప్రభాస్‌కు క్లాస్ లుక్‌లో కొత్త ఇమేజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెరకెక్కిన రాధేశ్యామ్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ పైన చెప్పిన రెండు సినిమాల కంటే ఈమూవీ కాస్త బెటర్. అందమైన ప్రేమ కథను డైరెక్టర్ రాధాకృష్ణ అద్భుతంగా తెరకెక్కించాడు. కానీ ప్రభాస్ ఇమేజ్ కు ఈ కథ ఏమాత్రం సూట్ అవ్వలేదు. ఆరడుగుల యాక్షన్ హీరోని కంప్లీట్ గా ఓ ప్రేమికుడిలా చూపించడం.. ఆస్ట్రాలజర్ పాత్రలో చూపిండం అభిమానులు తీసుకోలేకపోయారు. 

66
భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి..
Image Credit : instagram

భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి..

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ మూడు సినిమాలు మీడియం రేంజ్ హీరోలతో చేసి ఉంటే బాగుండేది.. లోకల్ కథలను పాన్ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తే ఫలితం ఇలానే ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?
Recommended image3
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Related Stories
Recommended image1
NTR Dragon: 4 నెలల్లో 15 కేజీలు.. ఎన్టీఆర్ చూసి భయంతో ఆయన ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా?
Recommended image2
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved