- Home
- Entertainment
- క్రికెట్ స్టేడియంలో ప్రభాకర్ కొడుకు రచ్చ.. త్రివర్ణ పతాకంతో హంగామా చేసిన కాబోయే హీరో.. ట్రోల్స్ ఆగడం లేదుగా!
క్రికెట్ స్టేడియంలో ప్రభాకర్ కొడుకు రచ్చ.. త్రివర్ణ పతాకంతో హంగామా చేసిన కాబోయే హీరో.. ట్రోల్స్ ఆగడం లేదుగా!
నటుడు, దర్శకుడు ప్రభాకర్ కొడుకు చంద్ర హాస్ హీరోగా సినిమాతోనే సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో రచ్చ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

నటుడు ప్రభాకర్ ఇటీవల తన కొడుకు చంద్రహాస్‌ని హీరోగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రారంభంతోనే అనేక ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఆయన లుక్‌పై నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు చేశారు. దీంతో ప్రభాకర్ సైతం రియాక్ట్ అయి ట్రోల్స్ ఆపాలని, ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ ట్రోల్స్ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి రచ్చ చేశాడు చంద్రహాస్.
నిన్న సెప్టెంబర్ 25న ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇందులో ప్రభాకర్, తన కొడుకు చంద్రహాస్‌తో కలిసి సందడి చేశారు. త్రివర్ణ పతాకం పట్టుకుని స్టేడియంలో చంద్రహాస్ హంగామా చేశారు. ఈ సందర్బంగా స్టయిల్‌గా దిగిన ఫోటోలను పంచుకున్నారు.
ప్రభాకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొడుకుతో స్టేడియంలో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన `వాట్ ఏ మ్యాచ్ ` అంటూ కామెంట్ పెట్టారు. దీనికి ఆయన అభిమానులు స్పందిస్తూ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం ఎప్పటిలాగే చంద్రహాస్‌ని ఆడుకుంటున్నారు. హీరోగా సెట్ కావని కెరీర్ పాడు చేసుకోవద్దని, మంచి చదువులు చదువుకుని లైఫ్‌లో సెట్ కావాలి అంటూ సలహాలిస్తున్నారు. ట్రోల్స్ తో మరోసారి రెచ్చిపోతున్నారు.
ఇటీవల ప్రభాకర్ కొడుకు చంద్ర హాస్ హీరోగా సినిమాని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవంలో చంద్రహాస్ స్టయిల్ పడే తీరుపై కామెంట్లు చేశారు. తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు.
దీంతో ఒక్కసారిగా హైలైట్ అయ్యాడు చంద్రహాస్. ఎలాంటి ఖర్చు లేకుండానే కోట్ల పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో మరే యంగ్ హీరోకి లేనంత క్రేజ్, పాపులారిటీ రావడం విశేషం.