Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Poorna Wedding Date: మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ చేసుకున్న `ఢీ` భామ.. షాకింగ్‌ స్టేట్‌మెంట్‌.. సినిమాలకు గుడ్‌బై?

Poorna Wedding Date: మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ చేసుకున్న `ఢీ` భామ.. షాకింగ్‌ స్టేట్‌మెంట్‌.. సినిమాలకు గుడ్‌బై?

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు `ఢీ` షోతో టీవీ ఆడియెన్స్ కి దగ్గరైంది పూర్ణ. ఇప్పుడు మరో టీవీ షోలో సందడి చేస్తున్న ఈ హాట్‌ భామ పెళ్లి చేసుకోబోతుంది.   

Aithagoni Raju | Published : Jul 03 2022, 09:14 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

`ఢీ` బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూర్ణ(Poorna) `ఢీ`13వ షోకి జడ్జ్ గా చేసిన విషయం తెలిసిందే. వచ్చీ రాని తెలుగుతో ఆమె మాట్లాడే మాటలు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఎంతగానే ఆకట్టుకున్నాయి. పైగా ట్రెండీ వేర్‌లో కనిపిస్తూ కుర్రాళ్లని ఆకర్షించింది. తనకు అభిమానులుగా, సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్ గా మార్చుకుంది. 

26
Asianet Image

నటిగానూ పుంజుకుంటోంది పూర్ణ. ఇటీవల `దృశ్యం 2`, `అఖండ`, `తలైవి` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. ముఖ్యంగా `అఖండ`లో ఆమె చేసిన పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. కొన్ని బోల్డ్ సీన్లలోనూ నటించి షాకిచ్చింది. దీంతో కాస్త క్రేజ్‌ తగ్గుతున్న సమయంలో ఆమెకి మరింత క్రేజ్‌ పెరిగిందని చెప్పొచ్చు. 
 

36
Asianet Image

ఇదిలా ఉంటే ఇటీవల సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు ప్రకటించి షాకిచ్చింది పూర్ణ. విదేశాలకు వెళ్లేందుకు వీసాలను అందించే సంస్థని నిర్వహిస్తున్న షానిద్‌ అసిఫ్‌ అలీతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది పూర్ణ. దీంతో అభిమానులకు గుండెలో రాయి వేసినంత పనిచేసింది. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్‌ చేసింది. 
 

46
Asianet Image

ఇక ఇప్పుడు మ్యారేజ్‌కి(Poorna Wedding) సిద్ధమవుతుంది పూర్ణ. తన మ్యారేజ్‌ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఏడాదిలో మ్యారేజ్‌ చేసుకోబోతున్నారట. నవంబర్‌ 6న షానిద్‌తో మ్యారేజ్‌ జరగబోతుందని ఓ ఇంటర్వ్యూలో పూర్ణ చెప్పడం విశేషం. ఓ టీవీ(ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం) షోలో పాల్గొన్న పూర్ణ నవంబర్‌లో తన మ్యారేజ్‌ ఉంటుందని తెలిపింది. 

56
Asianet Image

అదే సమయంలో తాను ప్రేమించి పెళ్లి(Poorna Marriage) చేసుకుంటుందనే రూమర్స్ ఊపందుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించింది పూర్ణ. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లినే అని పేర్కొంది. మ్యారేజ్‌ అనంతరం దుబాయ్‌ వెళ్లిపోతానని పేర్కొంది. మొత్తంగా మ్యారేజ్‌ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుందనే విషయాన్ని పరోక్షంగా హింట్‌ ఇచ్చింది పూర్ణ. 
 

66
Asianet Image

తెలుగులో పూర్ణ బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న విషయం తెలిసింఏద. `సీమటపాకాయ్‌` చిత్రంతో ఆమె టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమా విజయం సాధించడంతో వరుస ఆఫర్లు అందుకుంది. `లడ్డుబాబు`, `అవును`, `అవును 2`, `శ్రీమంతుడు`, `సుందరి`, వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తమిళం, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `తీస్‌ మార్‌ ఖాన్‌` ఒకటి. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories