Poorna : సంప్రదాయ దుస్తుల్లో మహాలక్ష్మిలా ‘పూర్ణ’.. నవ్వులతో పూలు పూయించేస్తోంది.
హీరోయిన్ పూర్ణ స్లో పాయిజన్ లా తన క్రేజ్ ను పెంచుకుంటోంది. అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో పాపులారిటీని మరింతగా పెంచేస్తోంది. మరోవైపు పలు షాపింగ్ మాల్స్ ల ప్రారంభోత్సవాలకు కూడా హాజరవుతూ బిజీగా ఉంటోంది.

హీరోయిన్ పూర్ణ పూర్తిగా తెలుగింటి అమ్మాయిలా మారిపోయింది. ఎప్పుడూ బిగుతైన దుస్తులు ధరించి సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ బ్యూటీ, నిండైన బట్టల్లో సంప్రదాయంగా కనిపిస్తోంది. తరచుగా చుడిదార్ లుక్ లో దర్శనమిస్తున్న పూర్ణ ట్రెడిషనల్ లుక్ లో కన్నుల పండుగ చేస్తున్నారు.
రియాలిటీ షోలతో పూర్ణ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు అయ్యారు. డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. అయితే లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి పూర్ణ తప్పుకున్నారు. కారణం ఏదైనా ప్రియమణి కొనసాగుతుండగా పూర్ణ మాత్రం ఢీ 14 చేయడం లేదు.
ఇది ఒకింత ఆమె ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. పూర్ణతో పాటు సుడిగాలి సుధీర్, యాంకర్స్ రష్మీ (Rashmi gautam) , దీపికా పిల్లిని కూడా తప్పించడం విశేషం. వీరందరి నిష్క్రమణతో షోలో కొంచెం ఊపు తగ్గింది. ఇటీవల స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోకి పూర్ణ జడ్జిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
త్రీ రోజెస్ (3 Rojes) తో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూర్ణ . కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. తాజాగా హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) హీరోహీరోయిన్లుగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీలోనూ నటించింది పూర్ణ.
చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా ఎక్కడా ఏ అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకుంటూ వెళ్తున్నారు పూర్ణ. ఆమె ఇమేజ్ కి తగ్గ ఆఫర్స్ తో బిజీగా గడుపుతున్నారు. పూర్ణ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగు అయ్యాయి. అందుకే ఆమె తెలివిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
ఇటు సినిమా, టీవీ షోల్లో వచ్చే ఆఫర్లతోనూ చిన్న చిన్న మాల్స్ ఓపెనింగ్, ప్రారంభోత్సవాలకు కూడా పూర్ణ గెస్ట్ గా హాజరవుతున్నారు. తాజాగా ఓ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైంది పూర్ణ. ఎరుపు రంగు పట్టుచీరలో ఎర్రచందనంలా దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో అందరిని ఆకట్టుకుంది.