MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హైపర్‌ ఆది, పూర్ణ, దీపికా పిల్లి కాంబో రిపీట్‌.. ఈ సారి రచ్చ వేరే లెవల్‌.. ఢీ ప్రీమియర్‌ లీగ్‌ షురూ..

హైపర్‌ ఆది, పూర్ణ, దీపికా పిల్లి కాంబో రిపీట్‌.. ఈ సారి రచ్చ వేరే లెవల్‌.. ఢీ ప్రీమియర్‌ లీగ్‌ షురూ..

పూర్ణ, హైపర్‌ ఆది, దీపికా పిల్లి మరోసారి `ఢీ` షోలోకి రాబోతున్నారు. వీరితోపాటు కొందరు సర్‌ప్రైజింగ్‌ స్టార్స్ సందడి చేయబోతుండటం విశేషం. ఈ సారి షో లో రచ్చ మామూలుగా ఉండదట. గ్లామర్‌, వినోదం నెక్ట్స్ లెవల్‌ అంటున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 21 2023, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు టెలివిజన్స్ లో పాపులర్‌ డాన్సు షోగా నిలిచింది `ఢీ`. ఇప్పటి వరకు పదిహేను సీజన్లు పూర్తయ్యాయి. ఈ సారి 16వ సీజన్‌ చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. గ్లామర్‌, హంగామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ మేళవింపుతో రచ్చ రచ్చ చేసేందుకు వస్తున్నారు. నేటి(జూన్‌ 21) నుంచీ ఈ సరికొత్త సీజన్ ప్రారంభమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో క్రేజీ సెలబ్రిటీలు సందడి చేయడం విశేషం. 

26

తాజాగా విడుదలైన ప్రోమో చాలా క్రేజీగా ఉంది. అయితే ఈ సారి `ఢీ`రెట్టింపు ఎనర్జీతో, మరింత స్పెషల్‌ గా రాబోతుంది. అందుకు పేరు కూడా మార్చారు. `ఢీ ప్రీమియర్‌ లీగ్‌` పేరుతో ఈ 16వ సీజన్‌ని స్టార్ట్ చేస్తుండటం విశేషం. ఇందులో గత సీజన్ లో సందడి చేసిన కమెడియన్‌ బ్యాచ్‌ని దించారు. హైపర్‌ ఆదిని గత  సీజన్‌లో తొలగించారు. ఇప్పుడు ఆయన్ని మళ్లీ తీసుకొచ్చారు. రావడం రావడంతోనే తనదైన స్టయిల్‌లో పంచ్ లు, సెటైర్లు, కామెడీతో నవ్వులు పూయించారు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో రచ్చ చేశాడు హైపర్‌ ఆది. 
 

36

గ్లామర్‌ సైడ్‌ దీపికా పిల్లిని దించారు. గత రెండు సీజన్లలో ఈ బ్యూటీని పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి తీసుకొచ్చారు. ఆమె రావడం రావడంతో డాన్సులతో రచ్చ చేసింది. కిర్రాక్‌ లుక్‌, డాన్సుతో ఫిదా చేసింది. ఆమెతోపాటు జడ్జ్ గా హాట్‌ బ్యూటీ పూర్ణ వచ్చింది. ఆమె గత సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. పెళ్లి, ప్రెగ్నెంట్‌ కావడంతో దూరంగాఉన్నారు. ఇప్పుడు  నార్మల్‌ స్థితికి రావడంతో మళ్లీ తీసుకొచ్చారు. అప్పుడు హాట్‌గా అలరించిన పూర్ణ ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. క్యూట్‌గానూ అయ్యింది. ఆమెతోపాటు శేఖర్‌ మాస్టర్‌ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
 

46

ఇందులో మేల్స్ డాన్సర్ల టీమ్‌ వైపు లీడర్స్ గా బిగ్‌ బాస్‌ విన్నర్‌ సన్నీని దించారు. బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో సన్నీ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సన్నీతోపాటు కమెడియన్‌ సుదర్శన్‌ సైతం వచ్చారు. అలాగే హీరో వరుణ్‌ సందేశ్‌ కూడా షోలో భాగం కాబోతున్నారు. మరి ఆయన గెస్ట్ గా వచ్చారా? షో మొత్తం ఉంటారా? అనేది చూడాలి. ఇక యాంకర్‌గా ప్రదీప్‌ కంటిన్యూ అవుతున్నారు. 

56

గత సీజన్‌లో `ఢీ` అంత కిక్‌ ఇవ్వలేదు. స్టార్‌ కమెడియన్లు లేకపోవడం, గ్లామర్‌ డోస్‌ తగ్గడంతో ఆడియెన్స్ అంతగా ఆసక్తి చూపలేదు. గత సీజన్ లో కేవలం శ్రద్ధా దాస్‌ మాత్రమే గ్లామర్‌ సైడ్‌ ఆకట్టుకుంది. కానీ వినోదం మిస్‌ అయ్యింది. దానికి రేటింగ్‌ కూడా తగ్గడంతో ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టింది టీమ్‌. ఇప్పుడు ఫుల్‌ ఫ్యాక్డ్ గా `ఢీ ప్రీమియర్‌ లీడ్‌`ని తీసుకురానుండటం విశేషం. మరి ఇది ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో, అలరిస్తుందో చూడాలి. 
 

66

ఢీ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన టాలెంట్‌ ఉన్న డాన్సర్లని వెలికితీసే ప్రోగ్రామ్‌. ఈ సారి నాలుగు టీమ్‌ల మధ్య పోటీగా ఈ షోని నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, నెల్లూరు ల నుంచి నాలుగు టీమ్‌లు చేశారు. వీరిలో `హైదరాబాద్‌ ఉస్తాద్స్`, `బెజవాడ టైగర్స్`, `నెల్లూరు నెరజాణలు`, `ఓరుగల్లు వీరులు` లుగా ఈ నాలుగు టీమ్‌లు డాన్సు షోలో రచ్చ చేయబోతున్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 30 Days Collections: జవాన్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన ధురంధర్‌.. బాలీవుడ్‌లో నెం 1.. కలెక్షన్లు ఎంతంటే?
Recommended image2
Jana Nayakudu Trailer: `భగవంత్‌ కేసరి`ని మక్కీకి మక్కీ దించేసిన విజయ్‌.. కొత్తగా చూపించింది ఇదే.. వాళ్లకి వార్నింగ్‌
Recommended image3
Sreemukhi: అక్కా తనూజ, కళ్యాణ్‌ని కలపండి.. శ్రీముఖికి నెటిజన్ల క్రేజీ రిక్వెస్ట్ లు.. డోస్‌ తగ్గించడంపై ఆందోళన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved