- Home
- Entertainment
- పూర్ణకి రెండు ఖరైదీన గిఫ్ట్స్ ఇచ్చిన భర్త.. ఒంటినిండా బంగారం, లగ్జరీ బంగ్లా.. విలువ తెలిస్తే మైండ్ బ్లాకే
పూర్ణకి రెండు ఖరైదీన గిఫ్ట్స్ ఇచ్చిన భర్త.. ఒంటినిండా బంగారం, లగ్జరీ బంగ్లా.. విలువ తెలిస్తే మైండ్ బ్లాకే
`ఢీ` భామగా పాపులర్ అయిన పూర్ణ మ్యారేజ్ చేసుకుని అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు పూర్ణ మ్యారేజ్ కి సంబంధించి మరో ఆసక్తికర విషయం వైరల్‌గా మారింది.

హాట్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో రాణించిన పూర్ణ(Poorna) ఇప్పుడు కీలక పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ హాట్ భామ దీపావళి పండుగ సందర్భంగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసి సర్‌ప్రైజ్ చేసింది. జూన్‌లోనే తన పెళ్లి జరగ్గా, ఆ విషయాన్ని లేట్‌గా తెలియజేసింది. అభిమానులకు పెద్ద షాకిచ్చింది. (Poorna Wedding Photos)
poorna married
ఇదిలా ఉంటే ఇందులో పూర్ణ(షమ్నా కాసిమ్) పెళ్లి దుస్తుల్లో భారీగా నగలు వేసుకుని దగదగ మెరిసిపోతుంది. ఆ నగలు ఆమె అందాన్ని మరింతగా పెంచాయి. ప్రస్తుతం ఫోటోలు వైరల్‌అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ నగలన్నీ తన భర్త షానిద్ అసిఫ్ అలీ గిఫ్ట్ గా ఇచ్చినవే అని తెలుస్తుంది.
poorna married
మెడలో పది వరుసల్లో చైన్స్ ఉన్నాయి. అవన్నీ బంగారంతో తయారు చేసినవే. మరోవైపు పాపడ బిల్లా, చేతికి నాలుగైదు వరుసల బంగారు గాజులు, నడుము వడ్డెణం ఉన్నాయి. ఇవన్నీ కలిసి 170 తులాలు(1.700కేజీ) ఉంటాయట. అంటే దీని విలువ కోటికిపైనే అనే విషయం తెలిసిందే. దీంతోపాటు ఓ లగ్జరీ బంగ్లా ని గిఫ్ట్ గా ఇచ్చాడని తెలుస్తుంది. దీని విలువల కోట్లల్లో ఉంటుందని టాక్. పెళ్లికి ముందే ఈ రెండు భారీ గిఫ్ట్ లతో పూర్ణని సర్‌ప్రైజ్ చేశాడట షానిద్. దీంతో ఢీ భామ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
poorna married
ఇదిలా ఉంటే పూర్ణ ఎంగేజ్‌మెంట్ మే 31న జరిగిందని, జూన్ 12న దుబాయ్‌లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఆమె వివాహం జరిగిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూర్ణ వెల్లడించింది. త్వరలోనే కేరళాలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. షానిద్ అసిఫ్ అలీ దుబాయ్ బేస్డ్ ఇండియన్ వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి హోనర్. దుబాయ్‌లో ఇది బిజినెస్ సర్వీస్‌ని, వీసాలను అందిస్తుంది.
ఇక `అవును` చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. హాట్ అందాలతో కనువిందు చేసింది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చిన్న బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇటీవల `అఖండ`, `దృశ్యం2` చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం నాలుగైదు సౌత్ సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు `ఢీ` షోకి ఆమె జడ్జ్ గానూ వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుంది పూర్ణ.