- Home
- Entertainment
- Poonam Pandey: రాత్రంతా నా వీడియోలు చూడడం, ఉదయం లేచి తిట్టడం.. అసలు సిగ్గులేనిది వాళ్ళకే
Poonam Pandey: రాత్రంతా నా వీడియోలు చూడడం, ఉదయం లేచి తిట్టడం.. అసలు సిగ్గులేనిది వాళ్ళకే
నటి పూనమ్ పాండే జీవితం ఎక్కువగా వివాదాలతో నిండి ఉంటుంది. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. ఆ మధ్యన అశ్లీల చిత్రాలతో రచ్చ చేసింది.

నటి పూనమ్ పాండే జీవితం ఎక్కువగా వివాదాలతో నిండి ఉంటుంది. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. ఆ మధ్యన అశ్లీల చిత్రాలతో రచ్చ చేసింది. ఎవరేమనుకున్నా నా పంథా ఇంతే అంటూ బోల్డ్ గా అశ్లీల చిత్రాల్లో నటించింది. దీని కోసం పూనమ్ పాండే సొంతంగా ఓ యాప్ ని లాంచ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా పూనమ్ పాండే ప్రస్తుతం కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' అనే రియాలిటీ షోలో పాల్గొంటోంది. ఈ షోలో పూనమ్ పాండే తన పర్సనల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పూనమ్ పాండే డైరెక్ట్ గా తన అస్లీల వీడియోల గురించి బోల్డ్ గా కామెంట్స్ చేసింది. తనతో పాటు షోలో పాల్గొంటున్న ఇతర కంటెస్టెంట్స్ అయిన అంజలి అరోరా, తహసీన్ లతో మాట్లాడుతూ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది.
వీరి మధ్య పూనమ్ పాండే అస్లీల వీడియోల గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అంజలి అరోరా మాట్లాడుతూ తానూ ఎదుర్కొన్న ఇబ్బందులు.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేయడం వల్ల తన రిలేటివ్స్ తనని దూరం పెట్టిన విధానం ఇతర విషయాల గురించి మాట్లాడింది. అంజలి అరోరా తరచుగా ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లని వేడెక్కిస్తూ ఉంటుంది.
ఇంతలో పూనమ్ పాండే తన ఎరోటిక్ వీడియోల గురించి ప్రస్తావించింది. నా బట్టలు విప్పుకుని నా బాడీ చూపంచినంత మాత్రానే నేను సిగ్గులేని దాన్ని ఐపోతానా. అలా ఎవరైనా అంటే అస్సలు అంగీకరించను. ఇతరులని ఇబ్బంది పెడుతూ.. వాళ్ళని బాధపడేలా చేసే వారే అసలైన సిగ్గులేనివాళ్ళు అంటూ పూనమ్ పాండే హాట్ కామెంట్స్ చేసింది.
వారితో పాటు అక్కడే ఉన్న తహసీన్ తన అభిప్రాయం తెలిపాడు. పూనమ్ పాండే వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని చూసే వాళ్లే ఆమె గురించి చెడుగా మాట్లాడతారు అంటూ తహసీన్ తెలిపాడు. దీనికి కొనసాగింపుగా పూనమ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తహసీన్ తో నేను అంగీకరిస్తాను. నా వీడియోలకు నెలకు 200 మిలియన్ల వ్యూస్, 60 మిలియన్ల ఇంప్రెషన్స్ వస్తాయి. ఈ స్థాయిలో నా వీడియోలు చూస్తున్న వారంతా ప్రజలు కాదా? వీళ్లంతా రాత్రి నా వీడియోలు చూస్తారు. పొద్దునే లేచి నన్నే ట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఇక్కడ నిజంగా సిగ్గులేనిది ఎవరికి ? నాకా.. నా వీడియోలు చూసేవారికా ? అంటూ పూనమ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
పనీపాటా లేకుండా మహిళలు గ్రూపులుగా కూర్చుని ఇతర మహిళల గురించి సీక్రెట్స్ మాట్లాడుకుంటారు. ఈ సమాజం అలాంటిది. వాళ్ళ బాధంతా నా గురించే.. నేను ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాను.. పెళ్లి చేసుకుంటానా లేదా ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకుంటారు. కానీ నా లైఫ్ లో నేను ఎలాంటి పనులు చేయాలో నిర్ణయించుకునే హక్కు నాకుందని వాళ్లకు తెలియదు అంటూ పూనమ్ కామెంట్స్ చేసింది.
అలాగే లాక్ అప్ షోలో పూనమ్ తన పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి విషయాలు దాచుకోవడం లేదు. ఆ మధ్యన పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై గృహ హింస కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సామ్ బాంబే ఉదయం ఉంచి రాత్రి వరకు మద్యం సేవిస్తూ తనని హింసించేవాడని పూనమ్ ఈ షోలో పేర్కొంది.