MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Poonam Kaur:నేను ప్రేమించిన వ్యక్తి అవసరాల కోసం వ్యక్తిత్వం చంపుకుంటున్నాడు... పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

Poonam Kaur:నేను ప్రేమించిన వ్యక్తి అవసరాల కోసం వ్యక్తిత్వం చంపుకుంటున్నాడు... పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur)ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయి. నిన్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. పూనమ్ పరోక్షంగా ఈ సభను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారని తెలుస్తుంది. సదరు ట్వీట్ ని ఆమె డిలీట్ చేయడం మరింత వివాదం అవుతుంది. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 24 2022, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


పూనమ్ కౌర్ నటిగా కంటే కూడా వివాదాలతోనే ఫేమస్ అయ్యారు. పరిశ్రమలో ఓ బడా హీరో చేతిలో ఆమె మోసపోయారన్నది టాక్. దివంగత క్రిటిక్, నటుడు కత్తి మహేష్ అప్పట్లో పూనమ్ కౌర్ పరిశ్రమలో ఎలా మోసపోయారో, ఆమెను ఎవరు మోసం చేశారో బహిరంగంగా ప్రకటించారు.  ఆయన ఆరోపణలు సంచలనం రేపాయి. 
 

26

కొన్ని సందర్భాల్లో కత్తి మహేష్ ఆరోపణలు పూనమ్ కౌర్ ఖండించారు. అయితే పరోక్షంగా ఆమె సదరు హీరోని టార్గెట్ చేయడంతో కత్తి మహేష్ ఆరోపణల్లో నిజం ఉందన్న వాదన బయలుదేరింది. పూనమ్ కౌర్ ని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ స్టార్ హీరో దారుణంగా మోసం చేశాడని, డబ్బులతో సెటిల్ చేసుకున్నాడనేది టాలీవుడ్ లో కొందరి వాదన. 

36

తనకు సదరు హీరో చేసిన మోసానికి ప్రతీకారంగా సమయం దొరికినప్పుడల్లా ఇలా పరోక్షమైన పోస్టులతో తన ఆవేదన వెళ్లగక్కుతుందన్న అభిప్రాయం ఉంది. తాజాగా పూనమ్ ట్విట్టర్ లో ఓ కామెంట్ చేశారు. ''నేను మనస్ఫూర్తిగా ఆరాధించి, ప్రేమించి వ్యక్తులు ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళకి వాళ్ళు తక్కువ చేసుకొని, చేతులు జోడించి, చేతులు కట్టుకొని ఉండండం నాకు చాలా బాధగా ఉంది. అవసరాల కోసం కష్టపడి తెచ్చుకున్న వ్యక్తిత్వం వదులుకోవడం మానేయాలి'' అని ట్వీట్ చేశారు. 
 

46

ఈ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేయడం జరిగింది. అనంతరం ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఏంజరిగింది? కానీ ఇప్పుడు పెద్ద నేరం ఏమిటీ? మనం దేని మీద దృష్టి పెట్టాలి? పెళ్లిళ్ల మీద!'' అంటూ మరో ట్వీట్ చేసింది. మరో ట్వీట్ లో నిజం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సత్యమేవ జయతే అంటూ ట్యాగ్ వేసింది. 

56


పూనమ్ వేసిన ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan)గురించే అని నెటిజెన్స్ భావిస్తున్నారు. దీనితో ఆయన్ని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అటెన్షన్ కోసం వచ్చింది అంటూ తిట్టిపోస్తుంటే, యాంటీ ఫ్యాన్స్ మీ వెనుక మేము ఉన్నాం.. ముందు చెప్పాల్సింది సూటిగా చెప్పండి, భయపడొద్దు అంటున్నారు. 

66

పూనమ్ ట్వీట్ ద్వారా సినిమా కోసం పవన్ రాజకీయ నాయకుల దగ్గర తనని తాను తక్కువ చేసుకుంటున్నట్లు, మరొక ట్వీట్ లో గత ఎన్నికల్లో జరిగిన ప్రభావాలను మరిచిపోయి సినిమాలు చేసుకుంటూ అసలు విషయం మారుస్తున్నారని పూనమ్ పరోక్షంగా కౌంటర్ వేసినట్లు అనిపిస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved