- Home
- Entertainment
- Pooja Vs Rashmika:నువ్వా..నేనా అని పోటీ పడుతున్న పూజా హెగ్డే, రష్మిక.. తగ్గేదే లే అంటున్న ముద్దుగుమ్మలు
Pooja Vs Rashmika:నువ్వా..నేనా అని పోటీ పడుతున్న పూజా హెగ్డే, రష్మిక.. తగ్గేదే లే అంటున్న ముద్దుగుమ్మలు
తెలుగు, తమిళ్ , హిందీ అన్న తేడా లేదు . పెద్ద హీరోలా.. చిన్న హీరోలా అన్న డిఫరెన్స్ లేదు. సీనియర్లా, జూనియర్లా అన్న వేరియేషన్ లేదు. ఏ ఇండస్ట్రీ చూసినా , ఏ హీరో పక్కన చూసినా .. ఏ సీజన్ లో చూసినా రష్మిక, పూజా హెగ్డే ..ఈ ఇద్దరి సినిమాలే . హీరోయిన్లు నాలగైదు సినిమాలు చేసి మాయమైపోతున్న ఈరోజుల్లో ... ఆ ఇద్దరు మాత్రం చెరో ఆరు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

నువ్వా నేనా అన్నట్టు హవా చాటుతున్నారు పూజా హెగ్డే, రష్మికా. స్టార్స్ సినిమాలు సెట్స్ పైకెళ్తున్నాయంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్ కావాల్సిందే అన్నట్టు దూకుడు చూపిస్తున్నారు. స్టార్ హీరోలే కాదు .. యంగ్ హీరోలతో సైతం కూడా జత కడుతున్నారు ఈ ముద్దు గుమ్మలు. .ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా సౌత్ టూ నార్త్ 12 సినిమాలు చేస్తూ ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు రష్మి, పూజాహెగ్డే.
సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన పూజాహెగ్డే అకౌంట్ లో ఉన్న వన్నీ స్టార్ హీరోల సినిమాలే. తెలుగు నుంచి బాలీవుడ్ వరకూ పూజా 6 సినిమాలు చేస్తోంది. పూజా చేస్తున్న సినిమాలన్నీ రిపీట్ కాంబినేషన్సే. ఏరి కోరి మరీ రెండో సారి , మూడోసారి పూజానే కావాలంటున్నారు హీరోలు, డైరెక్టర్లు . ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో ..మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ , ప్రభాస్, బన్నీ లాంటి టాప్ హీరోలందరితో తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలు చేసేస్తోంది. వరుసగా మూడు ప్లాప్ లు వచ్చినా.. పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
తెలుగులో ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటిస్తున్న పూజాహెగ్డే ...హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా చేసే చాన్స్ కొట్టేసింది. అంతేకాదు .. మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలోనే సినిమా స్టార్ట్ చెయ్యబోతోంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే తమిళ్ లో స్టార్ హీరో విజయ్ తో స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ బీస్ట్ మూవీ చేసింది.
ఒక పక్క తెలుగు ,తమిళ్ సినిమాలతో పాటు హిందీ సినిమాలతో కెరీర్ బెస్ట్ టైమ్ ని ఎంజాయ్ చేస్తోంది పూజాహెగ్డే . సౌత్ లో ఇన్ని సినిమాలు చేస్తూ..బిజీగా ఉన్న పూజాహెగ్డే ..అటు బాలీవుడ్ ని కూడా మేనేజ్ చేస్తోంది. పూజాహెగ్డే ఇప్పుడు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో సర్కస్ మూవీ కంప్లీట్ చేసేసింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళి మూవీ మీద ఫుల్ ఎక్సైటెడ్ గాఉన్నానంటోంది పూజా .
ఇక పూజా సంగతలా ఉంటే రష్మిక మాత్రం నేనేం తక్కువ తినలేదంటోంది. నేషన్ వైడ్ ఫాలోవర్స్ ను అకౌంట్ లో వేసుకుని దూసుకపోతోంది ఈ కన్నడ కస్తూరి. ఒక్కసారిగా సమంతా, పూజా హెగ్డేలను వెనక్కి నెట్టేసి మరీ టాలీవుడ్ లో దూసుకొచ్చిన బ్యూటీ... సౌత్ లో అటు నార్త్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. పుష్ప 2 ప్రాజెక్ట్ చేతిలో పెట్టుకుని ..మరో 2తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మొత్తం 6 సినిమాల్ని లైన్లో పెట్టేసింది.
మహేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు .,.శర్వానంద్ , నితిన్ లాంటి యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేసిన రష్మిక లేటెస్ట్ గా హనురాఘవ పూడి-దుల్కర్ సల్మాన్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. వీటితో పాటు లేటెస్ట్ గా తమిళ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న సినిమా మొదలుపెట్టేసింది.
తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా బాలీవుడ్ మీద గట్టిగానే కాన్సన్ ట్రేట్ చేసింది రష్మిక. అందుకే అక్కడ బ్యాక్ టూ బ్యాక్ 3 సినిమాలు లైన్లోపెట్టేసింది. సిద్దార్ద్ మల్హోత్రా తో మిషన్ మజ్ను కంప్లీట్ కాకుండానే అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై స్టార్ట్ చేసింది. ఈ సినిమా కంప్లీట్ అయ్యిందో లేదో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న యానిమల్ మూవీ లో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
ఇలా చెరో 6 సినిమాలతో సౌత్ టూ నార్త్ సినిమాలు చేస్తూ...ఫుల్ బిజీగా ఉన్నారు పూజా, రష్మి. క్రేజీ ఆఫర్స్ వచ్చినప్పుడు చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా ఉన్నా.. పూజా ఎఫ్ 3 కోసం ఐటమ్ సాంగ్ చేసింది. రష్మిక కూడా శర్వానంద్ లాంటి 2 టైర్ హీరోలతో కూడా సినిమాలు చేసింది. అంతే కాదు ఇ ఇద్దరు హీరోయిన్లకు వరుసగా కొన్ని ఫ్లాప్ లు వచ్చినా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.