MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ఒక్క దెబ్బతో కుంభస్థలాన్ని కొట్టిన రష్మిక.. పూజా, తమన్నా, రకుల్‌ లు ఇంకా పోరాడుతూనే ఉన్నారు..

ఒక్క దెబ్బతో కుంభస్థలాన్ని కొట్టిన రష్మిక.. పూజా, తమన్నా, రకుల్‌ లు ఇంకా పోరాడుతూనే ఉన్నారు..

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా `యానిమల్‌` హిట్‌తో జోరుమీదుంది. నేషనల్‌ క్రష్‌ దాటి ఆమె పేరు, గుర్తింపు వస్తుంది. ఎక్కడ చూసినా తన గురించే చర్చగా మారింది. 
 

Aithagoni Raju | Updated : Dec 11 2023, 09:06 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

తెలుగు నుంచి వెళ్లిన హీరోయిన్లు బాలీవుడ్‌లో సక్సెస్‌ కాలేకపోయారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, పూజా హెగ్డే, తమన్నా వంటి కథానాయికలు అక్కడ కొట్టుకుంటున్నారు. సరైన విజయాలు లేక, సరైనా ఆఫర్లు లేక తడబాటుకి గురవుతున్నారు. బాలీవుడ్‌కి వెళ్లడంతో ఇటు తెలుగులోనూ ఆఫర్లు తగ్గడం, అటూ హిందీలోనూ సరైన సినిమాలు రాకపోవడంతో దైలమాలో పడ్డారు. 
 

26
Asianet Image

రకుల్‌ మూడేళ్ల క్రితమే బాలీవుడ్‌కి చెక్కేసింది. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేసినా సక్సెస్‌ కాలేదు. కానీ అజయ్‌ దేవగన్‌తో చేసిన `దే దే ప్యార్‌ దే` తో ఆమెకి అక్కడ ఆదరణ దక్కింది. దీంతో వరుసగా పది సినిమాల వరకు సైన్‌ చేసింది. ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్‌ చేస్తూ వచ్చింది. కానీ చెప్పుకో దగ్గ హిట్‌ ఒక్కటి కూడా రాలేదు. ఇంకా స్ట్రగుల్‌ అవుతూనే ఉంది. ఇంకా అక్కడ స్టార్‌ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. 
 

36
Asianet Image

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా హిందీపై ఓ కన్నేసే ఉంది. ఆమె కూడా తెలుగులో సినిమాలు చేస్తున్నా, మధ్య మధ్యలో నార్త్ ఆడియెన్స్ ని పలకరిస్తూనే ఉంది. ఏడాదిలో ఒకటి అర సినిమాలతో మెరుస్తుంది. కానీ ఇటీవల మిల్కీ బ్యూటీ కూడా తెలుగులో సినిమాలు తగ్గించి హిందీపై ఫోకస్‌ పెట్టింది. అక్కడ సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ మెరుస్తుంది. `జీ కర్దా`, `లస్ట్ స్టోరీస్‌ 2` సిరీస్‌లో మెరిసింది. ఏకంగా బోల్డ్ సీన్లు చేసింది. బెడ్‌ సీన్లలో రెచ్చిపోయింది. తమన్నా ఏంటీ ఇంతగా తెగించిందనే దేశం మొత్తం మాట్లాడుకుంది. కానీ ఈ బ్యూటీకి రావాల్సిన పేరు రాలేదు, సక్సెస్‌ రాలేదు. జస్ట్ సెన్సేషన్‌ మాత్రమే అయ్యింది. 

46
Asianet Image

ఇక పూజా హెగ్డే పరిస్థితి కూడా అదే. ఆమె ఏడాది క్రితం వరకు తెలుగులో టాప్‌ హీరోయిన్. కానీ వరుస పరాజయాలను ఆమె చవిచూసింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. అయితే అప్పటికే ఒకటి రెండు సినిమాలతో హిందీలో ఓ కట్చీఫ్‌ వేసి పెడుతుంది పూజా. ఇటీవల పూజా రెండు మూడు హిందీ సినిమాల్లో నటించింది. కానీ హిట్‌ దక్కలేదు. పరాజయాలు ఆమెని అక్కడ కూడా కుదురుగా ఉండనివ్వడం లేదు. 

56
Asianet Image

దీంతో పూజా హెగ్డే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తమన్నా వంటి సీనియర్‌ భామలు, ఒకప్పుడు టాలీవుడ్‌ ని దున్నేసిన ఈ భామలు ఇప్పుడు నార్త్‌లో మాత్రం  సక్సెస్‌ కాలేకపోతున్నారు. అడపాదడపా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. విజయం కనికరించడం లేదు. దీంతో ఇంకా స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నారు. సక్సెస్‌ అనేది వారితో దోబూచులాడుతూనే ఉంది.  కానీ రష్మిక మందన్నా అలా కాదు. 
 

66
Asianet Image

తెలుగులోకి వచ్చిన అనతి కాలంలోనే నేషనల్‌ క్రష్‌గా పేరుతెచ్చుకుంది రష్మిక మందన్నా. ఆమె తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. `పుష్ప`తో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. అయితే హిందీలో ప్రారంభంలో చేసిన రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. కానీ కొంత గ్యాప్‌తో మాత్రం గట్టిగా కొట్టింది. `యానిమల్‌` సినిమాతో ఏకంగా కుంభస్థలాన్నే కొట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దీంతో ఒకే సినిమాతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ని తెచ్చుకుంది. పాపులర్‌ అయిపోయింది. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనే పేరుని కూడా తెచ్చుకుంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేలా ఆమె రాణిస్తుండటం విశేషం.  

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
ఆ హీరోయిన్‌తో 30ఏళ్ల ఘాటు ప్రేమ, సన్నీ డియోల్‌ ఆమెని పెళ్లెందుకు చేసుకోలే
ఆ హీరోయిన్‌తో 30ఏళ్ల ఘాటు ప్రేమ, సన్నీ డియోల్‌ ఆమెని పెళ్లెందుకు చేసుకోలే
మహేష్‌ బాబు మరదలికి కరోనా పాజిటివ్‌, అభిమానులకు నమ్రత శిరోద్కర్‌ చెల్లి రిక్వెస్ట్
మహేష్‌ బాబు మరదలికి కరోనా పాజిటివ్‌, అభిమానులకు నమ్రత శిరోద్కర్‌ చెల్లి రిక్వెస్ట్
మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు హీరోగా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే?
మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు హీరోగా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే?
Top Stories