MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోలతో పనిలేదంటున్న రష్మిక, పూజా, సమంత, కీర్తిసురేష్‌.. కొత్త ఏడాదిలో దుమ్ములేపేందుకు ప్లాన్‌..

హీరోలతో పనిలేదంటున్న రష్మిక, పూజా, సమంత, కీర్తిసురేష్‌.. కొత్త ఏడాదిలో దుమ్ములేపేందుకు ప్లాన్‌..

సినిమా చాలా వేగంగా మారిపోతుంది. సినిమాల్లో ట్రెండ్‌ మారిపోతుంది. సరికొత్త ట్రెండ్‌కి రష్మిక, పూజా, సమంత, కీర్తిసురేష్‌ వంటి కథానాయికలు రెడీ అవుతున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 03 2024, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్‌ అంటే హీరోతో డ్యూయెట్లు పాడుకోవడం మాత్రమే కాదు, సినిమాని నడిపించడం కూడా అని అంటున్నారు నయా హీరోయిన్లు. సినిమాని తమ భుజాలపై మోయగలమని నిరూపిస్తున్నారు. ఇక హీరోతో పనిలేదంటున్నారు. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. నిజానికి ఈ మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల ట్రెండ్ చాలా కాలంగానే నడుస్తుంది. కానీ హీరోయిన్‌గా సీనియర్‌ అయ్యాక, కమర్షియల్‌ సినిమాలు చేయలేని పరిస్థితుల్లో, హీరోలకు దీటుగా ఇమేజ్‌ని పెంచుకున్నాక ఇలాంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసేవాళ్లు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. కెరీర్‌ ముగింపు దశ వరకు కాదు, మధ్యలోనే చేస్తున్నారు. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తున్నారు. మెప్పిస్తున్నారు. కీర్తి సురేష్‌ ఎప్పుడో ఈ ట్రెండ్‌ ప్రారంభించింది. కొనసాగిస్తుంది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, మరోవైపు స్టార్‌ హీరోల సరసన నటిస్తూ, కమర్షియల్‌ చిత్రాలు చేస్తుంది. 

36

ఇప్పటికే `మహానటి`, `పెంగ్విన్‌`, `మిస్‌ ఇండియా`, `గుడ్‌ లక్‌ సఖీ`, `సానీ కాయిదమ్‌` చిత్రాలు చేసింది. ఇప్పుడు `రఘు తాత`, `రివాల్వర్‌ రీటా` సినిమాల్లో నటిస్తుంది. తమిళంలోనే నాలుగు సినిమాలు చేస్తుండగా, అందులో మూడు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ కావడం విశేషం. ఓ రకంగా ఈ విషయంలో కీర్తి సురేష్‌ స్పీడుమీదుందని చెప్పొచ్చు. ఈ చిత్రాలన్నీ ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ఓ రకంగా ఏడాది మొత్తం కీర్తిసురేష్‌ రచ్చ నెక్ట్స్ లెవల్‌ లో ఉండబోతుందని చెప్పొచ్చు. 

46

ఈ జాబితాలో లేటెస్ట్ గా పూజా హెగ్డే కూడా చేరింది. ఇన్నాళ్లు కమర్షియల్‌ చిత్రాలతో మెప్పించింది. లక్కీ లెగ్‌నుంచి, ఐరన్‌ లెగ్‌ అనే ట్యాగ్‌ ని ఫేస్‌ చేసింది. దీంతో ఇప్పుడు రూట్‌ మార్చింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. తాజాగా ఈ భామ తమిళంలో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. `కోబ్రా` ఫేమ్‌ అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇది త్వరలోనే ప్రారంభం కానుందని, ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుందని తెలుస్తుంది. ఈ ఏడాది పూజాని లేడీ ఓరియెంటెడ్‌ కథలో చూడబోతున్నామని చెప్పొచ్చు. 
 

56

దీంతోపాటు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కూడా ఈ జాబితాలో చేరింది. ఆమె ఓ వైపు పాన్‌ ఇండియా చిత్రాలతో దుమ్మురేపుతుంది. అంతలోనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. `రెయిన్‌బో`, అలాగే `ది గర్ల్ ఫ్రెండ్‌` అనే చిత్రంలో నటిస్తుంది. రెండు ప్రేమ కథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ మూవీస్‌. ఇందులోనూ రష్మికనే మెయిన్‌ లీడ్‌. `రెయిన్‌బో` చిత్రానికి శాంతరుబన్‌ దర్శకుడు. `ది గర్ల్ ఫ్రెండ్‌` చిత్రానిక రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్టర్‌. ఈ రెండు చిత్రీకరణలో ఉన్నాయి.ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. 

66

సమంత.. ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో రాణిస్తుంది. `యశోద`, `యూటర్న్`, `శాకుంతలం` వంటి సినిమాల్లో నటించింది. `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`తోనూ మెప్పించింది. ఇప్పుడు `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సమ్మర్‌లో విడుదల కాబోతుంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నా, డామినేటింగ్‌ అండ్‌ ఎలివేటింగ్‌ రోల్‌ సమంతదే. ఓ రకంగా తనే వెబ్‌ సిరీస్ కి లీడ్‌. ఇలా ఈ ఏడాది సమంత కూడా మరోసారి లేడీ ఓరియెంటెడ్‌ వెబ్‌సిరీస్‌తో మెప్పించబోతుందని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved