విజయ్ దేవరకొండతో జతకట్టబోతోన్న బుట్టబొమ్మ, ఏ సినిమా..? డైరెక్టర్ ఎవరు..?
టాలీవుడ్ లో అనుకోని క్రేజీ కాంబినేషన్ల లిస్ట్ లో చేయబోతున్నారు విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే. ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఏంటా సినిమా...? ఎవరు డైరెక్టర్...?

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. తాజాసమాచారం ప్రకారం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ జతగా పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే నటించబోతోంది. ఓ పాన్ ఇండియా సినిమా కోసం ఈ కాంబినేషన్ మేకర్స్ కలపబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రూపొందించబోతున్నారు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ ఇప్పటికే లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్ మూవీగా స్టార్ట్ అయ్యి.. ఇది పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా జనగణమన. లైగర్ సెట్స్‌పై ఉండగానే ఈ మూవీని అనౌన్స్ చేశారు.
ఈ మూవీకి సంబంధించిన ముంబైలో గ్రాండ్‌గా ఈవెంట్ జరిగింది . ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్ సైనికుడిగా కనిపించనున్నాడు . ఇక ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది అందరి మనసులో ఉన్న ప్రశ్న. అయితే గతంలో ఈ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నట్టు పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ విషయంలో ఆమె తండ్రి బోనీ కపూర్ క్లారిటీ కూడా ఇచ్చారు.
ఈ పుకార్లను జాన్వీ కూడా కొట్టేస్తూ తాను ఇప్పటి వరకు ఏ సౌత్ సినిమాకు సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ పుకార్లకు చెక్ పడింది. దీంతో మరోసారి జనగనమణలో హీరోయిన్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది.
బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈ సినిమాలో విజయ్‌తో జతకట్టనుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని వినికిడి.
ఇక రీసెంట్ గా ఆచార్యతో అలరించిన పూజ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28, కభీ ఈద్ కభీ దీపావళి, భవదీయుడు భగత్ సింగ్‌తో పాటు సర్కస్ సినిమాలతో బిజీగా ఉంది. అటు విజయ్ దేవరకొండ జనగణమనతో పాటుగా శివ నిర్వాణలో దర్శకత్వంలో సమంతతో మరోసారి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది.