- Home
- Entertainment
- Pooja Hegde: `పూజా.. మన కాజా`.. బుట్టబొమ్మని ఇంత హాట్‌గా చూస్తే దిల్‌రాజే కాదు.. ఎవ్వరైనా అనాల్సిందే !
Pooja Hegde: `పూజా.. మన కాజా`.. బుట్టబొమ్మని ఇంత హాట్‌గా చూస్తే దిల్‌రాజే కాదు.. ఎవ్వరైనా అనాల్సిందే !
పూజా హెగ్డే టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె కాలు పెడితే సినిమా హిట్ అనేట్టుగా మారిపోయింది. గ్లామర్‌తోపాటు వెండితెరపై మెస్మరైజ్ చేసే ఈ అందాల భామపై దిల్‌రాజు తాజాగా ఓ షాకింగ్ కామెంట్ చేశారు. అది వైరల్ అవుతుంది.

pooja hegde at beast event
పూజా హెగ్డే ప్రస్తుతం తమిళంలో `బీస్ట్` చిత్రంతో నటిస్తుంది. థళపతి విజయ్ సరసన ఆమె ఫస్ట్ టైమ్ చేస్తున్న సినిమా ఇది. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రమిది. తెలుగులో ఇప్పటికే గోల్డెన్ లెగ్‌గా పేరుతెచ్చుకున్న ఈ బుట్టబొమ్మ కోలీవుడ్‌ని ఏలేందుకు రెడీ అవుతుంది. అందుకు `బీస్ట్` చిత్రంతో పునాది పడబోతుంది.
pooja hegde at beast event
విజయ్ సినిమాలు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఇప్పుడు `బీస్ట్` సైతం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. పూజాహెగ్డే, చిత్ర దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుథ్, తెలుగులో సినిమాని విడుదల చేస్తున్న దిల్‌రాజు హాజరయ్యారు. విజయ్ హాజరు కాలేకపోవడం కొంత లోటే ఉన్నా, దాన్నిపూజా మరో రూపంలో తీర్చిందనే చెప్పాలి.
pooja hegde at beast event
ఇందులో దిల్‌రాజు మాట్లాడుతూ పూజా హెగ్డేపై హాట్ కామెంట్ చేశారు. `పూజా.. మన కాజా` అనేశాడు. దీంతో ఆడియెన్స్ అరుపులతో హోరెత్తించారు. అంతటితో ఆగలేదు. ఆమె పాన్ ఇండియా హీరోయిన్‌గా వర్ణించారు. ఆమె లెగ్గు పడితే సినిమా సూపర్ హిట్టే అంటూ బుట్టబొమ్మని ఆకాశానికి ఎత్తేశాడు.
pooja hegde at beast event
పూజా దిల్‌రాజు బ్యానర్‌లో బన్నీతో `డీజే` చేసింది. ఆ సినిమాతో ఈ అమ్మడి విజయ పరంపర కొనసాగూనే వస్తుంది. దిల్‌రాజుసైతం అదే విషయాన్నిఈ ఈవెంట్‌ని తెలిపారు. `డీజే` సూపర్ హిట్, `మహర్షి` సూపర్ హిట్, `అరవింద సమేత` సూపర్ హిట్, `అల వైకుంఠపురములో` సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు `బీస్ట్` హిట్‌కొట్టినట్టే ప్రశంసలు కురిపించారు.
pooja hegde at beast event
అంతేకాదు నెక్ట్స్ ఫిల్మ్ కి నాకు డేట్స్ ఇవ్వండి అంటూ దిల్‌రాజు కామెంట్ చేయగా, నవ్వులు పూయించింది. ప్రతి సినిమాకి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తోంది. డాన్సుల్లోనే కాదు, మంచి నటనతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె మరింత ఎత్తుకి ఎదగాలని ఈ సందర్భంగా దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విజయం పట్ల ఆయన నమ్మకాన్ని వెల్లడించారు. అనిరుథ్ సంగీతాన్ని, నెల్సన్ టేకింగ్‌ని, ఆయన కథల్లో ఉండే సత్తాని తెలిపారు దిల్‌రాజు.
pooja hegde at beast event
ఈ సందర్భంగా పూజా హెగ్డే సైతం దిల్‌రాజు గురించి చెప్పింది. `దిల్‌రాజుతో `డీజే` చిత్రంతో జర్నీ స్టార్ట్ అయ్యింద`ని పేర్కొంది. `బీస్ట్` ఫుల్ మాసీ కమర్షియల్ ఎంటర్‌టైనర్. నెల్సన్ ట్విస్ట్ లతో ఉంటుంది. విజయ్ సర్‌తో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపింది. అనిరుథ్ సంగీతానికి పెద్ద అభిమానిని అంటూ `బీస్ట్` చిత్రంలోనూ పాటల గురించి తెలిపింది.
pooja hegde at beast event
అంతేకాదు ఆడియెన్స్ డిమాండ్ మేరకు స్టేజ్‌పైనే స్టెప్పులేసింది పూజా. అనిరుథ్ రవిచంద్రన్, దర్శకుడు నెల్సన్‌లతోపాటు స్టెప్పులే ఈవెంట్‌కి ఊపుతీసుకొచ్చింది. ఆద్యంతం సందడిగా ఈ ఈవెంట్ సాగడం విశేషం.
pooja hegde at beast event
ఇక దిల్‌రాజు కామెంట్లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమెకి ఖాజాగా వర్ణించడంపై రియాక్ట్ అవుతూ, ఒక్క దిల్‌రాజేం కర్మ ఇంత హాట్‌గా పూజాని చూస్తే ఎవ్వరైనా అదే మాట అంటారు అంటూ సమర్థిస్తున్నారు. స్లీవ్‌లెస్ రెడ్ టాప్‌లో పూజా యమా హాట్‌గా ఉందంటున్నారు ఇంటర్నెట్ అభిమానులు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
pooja hegde at beast event
ఇటీవల `రాధేశ్యామ్`తో వరుస విజయాల అనంతరం పరాజయాన్ని చవిచూసింది పూజా హెగ్డే. అంతకు ముందు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంసైతం యావరేజ్ టాక్‌నే తెచ్చుకుంది. `బీస్ట్`తోపాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతుంది.
pooja hegde at beast event
తెలుగులో మరోసారి మహేష్‌బాబుతో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తుంది. త్రివిక్రమ్‌తో బ్యాక్ టూ బ్యాక్ ఇది మూడో సినిమాగా చెప్పొచ్చు. మరోవైపు పవన్‌తో ఫస్ట్ టైమ్ చేయబోతుంది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందే సినిమాలో పూజానే హీరోయిన్ అని టాక్. మరోవైపు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన `ఆచార్య` చిత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతుంది.
pooja hegde at beast event
అడపాదడపా హిందీలోనూ సినిమాలు చేస్తుంది పూజా హెగ్డే. గతంలో `మొహెంజోదారో`లో మెరిసింది. ఈ సినిమా సక్సెస్ కాలేదు. చాలా గ్యాప్ తర్వాత `హౌజ్‌ఫుల్ 4`తో హిట్ అందుకుంది. ఇప్పుడు `సర్కస్` అనే సినిమాలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.