త్వరలో స్టార్ క్రికెటర్ తో పూజా హెగ్డే పెళ్లి.. ప్రైవేట్ ఈవెంట్ లో జంటగా, అతడెవరు అంటూ నెటిజన్లలో ఆసక్తి ?
బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.
బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
కానీ ఇంతవరకు పూజా హెగ్డే బాలీవుడ్ లో సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకి లవ్ ఎఫైర్స్ కి సంబంధించిన రూమర్స్ వస్తుంటాయి. పూజా హెగ్డే గురించి అంతగా ప్రేమ వ్యవహారాలకు సంబందించిన రూమర్స్ రాలేదనే చెప్పాలి.
అయితే తాజాగా పూజా గురించి ఒక షాకింగ్ రూమర్ వైరల్ అవుతోంది.అదేంటంటే పూజా హెగ్డే ఓ స్టార్ క్రికెటర్ తో ప్రేమలో ఉందట. అంతే కాదు త్వరలో వీరిద్దరూ వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబైలో దీనికి సంబంధించిన వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరనేది బయటకి రాలేదు.
రీసెంట్ గా పూజా హెగ్డే తన ప్రియుడితో కలసి ఓ ప్రైవేట్ ఈవెంట్ లో కూడా మెరిసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో నెటిజన్లు అసలు ఆ క్రికెటర్ ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు. మరి ఈ రూమర్ లో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలంటే స్వయంగా పూజా హెగ్డే నే స్పందించాలి.
ఇదిలా ఉండగా ఇటీవల పూజా హెగ్డే టాలీవుడ్ లో మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కి చివరగా టాలీవుడ్ లో కలసి రాలేదు. రాధే శ్యామ్, ఆచార్య లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి.