- Home
- Entertainment
- `కూలీ`లో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్, రజనీతో బుట్టబొమ్మ ఊరమాస్ స్టెప్పులు.. ఈ సారి `జిగేల్ రాణి`ని మించి
`కూలీ`లో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్, రజనీతో బుట్టబొమ్మ ఊరమాస్ స్టెప్పులు.. ఈ సారి `జిగేల్ రాణి`ని మించి
Pooja Hegde Item Song: పూజా హెగ్డే గతంలో `రంగస్థలం`, `ఎఫ్ 3`లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు `కూలీ`లో `జిగేల్ రాణి`ని మించిన స్పెషల్ నెంబర్ చేస్తుందట. ఆమె లుక్, డాన్సులు, గ్లామర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

Pooja Hegde Item Song:
Pooja Hegde Item Song: బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల హీరోయిన్‌గా కాస్త డౌన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఈ క్రమంలో ఆమె మరోసారి ఐటెమ్ సాంగ్ చేస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తుండటం విశేషం. తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది టీమ్. పూజా ఫోటోని పంచుకుంది.
Pooja Hegde
పూజా హెగ్డే గతంలో `రంగస్థలం`లో ఐటెమ్ సాంగ్ చేసింది. ఇందులో `జిగేల్ రాణి` అంటూ మాస్ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించింది. ఆమె అందాలు, డాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. పైగా పాటలోనూ మంచి మీనింగ్ ఉండటంతో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. సినిమా సక్సెస్‌లో ఆ పాట పాత్ర కూడా చాలానే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Pooja Hegde Item Song in coolie
మధ్యలో `ఎఫ్ 3`లోనూ లెగ్ షేక్ చేసింది పూజా. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో, పాట కూడా పెద్దగా హైలైట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆమె స్పెషల్ సాంగ్ చేస్తుంది. అయితే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఈ ఐటెమ్ సాంగ్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందట. సెట్ నుంచి పూజా హెగ్డే లుక్‌ని విడుదల చేసింది టీమ్. పూజా హెగ్డేకి స్వాగతం పలుకుతూ టీమ్ ఆమె లుక్‌ని విడుదల చేసింది.
coolie
ఇందులో రెడ్ డ్రెస్‌లో గ్లామర్ షో చేస్తూ పూజా హెగ్డే కనిపిస్తుంది. చూడబోతుంటే `రంగస్థలం` సినిమాని మించి ఈ ఐటెమ్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ పాటని కూడా చాలా స్పెషల్‌గా చిత్రీకరిస్తున్నారట. ఐటెమ్ సాంగ్స్ లోనే ఇదొక బెస్ట్ నెంబర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఇందులో రజనీకాంత్‌తోపాటు ఇతర బిగ్ స్టార్స్ కూడా కనిపిస్తారని సమాచారం.
Coolie
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న `కూలీ` సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, టాలీవుడ్ హీరో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారివి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు అని తెలుస్తుంది.
అంతేకాదు ఇందులో అమీర్ ఖాన్ కూడా చివర్లో మెరుస్తారట. ఆయన పాత్ర `విక్రమ్` మూవీలో సూర్య రోల్ రోలెక్స్ తరహాలో ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని మే 1న విడుదల చేయబోతున్నారట. అయితే ఆగస్ట్ 15కి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.
Read more: ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లకి తండ్రిగా రజనీకాంత్.. ఆయనకు కథ చెప్పిన డైరెక్టర్ డేర్‌కి మొక్కాలి
also read: ఆగిపోయిన దివ్య భారతి సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?