క్రిటిక్ కు లీగల్ నోటీస్ పంపిన పూజా, వివాదం ఏంటంటే
ఈ క్రమంలో పూజా హెగ్డే టీమ్ అతనికి లీగల్ నోటీసులు పంపింది. అయితే దానిని గర్వంగా తన ట్విట్టర్ లో పెట్టుకుని మురిసి పోతున్నాడు ఉమైర్.
Pooja Hegde
నేషనల్ మీడియాకు, మన లోకల్ మీడియాకు బాగా పాపులర్ అయిన క్రిటిక్ ఉమైర్ సంధు. దుబాయి సెన్సార్ బోర్డ్ మెంబర్ ని అంటూ సినిమా రివ్యూలు కొద్ది రోజులు ముందే చెప్పే అతనికి ఇక్కడ సోషల్ మీడియాలో అతనికి శత్రువులు ఉన్నారు. అందుకు కారణం రివ్యూలు ఇవ్వటం ప్రక్కన పెట్టి ఎప్పటికప్పుడు ఎవరో ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ పై నోటికొచ్చి వాగుతూండటమే. అన్ని కళ్లతో చూసినట్లు అందరికి ఎఫైర్స్ అంటగడుతూంటాడు.ఎప్పుడూ ఎవరో ఒకరిని సెలబ్రిటీలను టార్గెట్ చేయడం వారి గురించి వారి పర్సనల్ విషయాల గురించి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు పూజా హెగ్డే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.పూజా గత రెండు వారాలుగా తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెల్లిపోయిందని.. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఉమైర్ సంధు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఆమెను కాపాడాకలిగారని ఉమైర్ పేర్కొన్నారు
Pooja Hegde
ఇక ఉమైర్ చేసిన ట్వీట్ పై పూజా హెగ్డే అభిమానులు మండిపడ్డారు. నీకు వేరే పనిలేదా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నావా అని అతడ్ని విమర్శించారు. మరికొందరు పూజా మధ్యాహ్నం తన ఫోటోల్ని కూడా షేర్ చేసిందని ఆధారాలు చూపెట్టారు.
ఈ క్రమంలో పూజా హెగ్డే టీమ్ అతనికి లీగల్ నోటీసులు పంపింది. అయితే వాటిని గర్వంగా తన ట్విట్టర్ లో పెట్టుకుని మురిసి పోతున్నాడు ఉమైర్. అంటే తనను ఎవరూ ఏమీ చేయగలరు అన్నట్లు ఉంది అతని ధోరణి. వేరే దేశంలో ఉండి ఇలా ట్వీట్స్ చేస్తూ ..లీగల్ గా దొరకనని చెప్తున్నట్లుగా ఉంది అతని వైఖరి.
ఇంతకు ముందు...హీరో అక్కినేని అఖిల్( Akhil Akkineni ), ఊర్వశి రౌతేలా ను హెరాస్ చేశాడని ఆమెను ఇబ్బంది పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసాడు ఉమైర్.ఉమైర్ సంధు ఓ ట్వీట్ లో.. ఏజెంట్ సినిమా ఐటెం సాంగ్ షూట్ సమయంలో అఖిల్.. ఊర్వశిని ఏడిపించాడని, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఊర్వశి కూడా అతనితో వర్క్ చేయడం నచ్చలేదని, అతను ఇబ్బంది పెట్టాడని చెప్పినట్లు ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.
ఇక తాజాగా ఆ ట్వీట్ పై స్పందించినా ఊర్వశి( Urvashi Rautela ) మండిపడి లీగల్ నోటీస్ పంపింది.అంతేకాక దీనిపై తన సోషల్ మీడియాలో ఊర్వశి రౌతేలా.. ఇతనికి లీగల్ నోటీసులు పంపిస్తున్నాను నా లీగల్ టీం తరపున. నువ్వేం నా స్పోక్ పర్సన్ వి కాదు నా గురించి మాట్లాడటానికి. నువ్వే మెచ్యూరిటీ లేని ఓ జర్నలిస్ట్ వి. నేను, నా ఫ్యామిలీ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా నువ్వు చేస్తున్నావు అంటూ పోస్ట్ చేసింది. దీంతో అటు ఊర్వశి అభిమానులు, ఇటు అఖిల్ అభిమానులు కూడా ఉమైర్ సంధు పై ఫైర్ అయ్యారు.
కన్నడ( భామ పూజా హెగ్డే(Pooja Hegde) ప్రస్తుతం తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆఫర్స్ కు లోటు లేదు కానీ హిట్ మాత్రం రావట్లేదు. 2021 వరకు వరుసగా విజయాలు అందుకున్న పూజాహెగ్డే 2022 నుంచి మాత్రం ఒక్కసారిగా టర్న్ అయి ఫ్లాఫ్ లు అందుకుంటుంది. 2022లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి.
ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన బీస్ట్ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం వచ్చిన ఆచార్య సినిమా అయితే పూర్తిగా డిజాస్టర్ అయింది. ఇక బాలీవుడ్ లో సర్కస్ సినిమాతో వచ్చినా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో 2022 పూజాకు కలిసి రాలేదు. 2023లో అయినా పూజా ఫేట్ మారుతుంది అనుకుంది.
కానీ తాజాగా పూజాహెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా రిలీజయింది. స్టార్ హీరో కావడంతో ఓపెనింగ్స్ వస్తున్నా సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఇక సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన పూజాహెగ్డే చిన్న పిల్లలా ఉందని కూడా కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమా కూడా పూజాకి నిరాశే మిగిల్చింది.
ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమాల్లో మహేష్ – త్రివిక్రమ్ సినిమా SSMB28 ఒకటి. ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ సినిమాలోంచి పూజ బయిటకు వచ్చేసిందని టాక్ వచ్చింది.
లీవుడ్ లో నెగెటివ్ సెంటిమెంట్ గా మారిన పూజాహెగ్డేను మిగిలిన స్టార్ హీరోలు కూడా యాక్సెప్ట్ చేయడం లేదనే టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే పూజా ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా చేయడం లేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరసన పూజా చేస్తుంది అని వార్తలు వచ్చినా అధికారిక సమాచారం మాత్రం లేదు.
పూజా హెగ్డే తనకు ఉన్న ఒకే ఒక హోప్ మహేశ్ బాబు, త్రవిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’ సినిమానే అని భావించింది. అయితే ఈ సినిమా నుంచి హీరోయిన్ గా పూజాని తప్పించారని, కొంతమందేమో ఆమె తప్పుకుందని అంటున్నారు. ఆమె ప్లేస్ లోకి మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ లేదా మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేశారని వార్తలొస్తున్నాయి. ఇదే సినిమాలో మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది.గతంలో త్రివిక్రమ్ పూజాకు అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో సినిమాలతో హిట్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు మహేష్ సినిమాతో కూడా హిట్ యిచ్చి పూజా కెరీర్ ని మళ్ళీ గాడిలో పెడతాడేమో అనుకున్న ఫ్యాన్స్ ఆమె బయిటకువచ్చిందనటంతో నిరాశపడ్డారు . అయితే పూజాకు సక్సెస్ లు రాకపోయినా సినిమా ఆఫర్స్ రావడం మాత్రం విశేషం. టా