అసభ్యంగా సన్నివేశం.. తెగించిన పూజా హెగ్డేకి దిమ్మతిరిగే షాకిచ్చిన సెన్సార్ బోర్డు
సౌత్ లో పూజా హెగ్డేకి ప్రస్తుతం బ్యాడ్ టైం కొనసాగుతోంది. అరకొర అవకాశాలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే సౌత్ కంటే బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది.

టాలీవుడ్ లో కొంత కాలం పాటు పూజా హెగ్డే హవా సాగింది. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో నటించింది. గ్లామర్ ప్రదర్శించడంలో పూజా హెగ్డేకి తిరుగులేదు. బికినీ సన్నివేశాల్లో కూడా నటించింది. అయితే సౌత్ లో పూజా హెగ్డేకి ప్రస్తుతం బ్యాడ్ టైం కొనసాగుతోంది. అరకొర అవకాశాలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే సౌత్ కంటే బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది.
బాలీవుడ్ ఆమె షాహిద్ కపూర్ సరసన నటించిన దేవా చిత్రం జనవరి 31న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. బాలీవుడ్ లో ఈ చిత్రం పూజా హెగ్డేకి చాలా కీలకం. దీనితో పూజా తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించింది అట. గ్లామర్ తో పాటు ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడానా నటించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, షాహిద్ మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ కి సెన్సార్ సభ్యులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. లిప్ లాక్ సన్నివేశం అసభ్యకరంగా ఉండడంతో కొంత భాగం తొలగించాలని సెన్సార్ సభ్యులు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. కానీ అసభ్యకరంగా ఉన్న ఆ సన్నివేశాన్ని కొంత భాగం తొలగించాలని సెన్సార్ ఆదేశించినట్లు బి టౌన్ నుంచి వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ లో నెక్స్ట్ లెవల్ కి చేరుకోవాలంటే ఈ చిత్రం పూజా హెగ్డేకి చాలా కీలకం. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాయ్ కపూర్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ డ్రామా అని ఇటీవల విడుదలైన ట్రైలర్ తో తేలిపోయింది. ఈ చిత్రం షాహిద్ కపూర్, పూజా హెగ్డేకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.