బోల్డ్ అండ్ బ్యూటిఫుల్... ట్రెండీ వేర్ లో లేడీ బ్లాక్ పాంథర్ లా మెరిసిన పూజా హెగ్డే, కళ్ళు తిప్పుకోలేరు!
టాలీవుడ్ కి దొరికిన సెక్సీ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja hegde). ఈ పొడుగు సుందరి అందాలకు ఎవ్వరైనా దాసోహం అనాల్సిందే.
దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా మారిన పూజా గ్లామర్ రేంజ్ అలాంటిది మరి. కావలసిన కొలతలతో పోతపోసిన శిల్పంలా ఉండే పూజా, సిల్వర్ స్క్రీన్ ని దున్నేస్తుంది.
సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ మరింతగా సెగలు రేపుతోంది అమ్మడు. పూజా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి.
లేటెస్ట్ గా బ్లాక్ డిజైనర్ వేర్ లో బోల్డ్ అండ్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చింది. లేడీ బ్లాక్ పాంథర్ లా ఉన్న పూజా కిల్లింగ్ లుక్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
తెలుగు, తమిళంలో ఆమె భారీ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ చేస్తున్న పూజా, మరో భారీ చిత్రం ఆచార్యలో అవకాశం దక్కించుకున్నారు.
చిరు-చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్యలో ఆమె చరణ్ తో జత కడుతున్నారు. ఆచార్యలో పూజా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉంది.
అలాగే యంగ్ హీరో అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన బీస్ట్ మూవీలో అవకాశం దక్కించుకొని మరో బంపర్ ఆఫర్ పట్టేసింది పూజా.
మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
మహేష్ త్రివిక్రమ్ చిత్రంతో పాటు, హరీష్ శంకర్-పవన్ చిత్రాలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందట. దర్శక నిర్మాతలు ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం పూజానే సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.