MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `రాములోరాములా` స్టెప్ కనిపెట్టింది మేమే.. అల్లు అర్హతో డాన్స్ వీడియో షేర్‌ చేసిన పూజా హెగ్డే.. ట్రెండింగ్

`రాములోరాములా` స్టెప్ కనిపెట్టింది మేమే.. అల్లు అర్హతో డాన్స్ వీడియో షేర్‌ చేసిన పూజా హెగ్డే.. ట్రెండింగ్

`అల వైకుంఠపురములో` బన్నీతో కలిసి పూజా వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి.  ఈ నేపథ్యంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ వీడియోని పంచుకుంది. ఇందులో అల్లు అర్హతో ఆమె డాన్సు చేస్తూ కనిపించింది.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 12 2022, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పూజా హెగ్డే `అల వైకుంఠపురములో`తో హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇందులో అల్లు అర్జున్‌తో ఆమె చేసిన డాన్సులు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బన్నీ.. పూజా కాళ్లపై పెట్టిన ఫోకస్‌, ఆమె కాళ్లపై వచ్చే సాంగ్‌ హైలైట్‌గా నిలిచింది. సినిమాకదే స్పెషల్‌ హైలైట్‌గా నిలిచింది. `నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు` అంటూ పూజాని ఉద్దేశించి పాట రూపంలో బన్నీ చేసిన హంగామా ఆద్యంతం ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా `అల వైకుంఠపురములో` చిత్రం విడుదలై నేటి(జనవరి 12)తో రెండేళ్లు పూర్తయ్యింది. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. నాన్‌ `బాహుబలి` రికార్డులు క్రియేట్‌ చేసింది.  `అల వైకుంఠపురములో` రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంది యూనిట్‌. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

37

బన్నీ స్టయిలీష్‌ యాక్షన్‌, పూజా హెగ్డే గ్లామర్‌, తమన్‌ సంగీతం, త్రివిక్రమ్‌ టేకింగ్‌ సినిమాని నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఇందులో పూజా గ్లామర్‌ హైలైట్‌ అయ్యిందని చెప్పొచ్చు. ఈ చిత్రంతో నటిగా తనకు మంచి పేరొచ్చిందని చెప్పింది పూజా హెగ్డే. ఇందులో బన్నీతో కలిసి వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. స్టయిలీష్ స్టార్‌కి దీటుగా డాన్సు చేసి వాహ్‌ అనిపించిందని చెప్పొచ్చు. 
 

47

ఈ నేపథ్యంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ వీడియోని పంచుకుంది. ఇందులో అల్లు అర్హతో ఆమె డాన్సు చేస్తూ కనిపించింది. తెరపై బన్నీతో ఫిదా చేసిన ఈ అందాల సోయగం, తెరవెనుక కూతురుతో కిర్రాక్‌ డాన్సు చేసి అదరగొట్టింది. `రాములో రాములా.. ` పాటకి బన్నీ కూతురు అల్లు అర్హని ఎత్తుకుని మరీ పూజా డాన్సు చేయడం విశేషం. షూటింగ్‌ సెట్‌లో తెరవెనుక మేకప్‌ రూమ్‌లో పూజా, అల్లు అర్హ ఇలా డాన్సు చేస్తున్న పాత వీడియోని పంచుకుంది పూజా. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

57

ఈ సందర్భంగా పూజా చెబుతూ, `అల వైకుంఠపురములో రెండేళ్లు పూర్తి చేసుకున్నసందర్భంగా మీరు ఇప్పటికే అల్లు అర్జున్‌, నేను చేసిన డాన్సులు చూశారు. కాబట్టి సినిమాలో నా షాట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసమయంలో తెరవెనుక నేను, అల్లు అర్హ కలిసి చేసిన డాన్సు దృశ్యాలు చూడండి` అంటూ `అల వైకుంఠపురములో` షూటింగ్‌ సెట్‌నాటి అరుదైన వీడియోని పంచుకుంది పూజా. 

67

పూజా హెగ్డే గతేడాది `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటించింది. ఇందులో స్టాండప్‌ కమెడీయన్‌గా అబ్బురపరిచింది. నటిగా తన నెక్ట్స్ లెవల్‌ చూపించింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటించింది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. 

77

నెక్ట్స్ ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి. ఓ వైపు తమిళంలో విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తెలుగులో మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ సినిమా చేస్తుంది. అలాగే బన్నీతో మరో సినిమా, పవన్‌ కళ్యాణ్‌తో `భవదీయుడు భగత్‌సింగ్‌` చిత్రంలో నటించబోతున్నట్టు సమాచారం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved