పూజా హెగ్డే, కృతి శెట్టి, రకుల్ కి పీడకలగా మిగిలిన 2022.. డిజాస్టర్ మూవీస్ ఇవే
డస్కీ బ్యూటీగా పూజా హెగ్డే టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ 2022లో ఆమె చేసిన చిత్రాల వల్ల పూజా క్రేజ్ ప్రమాదంలో పడింది.

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. 2023 నుంచి సమస్యలు అన్ని తొలగిపోయి చిత్ర పరిశ్రమ కళకళలాడాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇక అభిమానులు సోషల్ మీడియాలో 2022లో జరిగిన సినీ విశేషాలని గుర్తు చేసుకుంటున్నారు. కొందరికి 2022 తీపి జ్ఞాపకంగా మిగిలింది. పూజా హెగ్డే లాంటి వారికి మాత్రం పీడకలగా మిగిలింది.
డస్కీ బ్యూటీగా పూజా హెగ్డే టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ 2022లో ఆమె చేసిన చిత్రాల వల్ల పూజా క్రేజ్ ప్రమాదంలో పడింది. రాధే శ్యామ్ మొదలుకుని మొన్న బాలీవుడ్ లో విడుదలైన సర్కస్ వరకు ఆమె నటించిన 5 చిత్రాలు మామూలు డిజాస్టర్స్ కాలేదు. రాధే శ్యామ్ చిత్రం బయ్యర్లకు కోలుకోలేని నష్టాలు మిగిల్చింది.
ఆ తర్వాత నటించిన బీస్ట్, ఆచార్య చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆచార్య చిత్రం భారీ అంచనాలతో విడుదలై నీరుకార్చింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే రాంచరణ్ కి జోడిగా నటించింది. రీసెంట్ గా వచ్చిన పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ సర్కస్ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
ఇక యంగ్ బ్యూటీ కృతి శెట్టికి కూడా ఈ ఏడాది కలసి రాలేదు. ఉప్పెన చిత్రంతో ఆమెకు ఆఫర్స్ కూడా ఉప్పెనలా వచ్చాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాలు విజయం సాధించి ఉంటె కృతి శెట్టి క్రేజ్ మరో స్థాయిలో ఉండేది. కానీ వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
2022 సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు చిత్రం మాత్రమే హిట్ గా నిలిచింది. కృతి శెట్టి ఎలాంటి కథలు ఎంచుకుంటోంది అంటూ ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. జడ్జిమెంట్ సరిగ్గా లేకపోవడంతో కృతి శెట్టి టాలీవుడ్ లో నెక్స్ట్ లెవల్ కి చేరుకోలేకపోయింది.
ఇక 2022లో రకుల్ జాతకం ఏమీ మారలేదు. ఆమె తెలుగులో అవకాశాలు కోల్పోయి చాలా కాలమే అవుతోంది. హిందీలో కూడా ఏమాత్రం కలిసిరాలేదు. రకుల్ ఈ ఏడాది హిందీలో నటించిన 5 చిత్రాలు నిరాశపరిచాయి. రకుల్ ఈ ఏడాది అటాక్, రన్వే 34, థాంక్ గాడ్ లాంటి చిత్రాల్లో నటించింది.