'తమిళ్ రాకర్స్' అడ్మిన్ అరెస్ట్, సినిమాలు ఎలా రికార్డ్ చేస్తారో చెప్పిన షాకింగ్ నిజాలు
తాజాగా ధనుష్ హీరోగా విడుదలైన రాయన్ పైరేటెడ్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేస్తూ మధురైకి చెందిన జెబ్ స్టీఫెన్ రాజ్ పట్టుబడ్డాడు.
Tamil Rockers
సినిమాల్లో చూపించే విలన్స్ కన్నా పెద్దది పైరసీ. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నో వ్యయప్రయాసలుకు ఓర్చి సినిమాలు చేస్తే వాటిని ఈజీగా పైరసి చేసి గంటల్లో తమ సైట్ లలో పెట్టేస్తున్నారు. ఈ పైరసీ కారణంగా ప్రతి ఏడాది సినీ పరిశ్రమకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. పైరసీని అడ్డుకోవడానికి సినీ వర్గాలతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసిన కొత్త దారుల్లో ఈ భూతం విస్తరిస్తూనే ఉంది.
ఇక పైరసీ సైట్స్‌లో తమిళ్‌రాకర్స్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. స్టార్ హీరోల సినిమాల్ని కూడా మొదటి షో పూర్తికాకముందే తమిళ్ రాకర్స్ పైరసీ చేసిన సంఘటనలు చాలా సార్లు జరిగాయి. ఛాలెంజ్ చేసి మరీ పైరసీ చేసారు. ఈ పైరసీ బ్యాచ్ ని చాలా కాలంగా వెతుకుతున్నారు. కానీ పట్టుబడటం లేదు. అయితే తాజాగా ధనుష్ హీరోగా విడుదలైన రాయన్ పైరేటెడ్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేస్తూ మధురైకి చెందిన జెబ్ స్టీఫెన్ రాజ్ పట్టుబడ్డాడు.
కేరళ పోలీసులు ఇటీవల తిరువనంతపురంలో తమిళ రాకర్స్ అడ్మిన్ జెబ్ స్టీఫెన్ రాజ్‌ను అరెస్టు చేశారు. జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళనాడులోని మదురైకి చెందినవారని మరియు అతను చాలా కాలంగా తమిళ్ రాకర్స్‌లో వివిధ చిత్రాల థియేటర్-ప్రింట్‌లను అప్‌లోడ్ చేస్తున్నాడని తెలిసింది. స్టీఫెన్ మొత్తం రాయన్ చిత్రాన్ని థియేటర్‌లో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ క్రమంలో పైరసీ చేసే విధానం గురించి కొన్ని షాకిం గ్ విషయాలు వివరించాడు.
tamil rockers
సినిమా విడుదల రోజే ఆరు నుంచి ఏడు వెనక వైపు సీట్లను బుక్ చేస్తారని, మొబైల్ ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించి సీటుపై కప్ హోల్డర్‌పై మొబైల్ ఫోన్ పెట్టుకుని థియేటర్ వెనుక సీట్లో కూర్చుని సినిమాని కాపీ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అతడి మొబైల్ ఫోన్ లొకేషన్ తమిళనాడులో ఉన్నట్లు స్పష్టమైంది. అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుండగా.. `రాయన్`ని చూసేందుకు వచ్చినట్లు సమాచారం. వంజియూర్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు కాకనాడ్ సైబర్ సెల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎ జయకుమార్ తెలిపారు.
tamil rockers
అతడు తమిళ్ రాకర్స్ - తమిళ్ బ్లాస్టర్స్ వంటి సైట్‌లకు కొత్త చిత్రాలను రికార్డ్ చేసి పంపేవాడు. రాయన్ తో పాటు, `గురువాయూరంబాలనదైల్` సినిమా విడుదలైన రెండో రోజునే ఈ చిత్రానికి సంబంధించిన ఫేక్ వెర్షన్ ఆన్ లైన్‌లోకి వచ్చింది. నిర్మాత సుప్రియా మీనన్ ఫిర్యాదు మేరకు కాక్కనాడ్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ చర్య తీసుకున్నారు. రైలులో కూర్చొని కొంతమంది తమ మొబైల్ ఫోన్‌లలో నకిలీ వెర్షన్‌ను చూస్తున్న దృశ్యాలు కూడా ఇటీవల బయటపడ్డాయి. దీంతో నిర్మాతల్లో ఒకరైన సుప్రియా మీనన్ కాక్కనాడ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
Tamil Rockers
అనంతరం సైబర్ పోలీసులు జరిపిన విచారణలో తిరువనంతపురంలోని థియేటర్ నుంచి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ త్రివేండ్రంలోని ఆరిస్ మల్టీప్లెక్స్ సముదాయంలో ఓ స్క్రీన్ లో పైరేట్ లు కాపీ చేస్తూ పట్టుబడ్డారు. వీరంతా మొబైల్ లోని 4కె వీడియో రికార్డింగ్ ఆప్షన్ ని ఉపయోగించి సినిమాని కాపీ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ వెబ్‌సైట్‌లో 12 మంది సభ్యులు పనిచేస్తున్నారని విచారణలో స్టీఫెన్ వెల్లడించాడు. జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లతో పాటు టెలిగ్రామ్ యాప్‌లో కూడా సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రాయన్ కాకుండా కల్కి 2898, మహారాజు సినిమా కాపీలు పోలీసులకు దొరికాయి.
కొత్త సినిమా విడుదలైన రోజే తమిళనాడు నుంచి కేరళకు ఫేక్ వెర్షన్స్ కాపీ కొట్టి వాటిని ప్రమోట్ చేస్తున్న ఛానెల్స్ కు పంపించడం అరెస్టయిన స్టీఫెన్ రాజ్ చేసే పని. అతని వెనుక పనిచేస్తున్న వ్యక్తులు ఎవరనేది కూడా తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఎవరికి సినిమాలను పంపిస్తున్నాడో, వెబ్‌సైట్లలో ఎవరు అప్‌లోడ్ చేస్తున్నారో కనుక్కోవాలి.
Chumma South
నిందితుడి అరెస్ట్ అనంతరం దర్యాప్తును విస్తృతం చేస్తున్నామని సైబర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అలాగే అరెస్ట్ అయిన వ్యక్తి పాటు ఉన్న మరో వ్యక్తి అమాయకుడని, కొత్త సినిమా చూపిస్తానని, మంచి థియేటర్ అని చెప్పి నిందితుడిని తీసుకొచ్చారని పోలీసులు స్పష్టం చేశారు.