- Home
- Entertainment
- బాప్.. బాప్.. బాప్.. పోకిరి సీన్ రిపీట్.. రివర్స్ లో `జబర్దస్త్` యాంకర్‌కి దానం చేసిన బిచ్చగాడు
బాప్.. బాప్.. బాప్.. పోకిరి సీన్ రిపీట్.. రివర్స్ లో `జబర్దస్త్` యాంకర్‌కి దానం చేసిన బిచ్చగాడు
`జబర్దస్త్` కామెడీ షోలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుకి, కమెడియన్ కి మధ్య చోటు చేసుకున్న కామెడీ సీన్ `పోకిరి` సన్నివేశాన్ని తలపించడం విశేషం.

జబర్దస్త్ కామెడీ షో గతంలో మాదిరిగా అంతగా రంజుగా అనిపించడం లేదు. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏదో ఒక హై స్కిట్, హై ఇచ్చే సన్నివేశాలుండేవి. కానీ అవి తగ్గాయా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం హైలైట్ అవుతుంటుంది. మంచి కామెడీ స్కిట్లతో కమెడియన్లు అలరిస్తున్నారు. ఇక లేటెస్ట్ ప్రోమోలో యాంకర్ సౌమ్య రావు, కమెడియన్ రియాజ్ మధ్య సన్నివేశం ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇందులో రాకెట్ రాఘవ హాస్పిటల్ స్కిట్ బాగుంది. ఇంజిక్షన్ సూది కి సంబంధించిన కామెడీ బాగా నవ్వులు పూయించింది. ఆ తర్వాత నూకరాజు హీరోల స్కిట్ చేశాడు. తను రాజశేఖర్‌గా, డూప్ ప్రభాస్, పవన్‌లతో స్కిట్ చేసి కామెడీని పంచే ప్రయత్నం చేశాడు. దీంతోపాటు పంచ్ ప్రసాద్ టీమ్, యాదమ్మ రాజు, సద్దాంలు సైతం మెప్పించారు. ఈ క్రమంలో షోలో `పోకిరి` సీన్ రిపీట్ అయ్యింది.
రియాజ్(మరుగుజ్జు ఆర్టిస్ట్) జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావుతో చేసిన కామెడీ మరింత మెప్పించింది. జబర్దస్త్ లో హైలైట్‌గా నిలిచింది. ఇందులో రియాజ్ బెగ్గర్‌గా చేశాడు. బాప్.. బాప్.. బాప్ అంటూ యాంకర్ సౌమ్య రావు వద్దకి వెళ్లి బెగ్గింగ్ చేశాడు. ఓ పది రూపాయలు ఉంటే ఇవ్వండి మేడమ్ అని అడగ్గా, నా వద్ద వన్ రూపీ కూడా లేదని చెబుతుంది సౌమ్యరావు.
అన్నం తిని పది రోజులవుతుందని అడగ్గా, నా వద్ద యాపిల్ ఉంది తీసుకో అంటూ ఇసిరేసింది. ఎంజాయ్ చేయు అంటూ తనదైన స్టయిల్‌లో చెప్పడం విశేషం. దీంతో సౌమ్యరావుకి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు రియాజ్. యాపిల్ ఇచ్చావ్ కదా, ఎంజాయ్ చేయు.. పండగో పండగో అంటూ ఆమెపై సెటైర్లు వేయడం విశేషం. దీంతో సౌమ్యరావు మోహం వాడిపోయింది. ఈ స్కిట్ `జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.
అయితే మహేష్‌బాబు నటించిన `పోకిరి` సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌కి కలెక్షన్ల రికార్డులను పరిచయం చేసింది. ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ఇందులో ఇలియానా కథానాయికగా నటించింది. అయితే సినిమాలో అలీ బెగ్గర్‌గా నటించారు. బ్రహ్మానందంని బిక్షం అడిగినప్పుడు కసురుకుంటాడు. ఆ సమయంలో రివర్స్ లో బ్రహ్మానందంకే అలీ బిక్షం ఇవ్వడం విశేషం. ఆ తర్వాత మరో సీన్‌లో బ్రహ్మానందానికి చుక్కలు చూపిస్తారు. అది సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అలాంటిదే `జబర్దస్త్`లో చేయడం మరో విశేషం.
జబర్దస్త్ కామెడీ ప్రతి గురువారం రాత్రి ఈటీవీలో ప్రసారం కానున్న విసయం తెలిసిందే. యాంకర్ అనసూయ స్థానంలో సౌమ్యరావు యాంకర్‌గా వచ్చి తన వంతు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో కమెడియన్ కృష్ణభగవాన్, నటి ఇంద్రజ జడ్జ్ లు గా చేస్తున్నారు.