Guppedantha Manasu: శైలేంద్రకు సరైన గుణపాఠం చెప్పిన మహేంద్ర.. తల్లి, కొడుకులకు వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కొడుకు తనని అసహ్యించుకున్నా పర్వాలేదు కానీ క్షేమంగా ఉంటే చాలు అనుకుంటున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో రిషి మీద అటాక్ చేసే అవసరం ఎవరికీ ఉంది మనం అక్కడికి వెళ్లినట్లుగా శైలేంద్ర కి తెలియదు కదా అవుతాడు మహేంద్ర. అప్పుడే అక్కడికి శైలేంద్ర వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు బాబాయ్ అసలు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది మాకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా.. రిషి ఎక్కడున్నాడో తెలిసిందా తెలిస్తే చెప్పండి వెళ్లి తీసుకు వస్తాను అంటాడు.
అప్పటికే కోపం మీద ఉన్న మహేంద్ర తనని తాను కంట్రోల్ చేసుకోలేక నువ్వు మా మీద చాలా అనుమాన పడుతున్నావు అందుకే మమ్మల్ని వెంబడిస్తున్నారు అని అతను చెయ్యి పట్టుకుని ఫణీంద్ర దగ్గరికి లాక్కొని వెళ్తాడు. ఏం జరిగింది అంటాడు ఫణీంద్ర. శైలేంద్ర హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు మేము రిషి కోసం బాధపడుతూ మాట్లాడుకుంటే మా దగ్గరికి వచ్చి ఏదేదో ఆరాలు తీస్తున్నాడు. మమ్మల్ని అనుమానిస్తున్నాడు అని చెప్తాడు మహేంద్ర.
బాబాయ్ ఏమిటి ఇలా ఇరికించేసాడు అని మహేంద్ర ని తిట్టుకుంటాడు శైలేంద్ర. ఫణీంద్ర కోపంతో రగిలిపోతాడు అసలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్ళవలసిన అవసరం నీకేం వచ్చింది మొన్న అలాగే రిషి గురించి తప్పుగా మాట్లాడావు. రోజు రోజుకి నీ మీద నా మనసు విరిగిపోయేలాగా ప్రవర్తిస్తున్నావు అంటూ కొడుక్కి చివాట్లు పెడతాడు. ఇది ఇక్కడితో వదిలేలాగా లేదు పెద్ద గొడవకి దారి తీసే లాగా ఉంది అని మనసులో అనుకుంటుంది జగతి.
వదిలేయండి బావగారు తన తప్పు తానే తెలుసుకుంటాడు అని ఫణీంద్ర కి చెప్తుంది. లేదమ్మా అసలు వీడి అనుమానం ఏంటో తెలుసుకుని తీరాలి అంటాడు ఫణీంద్ర. వదిలేయ్ అన్నయ్య.. అటు రిషి గురించి బాధపడుతూ ఇటు కాలేజీ గురించి బాధపడుతూ నాకు ప్రెస్టేషన్లో ఉన్నాము మమ్మల్ని అనుమానిస్తే బాధనిపించింది అందుకే నీకు చెప్పాము ఇక ఇక్కడితో వదిలేయ్ అంటాడు మహేంద్ర. నువ్వు వాళ్ళ విషయాల్లో కలుగజేసుకోవద్దు నీకు ఇంతకుముందే చెప్పాను కానీ నువ్వు వినిపించుకోలేదు.
మళ్లీ గాని రిపీట్ అయిందంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నీ ఊహకు కూడా అందవు అని కొడుకుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ఫణీంద్ర. దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవయాని మాత్రం అందరి ముందు చెట్టు ఎంత కొడుకుని నిలదీయడం ఏమిటి అని అడుగుతుంది. వాడు చేసింది ఏమైనా బాగుందా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు వెళ్లి మధ్యలో దూరడం ఏమిటి..
నువ్వైనా వాడికి 4 మంచి మాటలు చెప్పు అప్పుడైనా అందరం బాగుంటాము అని చెప్పి భార్యకి కూడా చివాట్లు పెడతాడు ఫణీంద్ర. మరోవైపు వసుధార మాటలకి ఆలోచనలో పడతాడు రిషి. అసలు నా మీద ఎందుకు ఎవరు ఇన్నిసార్లు అటాక్ చేయిస్తున్నారు. వాళ్ళు ఎవరో మేడం కి వసుధారకి తెలుసా.. వాళ్ళ ఒత్తిడితోనే నామీద అభియోగం మోపారా అని అనుకుంటాడు. మళ్లీ తనే ఏదైతేనేమి నా మీద అభియోగం మోపి నన్ను మనిషిగా చంపేశారు.
గతాన్ని తవ్వుకోవలసిన అవసరం లేదు. అలాగే మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా నా మనసు స్పందించడం లేదు అని అనుకుంటాడు రిషి. మరోవైపు గదిలోకి వచ్చిన తర్వాత భర్తని మందలిస్తుంది జగతి. బావగారికి నిజం తెలిస్తే ఏమయ్యేది ఆయన క్షేమం కోసమే కదా మనం నిజం బయట పెట్టడం లేదు అంటుంది. నిజమే జగతి కానీ వాళ్ళు అన్నయ్య ఒక్కడికే భయపడతారు వాళ్లని కొంచెం అదుపులో పెడదామని అలా చేశాను.
అన్నయ్య వెనుక మాత్రమే వదిన గాని సైలేంద్ర గాని ఏమైనా చేయగలరు. అయినా నువ్వు ఈ సంగతి వదిలేయ్ వాళ్లని ఎప్పుడు ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు బాగా తెలుసు నువ్వు మన కొడుకుని మన ఇంటికి ఎలా తెచ్చుకోవాలో అది మాత్రం ఆలోచించు చాలు అంటాడు మహేంద్ర. సీన్ కట్ చేస్తే తన మంచం మీద కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది వసుధార.
మీరు ఎంత గతాన్ని మర్చిపోదాం అన్నా మర్చిపోలేక పోతున్నారు నా మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ మీ మనసులో నా మీద ఉన్న ప్రేమ పోలేదు అందుకే నన్ను ఇంత కేరింగ్ గా చూసుకుంటున్నారు అని అనుకుంటుంది. ఇంతలో ఏంజెల్ వచ్చి భోజనం తీసుకు రమ్మంటావా అని అడుగుతుంది. వద్దు నా కాలు బానే ఉంది నేనే భోజనానికి వస్తాను అంటుంది వసుధార. సరే పద అయితే రిషి ని భోజనానికి పిలుద్దాము అంటుంది ఏంజెల్. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్లో చూద్దాం.