MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: కొడుకుని ఘోరంగా అవమానించిన ఫణీంద్ర.. సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చిన రిషి!

Guppedantha Manasu: కొడుకుని ఘోరంగా అవమానించిన ఫణీంద్ర.. సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చిన రిషి!

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తను ప్రేమించిన అమ్మాయిని ఎంత అసహ్యించుకుంటున్నా ఆమె బాగోగులు చూసుకుంటున్న ఒక ప్రేమికుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Jul 26 2023, 07:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 ఎపిసోడ్ ప్రారంభంలో నీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా అందుకే నిన్ను ఈ మీటింగ్ కి పిలవలేదు అయినా వచ్చావు. వచ్చి లేనిపోని ప్రశ్నలు వేస్తున్నావు. అయినా నేనేమీ పూర్తి బాధ్యతను ఆ కాలేజీకి అప్పగించడం లేదు. వదిలేయడానికి బాధ్యతలు అప్పగించడానికి చాలా తేడా ఉంది చదువుకున్నావు కదా ఆ మాత్రం  తేడా తెలియదా అని శైలేంద్రని కసురుకుంటుంది జగతి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

చూసారా డాడ్ నన్ను  ఎంత మాట అంటున్నారో. పేర్లు అడిగితే చెప్పడం లేదు అంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. నాకు అడగడానికి హక్కు లేదు అంటున్నారు కనీసం మీరైనా అడగండి అని ఫణింద్ర తో చెప్తాడు శైలేంద్ర. ఫణీంద్ర మరింత కోప్పడి అసలు నిన్ను ఎవడు మీటింగ్కి రమ్మన్నాడు వాళ్ల గురించి ఏం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు ఏం చేసినా పక్కగా చేస్తారు. అయినా నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు మిషన్ ఎడ్యుకేషన్ మీద బేసిక్ నాలెడ్జి కూడా లేదు అని కొడుకుని ఘోరంగా అవమానించి బయటికి పంపించేస్తాడు ఫణీంద్ర.
 

38

త్వరలోనే పేర్లు చెప్తాము అంటుంది జగతి. అక్కర్లేదు మీ మీద ఆ మాత్రం నమ్మకముంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని తన ఫుల్ సపోర్ట్ వాళ్లకి ఇస్తాడు ఫణీంద్ర. మరోవైపు కారులో వెళ్తూ ఉంటారు వసుధార, ఏంజెల్. మీ కాలేజీలో అంత మంది ఉన్నారు కదా నన్ను ఎందుకు రమ్మన్నావు అయినా మనం ఎక్కడికి వెళ్తున్నాము  అంటుంది ఏంజెల్. నువ్వు నా ఫ్రెండ్ వి అయినా నేను పడే ఇంటెన్షన్ నువ్వు చూస్తే మీ తాతయ్యకి చెప్తావు కదా అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అంటుంది వసుధార.
 

48

రిషి కూడా వచ్చి ఉంటే బాగుండేది తనకి ఇష్టం లేకపోయినా నేను సినిమాలు కి షాపింగ్ కి రమ్మంటే వచ్చేవాడు కానీ ఈరోజు ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు నువ్వు ఉన్నావని ఏమో అంటుంది ఏంజెల్. వాళ్ళిద్దరూ అలా కారులో వెళ్తుంటే వెనకాతల కాలేజీ అటెండర్ ఫాలో అవుతూ ఉంటాడు. శైలేంద్ర అతనిని డబ్బుతో కొనేసి రిషి, వసుధార ఎప్పుడు ఏం చేసినా తనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పడంతో వాళ్లని ఫాలో అవుతాడు అటెండర్. మరోవైపు రిషి వసుధార మేడం ఏంజెల్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు మీకు తెలుసా అని విశ్వనాధాన్ని అడుగుతాడు.
 

58

 తెలియదు అంటాడు విశ్వనాథం. వసుధార మేడం కాలు బాగోలేదు ఈ రోజే ఆవిడ కాలేజీకి వచ్చారు ఈరోజే బయట పనులు పెట్టుకోవడం ఏంటి అంటాడు రిషి. నువ్వు ఏమి గమనించినట్లే ఉంటావు కానీ అన్ని గమనిస్తావు అయినా నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదులే వసుధార తెలివైన అమ్మాయి వాళ్లకి ఏమీ కాదు వచ్చేస్తారు అంటాడు విశ్వనాథం. ఏమైనా వాళ్ళిద్దరూ అలా వెళ్ళటం నాకు నచ్చలేదు అంటాడు రిషి. సీన్ కట్ చేస్తే వసుధార ఏంజెల్ ని తీసుకొని ఒక బస్తీకి వెళ్తుంది. అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూపించి వీళ్ళు చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకపోతున్న పిల్లలు.
 

68

 వీళ్ళకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్తే వాళ్ళు చదువుకొని బాగుపడతారు అని ఏంజెల్ కి చెప్తుంది. పిల్లలందరినీ పిలిచి మీకు చదువుకోవాలని ఉందా అని అడుగుతుంది. అవును అంటారు పిల్లలందరూ. అయితే మీ తల్లిదండ్రులని తీసుకొని రండి అనటంతో పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులని తీసుకొని వస్తారు. వాళ్లకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వసుధార. ఇదే విషయాన్ని అటెండర్ శైలేంద్ర కి ఫోన్ చేసి చెప్తాడు. తన ప్లాన్ వర్క్ అవుట్ అవ్వకూడదు అక్కడ వాళ్ళు ఆవిడ మీద ఎదురు తిరిగేలాగా చెయ్యు.
 

78

ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇవ్వు అని చెప్పడంతో అటెండర్ బస్తీలో ఇద్దరు దంపతులని డబ్బులు ఇచ్చి ఆశపెట్టి వసుధార మీద తిరగబడే లాగా చేస్తాడు. మీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు మాలాంటి వాళ్ళని ఆశపెట్టి తర్వాత మధ్యలోనే వెళ్లిపోతారు అని తను రెచ్చిపోవటమే కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా రెచ్చగొట్టేలాగా చేస్తుంది డబ్బులు తీసుకున్నవిడ. ఆవిడ భర్త వసుధార కార్ టైర్ లో గాలి తీసేస్తాడు. కోపంతో మనిషివా పశువు వా అని అడుగుతుంది వసుధార.
 

88

నా  భర్తని అంత మాట అంటావా అంటూ వసుధార మీద చెయ్యెత్తుతుంది  ఆవిడ. ఆవిడని అడ్డుకుంటుంది వసుధార. ఇంతలో రిషి పాండ్యన్ వాళ్లతో సహా అక్కడికి వచ్చి ఏం జరిగింది.. అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని వసుధారని నిలదీస్తాడు. సడన్గా అక్కడికి వచ్చిన రిషి ని చూసి షాక్ అవుతారు ఏంజెల్ వసుధార. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Box Office: సీఎం విజయ్ కి షాకిచ్చిన సూర్య, రికార్డులన్నీ లేచిపోతున్నాయ్.. కలెక్షన్ల సునామీ!
Recommended image2
Peddi: అప్పలసూరి ముందు ఫణీంద్ర భూపతి, బసిరెడ్డి జుజుబీనా ? సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు టాప్ 5 రోల్స్
Recommended image3
Trending Song: మూడు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ .. ఏం పాటరా బాబు.. మైండ్ లో నుంచి పోవట్లేదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved