Guppedantha Manasu: వసుధార సహాయం కోరిన రిషి.. జగతి దంపతులను తప్పుపడుతున్న ఫణీంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అధికారం కోసం తండ్రిని తప్పుదోవ పట్టిస్తున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

అప్పుడు వసుధార ఏంటి ఈ టైం లో వచ్చావు అని అడుగుతుంది. ఏం రాకూడదా.. నిన్ను కాలేజీకి వెళ్లకుండా డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది ఏంజెల్. అలా ఏం కాదు ఏదో ఇంపార్టెంట్ పని లేకపోతే నువ్వు రావు.. విషయం ఏంటో చెప్పు, నీ పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా అంటుంది వసుధార. ఆలోచించాను కానీ నువ్వే అతని మనసులో ఏముందో కనుక్కోవాలి అంటుంది ఏంజెల్.
ఎపిసోడ్ ప్రారంభంలో మీరు ఎవరి మీదో కోపాన్ని నా మీద చూపిస్తున్నట్లుగా ఉన్నారు అంటుంది వసుధార. మనసులో మాత్రం మీ ప్రేమ, మీ స్వేచ్ఛ, మీ స్వతంత్రం అన్ని నా దగ్గరే అంటూ రిషివైపే చూస్తూ ఉండిపోతుంది. మీరు చూడవలసింది నా వైపు కాదు పని వైపు. ముందు పని కానీయండి అంటాడు రిషి. అలాగే అంటుంది కానీ పదేపదే రిషి ని చూస్తూ ఉంటుంది వసుధార. అది గమనించిన రిషి నా క్యాబిన్లో లాస్ట్ ఇయర్ సిలబస్ పెట్టాను తీసుకొని రండి అంటాడు.
అలాగే అని చెప్పి అతని గదికి వెళ్లి సిలబస్ వెతుకుతూ ఉంటే రిషి డ్రా చేసిన కళ్ళు డ్రాయింగ్ ఆమెకి కనిపిస్తుంది. ఆ డ్రాయింగ్ నే చూస్తూ ఉండిపోతుంది వసుధార. అంతలో రిషి వచ్చి ఆ డ్రాయింగ్ తన దగ్గర నుంచి లాక్కొని, నేను చెప్పింది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి. ఏది కనపడితే అది చూసేస్తారా అంటూ మందలిస్తాడు. చూసినా తప్పేం లేదు కానీ ఆ కళ్ళు ఎవరివి సార్.. అంత బాగున్నాయి అని అడుగుతుంది.
అవన్నీ మీకు అనవసరం అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోమంటాడు రిషి. సరే అని వసుధార వెళ్ళిపోతుంటే ఆమెని ఆపి నాకు ఒక సహాయం చేయండి అని అడుగుతాడు. చెప్పండి సార్ మీరు ఏం అడిగినా చేస్తాను అంటుంది వసుధార. నేను ఏంజెల్ కి తగను అని తనకి అర్థమయ్యేలాగా చెప్పండి అంటాడు రిషి. ఎందుకు తగురు సార్ అంటుంది వసుధార. తను ఒక తోడు కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటుంది.
ఏ తోడు లేని నేను తనకి తోడు ఎలా అవుతాను. అందుకే తనకి అర్థమయ్యేలాగా విషయం చెప్పండి అంటాడు రిషి. ఆమె అడిగినప్పుడు హెల్ప్ చేశాను అలాగే మీరు ఇప్పుడు హెల్ప్ అడుగుతున్నారు, చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత చేతిలో ఉన్న పెయింటింగ్ చూసి ఆనంద పడుతూ ఉంటాడు రిషి. పెయింటింగ్ చాలా బాగుంది సార్ అంటూ మళ్లీ వెనక్కి వచ్చిన వసుధారా రిషి ని ఆటపట్టించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఒకసారి గా షాకవుతాడు రిషి కానీ వసుధార వెళ్ళిపోయిన తర్వాత నవ్వకుంటాడు. మరోవైపు లాకర్ కీస్ దేవయానిని అడుగుతుంది జగతి. నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను అంటుంది దేవయాని. నాకు సంబంధించిన గోల్డ్ మొత్తం నాకు కావాలి అంటుంది జగతి. అంత పెద్ద మొత్తంలో బంగారం ఎందుకు, ఏం చేస్తావు అని అడుగుతుంది దేవయాని. కానీ జగతి దంపతులు ఏమి సమాధానం చెప్పకపోవడంతో గట్టిగా అడుగుతుంది.
ఆ కేకలకి అక్కడికి వస్తారు ఫణీంద్ర శైలేంద్ర. ఎందుకో వాళ్ల మీద కేకలు వేస్తున్నావు అని భార్యని అడుగుతాడు ఫణీంద్ర. తన బంగారం మొత్తం కావాలంట.. ఎందుకు అని అడిగితే చెప్పడం లేదు మీరైనా అడగండి అంటుంది దేవయాని. తను చెప్పేది నిజమేనా అంత పెద్ద మొత్తంలో బంగారం ఎందుకు అని అడుగుతాడు ఫణీంద్ర. తాకట్టు పెట్టడానికి అంటాడు శైలేంద్ర. శైలేంద్రని కోప్పడతాడు ఫణీంద్ర.
నేను చెప్పేది నిజమే డాడ్ అంటూ జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచారు, మీరు తప్పు చేశారు అంటాడు ఫణీంద్ర. మీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు బావగారు అంటుంది జగతి. గోల్డ్ తాకట్టు పెడితే మామగారి పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది అంటుంది దేవయాని. అదీ నిజమే కానీ అంత పెద్ద మొత్తంలో ఇప్పుడు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు ఫణీంద్ర.
మీరు పర్మిషన్ ఇస్తే నేను అరేంజ్ చేస్తాను అంటాడు శైలేంద్ర. కొడుకుకి పర్మిషన్ ఇస్తాడు ఫణీంద్ర. శైలేంద్ర నేరుగా సౌజన్య రావు దగ్గరికి వెళ్లి నేను రాయమన్నట్టే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశావు కదా అని అడుగుతాడు. అవును అంటాడు సౌజన్య రావు. అప్పుడు తండ్రికి ఫోన్ చేసి నా ఫ్రెండ్ డబ్బులు అరేంజ్ చేస్తానన్నాడు కానీ చిన్న అగ్రిమెంట్ అడుగుతున్నాడు అంటాడు శైలేంద్ర. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వడం అవసరం కాబట్టి అగ్రిమెంట్ పూర్తి చేసి డబ్బులు తీసుకురా అంటాడు ఫణీంద్ర.
అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసిన శైలేంద్ర ఇక కాలేజీ నీ చేతికి నీ చేతిలోంచి నా చేతికి రావడం ఖాయం అని సౌజన్య రావు కి చెప్పి అతని దగ్గర డబ్బు తీసుకొని అక్కడ వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇన్నాళ్లు మనం శైలేంద్రని నమ్మలేదు కానీ వాడు కూడా పనికొచ్చే పనులు చేస్తున్నాడు అని కొడుకుని తమ్ముడు మరదలు దగ్గర పొగుడుతాడు ఫణీంద్ర. కానీ శైలేంద్ర తప్పు చేస్తున్నాడని గ్రహించిన జగతి దంపతులు మాత్రం టెన్షన్ పడతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.