MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Peddi 9 Days Collections: బాక్సాఫీసు వద్ద పెద్ది బిగ్‌ డ్రాప్‌.. 9 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

Peddi 9 Days Collections: బాక్సాఫీసు వద్ద పెద్ది బిగ్‌ డ్రాప్‌.. 9 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

Peddi 9 Days Collections: రామ్‌ చరణ్‌ నటించిన `పెద్ది` సినిమా బాక్సాఫీసు వద్ద మొదటి వారం మంచి వసూళ్లని రాబట్టింది. కానీ రెండో వారంలో అసలు స్ట్రగుల్‌ స్టార్ట్ అయ్యింది. కలెక్షన్లు డ్రాప్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 13 2026, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెద్ది సినిమా బాక్సాఫీసు వసూళ్లు
Image Credit : X/@vriddhicinemas

పెద్ది సినిమా బాక్సాఫీసు వసూళ్లు

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `పెద్ది` సినిమా గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. శివరాజ్‌ కుమార్‌, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించినా, కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. మొదటి వీకెండ్‌లో అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఇక మొదటి వారంలో జోరు చూపించిన ఈ చిత్రం రెండో వారంలో మాత్రం బాగా పడిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెద్ది 9 రోజుల కలెక్షన్లు
Image Credit : X/@vriddhicinemas

పెద్ది 9 రోజుల కలెక్షన్లు

ఇక పెద్ది సినిమా తొమ్మిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.287కోట్ల కలెక్షన్లని వసూలు చేసింది. ఇది ఇండియాలో రూ.236కోట్ల గ్రాస్‌ని, ఓవర్సీస్‌లో యాభై కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఇక రెండు వందల కోట్ల నెట్‌ వసూళ్లని రాబట్టడం విశేషం. ఈ సినిమా హిట్‌ కావాలంటే ఇంకా రూ.150కోట్ల వరకు వసూళ్లని రాబట్టాలి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.366కోట్లు వచ్చినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించడం విశేషం. 

Related Articles

Related image1
Kalyan Padala: మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల, తనూజ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌
Related image2
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
34
పెద్ది హిట్‌ కావాలంటే
Image Credit : X/@vriddhicinemas

పెద్ది హిట్‌ కావాలంటే

పెద్ది సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.220కోట్లు. అంటే రూ.450కోట్ల గ్రాస్‌ రాబట్టాలి. కాకపోతే ఇప్పటికే ఇది 60-70శాతం రికవరీ కావడం విశేషం. ఇది సినిమాకి పాజిటివ్‌ టోన్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు రెండో వారం వసూళ్లు మాత్రం బాగా పడిపోయాయి. శుక్రవారం ఇది ఆరు కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ శనివారం, ఆదివారం కాస్త పెరిగే ఛాన్స్ ఉంది. అయినా టార్గెట్‌ చాలా దూరంలో ఉంది. వచ్చే గురువారం వరకు ఈ సినిమాకి తిరుగులేదు. కానీ అప్పటి వరకు ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకి కలెక్షన్లు పెరిగే ఛాన్స్ లేదు. పైగా పెంచిన టికెట్‌ రేట్లు కూడా తగ్గిపోయాయి. దీంతో కలెక్షన్ల డ్రాప్‌ గట్టిగానే ఉంటుంది. ఏదేమైనా ఈ మూవీకి దాదాపు 20శాతం నష్టాలు తప్పేలా లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

44
పెద్ది స్టోరీ ఇదే
Image Credit : Asianet News

పెద్ది స్టోరీ ఇదే

పెద్ది సినిమా గుర్తింపు లేని తన ఊరుకోసం, తమ ప్రజల కోసం పెద్ది చేసే పోరాటమే ఈ మూవీ స్టోరీ. ఇందులో రామ్‌ చరణ్‌ పెద్దిగా నటించాడు. ఆయన క్రికెటర్‌గా, ఆ తర్వాత కుస్తీ వీరుడిగా కనిపించాడు. ఆ తర్వాత తన వారికోసం ఆయన కాలుని పోగొట్టుకొని మరీ రన్నర్‌గా మారతారు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తాడు. తన గ్రామానికి గుర్తింపుని, రైల్వే స్టేషన్‌ ని తీసుకురావడమే ఈచిత్ర స్టోరీ. ఇందులో జగపతిబాబు అప్పలసూరిగా మరో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. శివరాజ్‌ కుమార్‌.. గౌర్నాయుడిగా కనిపించిన విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ?
Recommended image2
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image3
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Related Stories
Recommended image1
Kalyan Padala: మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల, తనూజ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌
Recommended image2
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved