- Home
- Entertainment
- Payal Rajput: కెమెరా చాటున `ఆర్‌ఎక్స్ 100` భామ దాగుడు మూతలు.. చూపించేందుకు ఏ ఛాన్స్ వదలడం లేదుగా
Payal Rajput: కెమెరా చాటున `ఆర్‌ఎక్స్ 100` భామ దాగుడు మూతలు.. చూపించేందుకు ఏ ఛాన్స్ వదలడం లేదుగా
`ఆర్‌ఎక్స్ 100` భామ పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. తొలి చిత్రంతోనే సెన్సేషనల్ స్టార్‌గా మారిన ఈ హాట్ బ్యూటీ ఇంటర్నెట్‌లో మాత్రం అందాలతో దుమారం రేపుతుంది.

పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) కెరీర్ గాడి తప్పడంతో మళ్లీ ఒడిదుడుకులతో సినీ జీవితం సాగుతుంది. సరైన అవకాశాలను ఎంచుకోవడంలో విఫలమైన ఈ భామ అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ కాలేదు. వరుసగా తన హాట్ ఫోటోలతో ఘాటెక్కిస్తుంది. నెటిజన్లని తన వైపు తిప్పుకుంటోంది.
అందులో భాగంగా తాజాగా Payal Rajput చిలిపిగా కవ్వింపులకు దిగింది. కెమెరా చాటున దాగుడు మూతలు ఆడుతోంది. కొంటె చూపులతో నెటిజన్లకి, తన అభిమానులను కవ్విస్తుందీ సెక్సీ అందాల సోయగం. దీంతో ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సండే స్పెషల్ గా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోలతో కనువిందు చేస్తుందని చెప్పొచ్చు.
అయితే షూటింగ్ లొకేషన్‌లో పాయల్ ఇలా చిలిపి పనులు చేసింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో `గోల్‌మాల్` ఒకటి. తమిళంలో రూపొందుతున్న చిత్రమిది. శనివారం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఆ సమయంలో పాయల్ ఇలా పోజులిచ్చి అభిమానులను అలరిస్తుంది. బెస్ట్ టీమ్‌తో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది పాయల్.
ప్రస్తుతం పాయల్ తెలుగులో `తీస్ మార్ ఖాన్` చిత్రంలో నటిస్తుంది. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్నారు. దీంతోపాటు తమిళంలో `ఏంజెల్ చిత్రం, కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `హెడ్ బుష్` అనే సినిమా చేస్తుంది పాయల్. ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
కానీ `ఆర్‌ఎక్స్ 100`తో వచ్చిన క్రేజ్‌ని, పాపులారటీ, ఇమేజ్‌ని క్యారీ చేయడంలో విఫలమైంది పాయల్. ఆ తర్వాత కూడా మంచి ప్రాజెక్ట్ లు సెలక్ట్ చేసుకుంటే ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేది. కానీ సినిమాల ఎంపికలో చేసిన మిస్టేక్స్ తో ఇప్పుడు ఆమె కెరీర్ స్ట్రగులింగ్‌లో పడిందని చెప్పొచ్చు. వెంకటేష్, రవితేజ వంటి పెద్ద హీరోలతో నటించినప్పటికీ ఆయా చిత్రాలు ఆడియెన్స్ ని అలరించడంలో విఫలం కావడంతో ఈ బ్యూటీకి పేరు రాలేదు.
మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది పాయల్. తన గ్లామర్ పిక్స్ ని పంచుకుంటూ అటు అభిమానులను అలరిస్తుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మరోవైపు ప్రేమలోనూ మునిగి తేలుతుంది. సౌరభ్ దింగ్రా అనే నటుడితో పాయల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనతోనూ రొమాన్స్ చేస్తూ బిజీగా ఉంటుంది.