MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనీల్ రావిపూడి రెమ్యునరేషన్ వెంకీని దాటే తీసుకున్నారా?

అనీల్ రావిపూడి రెమ్యునరేషన్ వెంకీని దాటే తీసుకున్నారా?

సంక్రాంతికి విడుదలైన వెంకటేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ కంటే అనీల్ రావిపూడి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 17 2025, 06:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anil Ravipudi, Venkatesh, Remuneration

Anil Ravipudi, Venkatesh, Remuneration


సక్సెస్ ఎవరినైనా ఏ స్దాయికైనా తీసుకెళ్తుంది. అందరిచేతా శభాష్ అనిపించేలా చేస్తుంది. ఆర్దిక వెసులుబాట్లు అనేకం చేస్తుంది. ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడి కు అదే జరుగుతోంది.  వెంకటేష్ హీరోగా అనీల్ రావి పూడి  తెరకెక్కించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మెగా హిట్ అయ్యింది. మిగతా రెండు  సంక్రాంతి సినిమాలను దాటుకుని కలెక్షన్స్ వైజ్ దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా డైరక్టర్ , హీరో ఎంతెంత రెమ్యునరేషన్స్ తీసుకున్నారనే విషయాలు బయిటకు వచ్చాయి. అందులో అనీల్ రావిపూడి రెమ్యునరేషన్ వెంకటేష్ ని మించిపోవటం అందరినీ షాక్ ఇచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju


మొదటి నుంచి అనిల్ రావిపూడి సినిమాలంటే  ఫన్, ఎంటర్టైన్మెంట్.  ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమా కూడా అంతే చిన్న పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయే సాంగ్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ లు ఏమి లేకుండా సింపుల్ గానే సెట్ చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం క్రైమ్ కామెడీతో నడిపారు.

35
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju


‘సంక్రాంతికి వస్తున్నాం’ లో కామెడీతో పాటు అంతర్లీనంగా ఓటీటీ పిల్లలపై ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందో, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి అంటూ మంచి మెసేజ్ లు కూడా ఎంటర్టైనింగ్ గా చెప్పారు. రియల్ లైఫ్ లో జరిగే చాలా సన్నివేశాలు బాగా రాసుకుని, పర్ఫెక్ట్ డైలాగ్స్ తో ఎంటర్టైన్మెంట్ గా ప్రజెంట్ చేసాడు అనిల్ రావిపూడి. ఏ అంచనాలు లేకుండా ఫ్యామిలీతో వెళ్తే సినిమాని నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా.

45
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju

 రెమ్యునరేషన్ విషయాలకు వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిమిత్తం హీరో వెంకటేష్ కు రెమ్యునరేషన్ గా పది కోట్లు  పే చేసారని తెలుస్తోంది. అలాగే డైరక్టర్ అనీల్ రావిపూడికి 15 కోట్లు పే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అడ్వాన్ గా అనీల్ రావిపూడికి 10 కోట్లు ఇచ్చి రిలీజ్ కు ముందు మిగతా ఐదు కోట్లు క్లియర్ చేసారని సినిమా వర్గాల సమాచారం. దాంతో హీరో వెంకటేష్ కన్నా ఐదు కోట్లు ఎక్కువే అనీల్ రావిపూడి తీసుకున్నారంటున్నారు. అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

55
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju

ప్రస్తుతం మార్కెట్‌లో  ‘సంక్రాంతికి వస్తున్నాం’మూవీకున్న డిమాండ్‌ పెరిగిపోవటంతో టీమ్ స్క్రీన్స్ పెంచేసింది. సంక్రాంతి సెలవులు కావడంతో కుటుంబాలతో కలిసి జనాలు థియేటర్‌లకు క్యూ కడుతున్నారు. అన్ని షోలు దాదాపు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా ఏపీ, తెలంగాణల్లో అదనంగా 220+ షోలను ప్రదర్శించేందుకు చిత్ర టీమ్ సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను వదిలింది టీమ్.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
Before Stardom:సినిమాల్లోకి రాకముందు ఈ స్టార్లు చేసిన జాబ్స్ ఇవే..ఉద్యోగం వదిలేసి నటులుగా టాప్ పొజిషన్ కి..
Recommended image2
Peddi Controversy: పెద్ది సెట్‌లో జాన్వీకి రాంచరణ్ సపోర్ట్.. కెమెరా యాంగిల్స్ పై అసంతృప్తి, లీకైన చాట్స్?
Recommended image3
Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved