- Home
- Entertainment
- పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వీక్‌నెస్ బయటపెట్టిన పూరీ జగన్నాథ్.. వీళ్లతో సినిమా ఇంత ఈజీనా?
పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వీక్‌నెస్ బయటపెట్టిన పూరీ జగన్నాథ్.. వీళ్లతో సినిమా ఇంత ఈజీనా?
పూరీ జగన్నాథ్.. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. వాళ్లు ఏం కబుర్లు చెబితే డేట్లు ఇస్తారో తెలుసుకున్నాడు. అవన్నీ బయటపెట్టాడు పూరీ.

ఒకప్పుడు టాలీవుడ్‌ని ఊపేసిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్లతోనూ సినిమాలు చేశారు. అందరికి హిట్లు ఇచ్చాడు. మాస్ హీరోలుగా నిలబెట్టాడు. అయితే ఈ క్రమంలో ఆయన హీరోల వీక్‌నెస్ ఏంటో పట్టేశాడు. ఏ హీరోకి ఎలాంటి కబుర్లు చెబితే డేట్లు ఇస్తాడో తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని బయటపెట్టాడు.
పూరీ జగన్నాథ్.. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో సినిమాలు చేశాడు. అలాగే చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి సీనియర్లతోనూ, రామ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలతోనూ సినిమాలు చేశాడు పూరీ. హీరోని ఆరొగెంట్‌గా, యాటిట్యూడ్‌గా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. వీళ్లందరితోనూ పనిచేసిన పూరీ వాళ్లు ఏం చెబితే సినిమాలు చేస్తారో తెలుసుకున్నాడు. ఆ విషయాలను బోల్డ్ గా వెల్లడించాడు.
మహేష్ బాబుతో `పోకిరి` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత `బిజినెస్ మ్యాన్` చేశాడు పూరీ. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాలను వెల్లడించాడు. సినిమా ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అంటే మహేష్ బాబు డేట్లు ఇస్తాడట.
ఇక పవన్ కళ్యాణ్‌తో అయితే.. ఈ సినిమాలో అన్నీ గన్సే.. ఇష్టం వచ్చినట్టుగా కాల్చుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడట. పూరీ.. పవన్‌తోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. `బద్రి` సినిమాతోనే ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ మూవీతో హిట్ కొట్టి స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత `కెమెరామెన్ గంగతో రాంబాబు` సినిమా చేశాడు. అది ఆడలేదు.
ప్రభాస్‌తో `బుజ్జిగాడు`, `ఏక్ నిరంజన్` చిత్రాలు చేశాడు పూరీ. రెండూ డిజాస్టర్ అయ్యాయి. `బుజ్జిగాడు`లో కామెడీ నవ్విస్తుంది. అయితే ప్రభాస్ మాత్రం.. సినిమా మొత్తం ఇండోర్లోనే షూటింగ్ అంటే డేట్లు ఇస్తాడట. సినిమా చేస్తాడట.
మరోవైపు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, కుమ్మేస్తున్నామ్, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్నామ్ అంటే ఎన్టీఆర్ డేట్స్ ఇస్తాడట. ఎన్టీఆర్‌తో `ఆంధ్రావాలా`, `టెంపర్` చిత్రాలు చేశారు.
మాస్ మహారాజాతో ఎక్కువ సినిమాలు చేశాడు పూరీ. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `ఇడియట్`, `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`, `నేనింతే`, `దేవుడు చేసిన మనుషులు` సినిమాలు చేశాడు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ముప్పై రోజుల్లో సినిమా అయిపోతుందని చెబితే రవితేజ డేట్స్ ఇస్తాడట. ఇలా స్టార్ హీరోలు ఎలా డేట్లు ఇస్తారో, ఎంత సింపుల్‌గా సినిమాలు చేయోచ్చో తెలిపారు పూరీ. ఇది బిజినెస్ మ్యాన్ టైమ్‌లో చెప్పిన మాట. ఇప్పుడు చాలా మారిపోయింది. కొందరు ఇప్పటికీ అలానే ఉన్నారని టాక్.
ప్రస్తుతం పూరీ కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. వరుసగా పరాజయాలు పడుతున్నాయి. చాలా ఫ్లాప్‌ల తర్వాత `ఇస్మార్ట్ శంకర్`తో హిట్ అందుకున్నాడు. చివరగా `లైగర్` చేసి బోల్తా కొట్టాడు. ఇప్పుడు రామ్‌తోనే `డబుల్ ఇస్మార్ట్` చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.