MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, చరణ్‌, బన్నీ, విజయ్, రామ్‌.. ఈ స్టార్ల ఫేవరేట్‌ హీరోయిన్లు ఎవరో తెలుసా?

పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, చరణ్‌, బన్నీ, విజయ్, రామ్‌.. ఈ స్టార్ల ఫేవరేట్‌ హీరోయిన్లు ఎవరో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రామ్‌, విజయ్‌ దేవరకొండ, రానా, గోపీచంద్‌ ఈ స్టార్‌ హీరోలు మెచ్చిన హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ వివరాలు నిజంగా ఫ్యాన్స్ కి క్రేజీగా అనిపించేలా ఉండటం విశేషం.  

2 Min read
Aithagoni Raju
Published : Jun 25 2023, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

హీరోయిన్లకి నచ్చిన హీరోలుంటారు, అలాగే హీరోలకు నచ్చిన హీరోయిన్లు ఉంటారు. అది సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు. మన టాలీవుడ్ స్టార్‌ హీరోల ఫేవరేట్‌ హీరోయిన్లు ఎవరనేది ఫ్యాన్స్ కి ఆసక్తిరేకెత్తించే అంశం. గతంలో పలు సందర్భాల్లో తమ ఫేవరేజ్‌ హీరోయిన్ల గురించి పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రామ్‌, విజయ్‌ దేవరకొండ, రానా, గోపీచంద్‌ వంటి హీరోల తమ ఫేవరేజ్‌ హీరోయిన్ల పేర్లు చెప్పారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. 
 

211

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన గతంలో ఓ సందర్భంలో తన ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరో రివీల్‌ చేశారు. దీపికా పదుకొనె తనకిష్టమైన హీరోయిన్‌ అని చెప్పారు. ప్రస్తుతం యాదృశ్చికంగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి `ప్రాజెక్ట్ కే`లో నటిస్తున్న విషయం తెలిసిందే. 

311

పవన్‌ కళ్యాణ్‌ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో రాణిస్తున్నారు. ఆయన ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అదే సమయంలో రాజకీయాల్లోనూ రచ్చ చేస్తున్నారు. మరి పవన్‌ కి ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరంటే.. ఆయన మాత్రం అలనాటి నటి సావిత్రి పేరు చెప్పారు. 

411

పవన్‌ కళ్యాణ్‌తోపాటు మరో గ్లోబల్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ సైతం తనకు నచ్చిన హీరోయిన్‌(ఫేవరేట్‌) సావిత్రినే అని తెలిపారు. గతంలో ఓ సందర్భంలో ఆయన ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. 
 

511

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఇప్పుడు `గుంటురు కారం`తో బిజీగా ఉన్నారు. మరి ఈ సూపర్‌ స్టార్‌ కి ఇష్టమైన కథానాయిక ఎవరంటే.. ఆయన మాత్రం అతిలోక సుందరి శ్రీదేవి పేరు చెప్పడంలో విశేషం. 
 

611

ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు రామ్‌చరణ్‌. శంకర్‌తో `గేమ్‌ ఛేంజర్‌`లో నటిస్తున్న ఆయన.. తనకు నచ్చిన హీరోయిన్‌ ఎవరంటే తను కూడా అతిలోక సుందరి శ్రీదేవి పేరు చెప్పారు. శ్రీదేవి.. చిరంజీవితో `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంలో నటించారు. ఈ సినిమాతోనే శ్రీదేవికి అతిలోక సుందరి అనే ట్యాగ్‌ని తగిలించారు ఫ్యాన్స్.
 

711

ఇక ఐకాన్‌ స్టార్‌గా మర్‌ పాన్‌ ఇండియా హీరోగా ఎదుగుతున్నారు అల్లు అర్జున్‌. `పుష్ప2`తో గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేసిన ఆయనకు నచ్చిన హీరోయిన్‌ రాణి ముఖర్జీ అట. ఓ సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు బన్నీ. 
 

811

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ విషయానికి వస్తే. ఆయన ఇప్పుడు `ఖుషి`తోపాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. తనకు నచ్చిన హీరోయిన్‌ రాధికా ఆప్టే అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడిచారు. 
 

911

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్‌ స్టార్‌గా రాణిస్తున్నారు రామ్‌ పోతినేని. ఆయన ఇప్పుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. మరి రామ్‌ మెచ్చిన హీరోయిన్‌ ఎవరంటే.. ఆయన కూడా శ్రీదేవి పేరే చెప్పడం విశేషం. ఆయనతోపాటు అల్లరి నరేష్‌కి కూడా శ్రీదేవినే ఫేవరేట్‌ హీరోయిన్‌. 

1011

మరోవైపు యాక్షన్‌ హీరో, మ్యాచో స్టార్‌గా పిలుచుకుంటున్న గోపీచంద్‌ కి ఇష్టమైన హీరోయిన్‌ ఉంది. అది సహజ నటి `సౌందర్య` కావడం విశేషం. ఓ సందర్భంలో గోపీచంద్‌ తన ఫేవరేట్‌ హీరోయిన్‌ సౌందర్య అని చెప్పారు. 

1111

ఇక టాలీవుడ్‌ హంక్‌ రానా.. హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నారు. నటుడిగా బారియర్స్ బ్రేక్‌ చేసి సినిమాలు చేస్తున్న రానాకి ఫేవరేట్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ అంట. ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇమ్మాన్యుయెల్‌ ప్లాన్‌కి చిత్తైపోయిన సంజనా.. రీతూ టాలెంట్‌కి బిగ్‌ బాస్‌ ఫిదా
Recommended image2
అఖండ 2 మూవీ ఫస్ట్ రివ్యూ, క్లైమాక్స్ లో పూనకాలే, బాలయ్య విశ్వరూపం.. మైనస్‌ ఏంటంటే?
Recommended image3
సమంత రెండో పెళ్లిపై వేణు స్వామి అదిరిపోయే రియాక్షన్‌.. వీళ్లకి దిమ్మతిరిగే కౌంటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved