MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • హ్యాట్రిక్‌ ఫ్లాప్‌లు ఎదుర్కొన్న హీరోలు ఎవరో తెలుసా?.. పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, రవితేజలకూ తప్పలేదుగా..

హ్యాట్రిక్‌ ఫ్లాప్‌లు ఎదుర్కొన్న హీరోలు ఎవరో తెలుసా?.. పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, రవితేజలకూ తప్పలేదుగా..

సినిమాల్లో పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరికి పరాజయాలు వస్తాయి. కానీ సీనియర్లని పక్కన పెడితేఇప్పుడు సూపర్‌ స్టార్లుగా, స్టార్లుగా రాణిస్తున్న వారిలో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌లు ఎవరు కొట్టారో ఓ లుక్కేద్దాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 26 2024, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

టాలీవుడ్‌లో ఏ హీరోకైనా పరాజయాలు కామన్‌. ఎన్టీఆర్‌, ఎన్నార్ నుంచి, చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్ ల వరకు దీన్ని ఫేస్‌ చేశారు. మరి ఇప్పుడు సూపర్‌ స్టార్స్ గా రాణిస్తున్న నేటితరం హీరోలు పవన, మహేష్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్, బన్నీ, రవితేజ, నాని, విజయ్‌ దేవరకొండ వరకు పరాజయాలను ఎదుర్కొన్నారు. కొందరైతే డబుల్‌ ,త్రిబుల్‌ హ్యాట్రిక్‌ ఫ్లాపులను ఫేస్‌ చేయడం గమనార్హం. మరి ఆ హీరోలు, ఆయా సినిమాలేంటో చూద్దాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
pawan

pawan

పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లారు. డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. ఆయన కెరీర్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాపులున్నాయి. `జానీ`, `గుడుంబా శంకర్‌`, `బాలు`, `బంగారం`, `అన్నవరం` బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయం చెందాయి. `జల్సా` తర్వాత మరోసారి `పులి`, `తీన్‌ మార్‌`, `పంజా` సినిమాలు పోయాయి. `సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌`, `కాటమరాయుడు`, `అజ్ఞాతవాసి` చిత్రాలు కూడా బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫ్లాప్‌ అయ్యాయి. 

313

మహేష్‌ కి కూడా హ్యాట్రిక్‌ ఫ్లాపులున్నాయి. `పోకిరి` సినిమా తర్వాత వరసగా పరాజయం చెందాయి. `సైనికుడు`, `అతిథి`, `ఖలేజా` చిత్రాలు ఆడలేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 
 

413

ప్రస్తుతం `కల్కి 2898ఏడీ`తో రాబోతున్న ప్రభాస్‌ కెరీర్‌లోనూ వరుస పరాజయాలున్నాయి. `ఛత్రపతి` తర్వాత `పౌర్ణమి`, `యోగి`, `మున్నా`, `బుజ్జగాడు`,`బిల్లా`, `ఏక్‌ నిరంజన్‌`లతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టాడు డార్లింగ్‌. `బాహుబలి` తర్వాత `సాహో`, `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌` పోయాయి. 
 

513
NTR

NTR

ఎన్టీఆర్‌ కెరీర్‌లో `సింహాద్రి` తర్వాత `ఆంధ్రావాలా`, `సాంబ`, `నా అల్లుడు`, `నరసింహుడు`, `అశోక్‌`, `రాఖీ` చిత్రాలతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టాడు తారక్‌. `బృందావనం` తర్వాత `శక్తి`, `ఊసరవెళ్లి`(జస్ట్ యావరేజ్‌), `దమ్ము`, `బాద్షా`, `రామయ్యా వస్తావయ్యా`, `రభస`ఆల్మోస్ట్ డబుల్‌ హ్యాట్రిక్‌ పరాజయాలను అందుకున్నారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం `దేవర`తో రాబోతున్నాడు. 
 

613

అల్లు అర్జున్‌ `దేశముదురు` తర్వాత `పరుగు`, `ఆర్యా 2`, `వరుడు` చిత్రాలతో ఫ్లాప్‌ చవిచూశాడు. ఇప్పుడు `పుష్ప 2`తో ఇండియాని షేక్‌ చేయడానికి రాబోతున్నాడు. 

713

మాస్‌ మహారాజా రవితేజ కెరీర్‌లో `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి` తర్వాత `ఒక రాజు ఒక రాణి`, `దొంగోడు`, `వీడే` సినిమాలు పోయాయి. `వీరా`, `నిప్పు`, `దరువు`,అలాగే, `నేల టికెట్టు`, `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ`, `డిస్కో రాజా` చిత్రాలు పోయాయి.  ఇటీవల `ధమాఖా` తర్వాత `రావణాసుర`, `టైగర్‌ నాగేశ్వరరావు`, `ఈగల్‌` చిత్రాలు పరాజయం చెందాయి. 
 

813
Nithin, vakkamtham vamsy

Nithin, vakkamtham vamsy

నితిన్‌.. డబుల్‌, త్రిబుల్‌ హ్యాట్రిక్‌ ఫ్లాపులు అందుకున్న హీరో నితిన్‌. ఆయన `రామ్‌`, `టక్కరి`, `ఆటాడిస్తా`, `విక్టరీ`, `హీరో`, `ద్రోణ`, `రెచ్చిపో`, `సీతా రాముల కళ్యాణం లంకలో`, `మారో` పరాజయాలతో త్రిబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టాడు. `అ ఆ` తర్వాత `లై`, `చల్‌ మోహన రంగా`, `శ్రీనివాస కళ్యాణం`తో హ్యాట్రిక్‌ కొట్టాడు. `చెక్‌`, `రంగ్‌ దే`, `మ్యాస్ట్రో`, `మాచర్ల నియోజకవర్గం`, `ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్‌`లతో అదే బాటలో ఉన్నాడు నితిన్‌. 

913

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ విషయంలోనూ అదే ఉంది. ఆయన నటించిన `ఎందుకంటే ప్రేమంట`, `ఒంగోలు గిత్త`, `మసాలా` చిత్రాలు ఆడలేదు. `ఇస్మార్ట్ శంకర్‌` తర్వాత `రెడ్‌`, `ది వారియర్‌`, `స్కంద` చిత్రాలు ఆడలేదు. ఇప్పుడు `డబుల్‌ ఇస్మార్ట్`తో రాబోతున్నాడు. 

1013

నేచురల్‌ స్టార్‌ నాని కూడా `పైసా`, `ఆహా కళ్యాణం`, `జెండా పై కపిరాజు` చిత్రాలతో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌లు చూశాడు. ఇప్పుడు ఆయన `సరిపోదా శనివారం` సినిమాతో రాబోతున్నారు. 

1113

అలాగే కళ్యాణ్‌ కెరీర్‌లోనూ వరుస ఫ్లాపులున్నాయి. ఆయన `జయీభవ`, `కత్తి`, `ఓం` చిత్రాలతో హ్యాట్రిక్‌ ఫ్లాపులు చవిచూశాడు. ఇప్పుడు విజయశాంతితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. 
 

1213

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ ఉన్నాయి. `టాక్సీవాలా`(యావరేజ్‌) తర్వాత `డియర్‌ కామ్రేడ్‌`, `వరల్డ్ ఫేమస్ లవర్‌`, `లైగర్‌` చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టాడు.

1313
Naga Chaitanya

Naga Chaitanya

నాగచైతన్య.. `బంగార్రాజు` తర్వాత `థ్యాంక్యూ`, `లాల్‌ సింగ్‌ చద్దా`, `కస్టడీ` సినిమాలు పోయాయి. ఇప్పుడు సాయి పల్లవితో కలిసి `తండేల్‌`తో రాబోతున్నాడు. వీరితోపాటు అఖిల్‌, అల్లరి నరేష్‌, మంచు హీరోలు, నాగ శౌర్య, శర్వానంద్‌ వంటి హీరోలు కూడా ఉన్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
విజయ్ దేవరకొండ
అల్లు అర్జున్
నాని (నటుడు)
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved