MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `మాట వినాలి`, `దిల్‌రూబా` పాటలు ట్రెండింగ్‌.. `రాబిన్‌హుడ్‌`, `మ్యాడ్‌ 2`, ధనుష్‌ మూవీ రిలీజ్‌ డేట్లు

`మాట వినాలి`, `దిల్‌రూబా` పాటలు ట్రెండింగ్‌.. `రాబిన్‌హుడ్‌`, `మ్యాడ్‌ 2`, ధనుష్‌ మూవీ రిలీజ్‌ డేట్లు

పవన్‌ కళ్యాణ్‌ పాడిన `మాట వినాలి` పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. కిరణ్‌ అబ్బవరం `దిల్‌రూబా` నుంచి ఫస్ట్ సాంగ్‌ వచ్చింది. నితిన్‌ `రాబిన్‌హుడ్‌`, `మ్యాడ్‌ 2` రిలీజ్‌ డేట్లు.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Jan 18 2025, 11:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మాట వినాలి పాట రికార్డ్ వ్యూస్‌..

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ హిస్టారికల్‌ మూవీ `హరిహర వీరమల్లు` నుంచి మొదటి పాట విడుదలైంది. పవన్‌ కళ్యాణ్‌ పాడిన `మాట వినాలి` పాట శుక్రవారం విడుదల కాగా, ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది. అంతేకాదు ఏకంగా 25మిలియన్స్ వ్యూస్‌ ని సాధించింది. ఈ పాటకి కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

`దిల్‌ రూబా` నుంచి ఫస్ట్ సాంగ్‌..

`క` మూవీతో హిట్‌ కొట్టిన కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు `దిల్‌రూబా` చిత్రంతో వస్తున్నారు.  రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ ,  ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు `దిల్ రూబా" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'అగ్గిపుల్లె..' రిలీజ్ చేశారు మేకర్స్.  `అగ్గిపుల్లె అలా గీసినట్టు, కోపంగా చూడకే కొట్టినట్టు, గాలి దుమారమే రేగినట్టు, ఆవేశమెందుకే నొక్కిపెట్టు...' అంటూ బ్యూటిఫుల్ మెలొడీతో సాగుతుందీ పాట.

కిరణ్ అబ్బవరం, సామ్ సీఎస్ కాంబినేషన్ లో వచ్చిన "క" మూవీ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో "దిల్ రూబా" ఆడియో మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 
 

35

'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్‌ డేట్‌.. 

బ్లాక్ బస్టర్ చిత్రం `మ్యాడ్` కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్` ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన `లడ్డు గానీ పెళ్లి`, `స్వాతి రెడ్డి` పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. `మ్యాడ్ స్క్వేర్ `చిత్రాన్ని 2025 మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా `మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్` అని నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య పేర్కొన్నారు. ఈ మూవీకి కళ్యాణ్‌ శంకర్‌ దర్శకుడు. ఇందులో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ హీరోలుగా నటిస్తున్నారు. 
 

45

నితిన్‌ `రాబిన్‌హుడ్‌` రిలీజ్‌ డేట్‌..

నితిన్‌ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా `రాబిన్‌హుడ్‌` చిత్రం రూపొందుతుంది. కేతిక శర్మ మరో హీరోయిన్‌గా మెరవబోతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్‌ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది.

ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కేతికా శర్మ నటించిన సెకండ్ సింగిల్ కొన్ని రోజుల్లో విడుదల కానుంది, ఈ చిత్రానికి  జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ , మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  
 

55

ధనుష్‌ రూపొందించిన `జాబిలమ్మ నీకు అంత కోపమా’ రిలీజ్‌ డేట్‌.. 

ధనుష్‌ హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నారు. దర్శకుడిగానూ `పాపాండి`, `రాయన్‌` చిత్రాలు చేశారు. తాజాగా ఆయన దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతుంది. దీనికి తెలుగులో `జాబిలమ్మ నీకు అంత కోపమా` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆర్‌.కె.ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి ధ‌నుష్ సొంత నిర్మాణ సంస్థ వండ‌ర్‌బార్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

2018లో విడుద‌లైన `మారి2` త‌ర్వాత ధ‌నుష్ నిర్మిస్తోన్న సినిమా ఇది. రొమాంటిక్ కామెడీ క‌థ‌ను ధ‌నుష్ రాయ‌టం విశేషం. త‌మిళంతో పాటు తెలుగులో ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల‌వుతుంది. తెలుగు వెర్ష‌న్‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి విడుద‌ల చేస్తోంది. ఈ చిత్రంలో ప‌వీష్‌, అనిఖ సురేంద్ర‌న్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, మాథ్యూ థామ‌స్‌, వెంక‌టేష్ మీన‌న్‌, ర‌బియా ఖ‌తూన్‌, ర‌మ్యా రంగ‌నాథ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్
Recommended image3
Sunil: లాయర్లుగా రఫ్ఫాడించబోతున్న సునీల్, క్రేజీ హీరోయిన్.. మరో విలక్షణ పాత్రలో ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved