MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: మా ఉసురు తగిలిపోతారు, సినిమాని చంపకండి.. ఫ్యాన్స్ వార్‌పై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌

Pawan Kalyan: మా ఉసురు తగిలిపోతారు, సినిమాని చంపకండి.. ఫ్యాన్స్ వార్‌పై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అందరు హీరోల ఫ్యాన్స్ కి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో రివ్యూలు చెప్పేవారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 

4 Min read
Author : Aithagoni Raju
Published : Oct 02 2025, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`ఓజీ` సక్సెస్‌ సెలబ్రేషన్‌లో పవన్‌ పవర్‌ ఫుల్‌ స్పీచ్‌
Image Credit : Asianet News

`ఓజీ` సక్సెస్‌ సెలబ్రేషన్‌లో పవన్‌ పవర్‌ ఫుల్‌ స్పీచ్‌

సినిమాల ఫస్ట్ షోలకే సోషల్‌ మీడియా మినిట్‌ బై మినిట్స్ రివ్యూలు పెడుతున్నారు చాలా మంది సోషల్‌ మీడియా హ్యాండిల్స్. ఇందులో కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. వారికి పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ ఊసురు తగిలిపోతారని హెచ్చరించారు పవన్‌ కళ్యాణ్‌. తమ కష్టం ఎవరికీ తెలియదన్నారు. ఆయన హీరోగా నటించిన `ఓజీ` మూవీ గత వారం విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా, శ్రియా రెడ్డి, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, తేజ్ సప్రూ, హరీష్‌ ఉత్తమన్‌, ప్రకాష్‌ రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర సక్సెస్‌ సెలబ్రేషన్‌ని బుధవారం హైదారబాద్‌లో నిర్వహించారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పైరసీ గురించి, సినిమాని చంపేసే సోషల్‌ మీడియా పోస్ట్ ల గురించి, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ వార్‌ గురించి మాట్లాడారు. వారికి తనదైన స్టయిల్‌లో వార్నింగ్‌ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్యాన్స్ వార్‌ ఆపేయండి, సినిమాని చంపేయకండి
Image Credit : Asianet News

ఫ్యాన్స్ వార్‌ ఆపేయండి, సినిమాని చంపేయకండి

చిత్ర టీమ్ అందరికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, `అందరు హీరోల అభిమానులను తాను కోరుకునేది ఒక్కటే. చిరంజీవి, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, నాని, రవితేజ.. ఏ హీరో అయినా, ఏ భాష హీరో అయినా, వారి వర్క్ ని గౌరవించండి, ఆదరించండి. నేను ఆర్ట్ ని ప్రేమించేవాడిని. ఇంకో హీరోని ద్వేషిస్తున్నారంటే నాకు మనసు సరిగా ఉండదు. ఈ సందర్భంగా అందరు హీరోల అభిమానులకు, నా అభిమానులకు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాన్స్ వార్‌ గొడవలను ఆపేయండి. మేం ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు ఏం తెలుసు. ఎన్ని నిద్ర లేని రాత్రులు, ఎన్ని రోజులు ఇంటికి వెళ్లకుండా పనిచేస్తామో మీకు తెలియదు. ఇళ్లల్లో ఎన్ని తిట్లు తింటామో తెలియదు. సుజీత్‌ నెలన్నరగా తన భార్యని, పిల్లల్ని చూడలేదు. ఈ ఫ్యాన్స్ వార్ లో పడి దయజేసి సినిమాని చంపేయకండి. ఇప్పుడు సినిమా లైఫ్‌ తగ్గిపోయింది. ఒకప్పుడు వంద రోజులు, 150 రోజులు ఆడేవి. అప్పుడే సెలబ్రేట్‌ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆరు రోజులకే పరిమితమయ్యింది. ఈ ఫ్యాన్స్ వార్‌ని ఆపి, ఇతర హీరోల సినిమాలని కూడా అభినందించండి. అది కాకుండా ఇలా లేదు, అలా లేదు, చూడకూడని తిట్టుకుంటుంటే సోసైటీలో అగ్లీనెస్‌ పెరిగిపోతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. ఎవరు ఎంత మారతారు అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. నేను అందరి హీరోల అభిమానులను, ప్రేక్షకులను గౌరవిస్తాను. మంచి సినిమాలను అభినందిద్దాం, ఆదరిద్దాం` అని చెప్పారు.

35
మా ఉసురు తగిలిపోతారు జాగ్రత్త
Image Credit : Asianet News

మా ఉసురు తగిలిపోతారు జాగ్రత్త

ఆయన ఇంకా చెబుతూ సోషల్‌ మీడియా రివ్యూవర్స్ ని ఏకిపడేశారు. `సోషల్‌ మీడియా హ్యాండిల్స్ కి, యూట్యూబర్స్ కి నా రిక్వెస్ట్. సినిమా స్టార్ట్ అయ్యే లోపే ఆ స్టార్ట్ అయ్యింది. ఈ షాట్‌ బాలేదు. ఇప్పుడు ఇది అయ్యిందని పెడుతున్నారు. అసలు సినిమా బాగుందా లేదా అనేది రెండున్నరగంటలు చూడండి. ఇప్పుడు అందరు సినిమాని చూడటం మానేసి రివ్యూవర్స్ గా తయారయ్యారు. ఈ కల్చర్‌ ఎక్కడో ఒక చోట పోవాలి. పెరుగుడు విరుగుడు కొరకే. సినిమాకి కోట్లు ఖర్చు చేస్తాం. నేను `హరి హర వీరమల్లు`కి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. `అత్తారింటికి దారేదీ` సినిమా ఏడాదిన్నగా కష్టపడి చేస్తే, నెట్‌లో రిలీజ్‌ అయితే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. నలభై, యాభై కోట్లు వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం. ఆ సినిమా సమయంలో నేను పెట్టిన సంతకాలకు `కాటమరాయుడు` వరకు కడుతూనే ఉన్నా. ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలి. బయటకు చూడ్డానికి వెలుగులు, జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోధనగా ఉంటుందో ఎవరికీ తెలియదు. పైరసీ చేయడం ఈజీ, కానీ మా కష్టాలు తెలియదు. మీరు ఎత మంది పొట్టగొడుతున్నారో మీకు తెలయడం లేదు, మా ఉసురు తగిలేస్తుంది, మా ఏడుపులు తగిలేస్తాయి జాగ్రత్త. సినిమాని కక్ష్య కట్టి చంపేస్తే, చాలా మంది కడుపుకోత, ఆకలి మిమ్మల్ని వెంటాడుతుంది. నిర్మాతలు సినిమాలు చేయడానికి బయపడి పారిపోతారు. సినిమాల విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నామో నాకు తెలుసు. `హరి హర వీరమల్లు` మూవీ ఇబ్బందులను ఇప్పటికీ ఫేస్‌ చేస్తూనే ఉన్నాను` అని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.

45
`ఓజీ` సక్సెస్‌ ఒక సెలబ్రేషన్‌
Image Credit : Asianet News

`ఓజీ` సక్సెస్‌ ఒక సెలబ్రేషన్‌

ఈ వేడుకలో సినిమా సక్సెస్‌ గురించి, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల గురించి పవన్‌ కళ్యాణ్‌ చెబుతూ, `ఓజీ సినిమా మా అందరికి చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, గ్రేట్ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ, ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అవ్వడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం మాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఒక సినిమా సుజిత్ ద్వారా నాకు రావడం. దానికి తమన్ జీవం పోయడం, రవి కె చంద్రన్ ఫోటోగ్రఫీ అందివ్వడం. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, డీవీవీ దానయ్య ఇలా ఈ సినిమా గొప్పగా రావడానికి కారణమైన అందరికీ కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఒక సినిమా కథని రాయడం, చెప్పడం చాలా ఈజీ.. కానీ రాసిన కథను తెర మీదకు అలాగే తీసుకురావడం చాలా కష్టం. ఎందుకు అంటే డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలి. అది ఓజీ విషయంలో జరిగింద`న్నారు.

55
`ఓజీ` యూనివర్స్ కి రెడీ
Image Credit : Asianet News

`ఓజీ` యూనివర్స్ కి రెడీ

ఇంకా మాట్లాడుతూ, `మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఇప్పటి వరుకు ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలీదు. త్రివిక్రమ్ నేను మాట్లాడుకుంటున్నపుడు సుజిత్ టాపిక్ వచ్చింది. అలా ఓజీ స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఒక కత్తి పట్టుకుని జపానీస్ డ్రెస్ లో ఉంటారు. గన్స్ ఉంటాయి, మీరు ఒక గ్యాంగ్ స్టర్. ఇలాగే చెప్పాడు కథ, నాకు ఏం అర్థం కాలేదు. కానీ సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్ ను మా అబ్బాయి అకీరా నందన్ చదువుతూ చాలా ఆనందం పడుతూ ఉండేవాడు. అప్పుడు అనిపించింది, ఈ తరం వాళ్ళకి అర్థం అయ్యే కథే ఓజీ సినిమా అని. కొన్ని సార్లు సుజిత్ లో నన్ను నేను చూసుకుంటా. ఎందుకు అంటే కొన్ని సార్లు మనం చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోవచ్చు, కానీ చేసి చూపించగలం అని నేను బాగా నమ్ముతా. అది సుజిత్ లో నాకు కనిపించింది. అందుకే సుజిత్ కి నేను ఒక మాట ఇచ్చాను. ఓజీ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ మనం చేస్తున్నాం అని. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు. కానీ ఓజీ సినిమా నాకు మళ్లీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చింది. కాబట్టి నాకు ఉన్న సమయం లో ఓజి యూనివర్స్ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం నన్ను తమ్ముడు సినిమా రోజులకి తీసుకువెళ్లింది. అలాగే అర్జున్ దాస్ అతని చూసినపుడు నేను చాలా ఫీల్ అవుతాను అలాంటి గొంతు నాకు లేదు అని. ఓజీ యూనివర్స్ లో భాగం అయిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు` అని అన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Recommended image2
Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
Recommended image3
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్
Related Stories
Recommended image1
Kantara Chapter 1 Movie Review: `కాంతారః చాప్టర్ 1` మూవీ రివ్యూ, రేటింగ్‌.. కాంతారలా మ్యాజిక్ చేసిందా?
Recommended image2
Allu Sirish: ఎంగేజ్‌మెంట్‌ ప్రకటించిన అల్లు శిరీష్‌, తన కాబోయే భార్య నయనిక ఎవరో తెలుసా? వదినే అంతా సెట్‌ చేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved