MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దిల్‌రాజు 'అర్జున'.. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాకేనా టైటిల్.? డైరెక్టర్ ఎవరంటే

దిల్‌రాజు 'అర్జున'.. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాకేనా టైటిల్.? డైరెక్టర్ ఎవరంటే

Pawan Kalyan: నిర్మాత దిల్ రాజు అర్జున అనే టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేశారు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా కోసం అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

1 Min read
Author : Pavithra D
Published : Nov 28 2025, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'అర్జున' టైటిల్ ఎవరికి.?
Image Credit : instagram

'అర్జున' టైటిల్ ఎవరికి.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్జున అనే టైటిల్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ టైటిల్ ఎవరి కోసం, హీరో ఎవరు అనే ప్రశ్నలు తలెత్తాయి. మరి సినీ వర్గాలు ఎం చెబుతున్నాయో ఇప్పుడు చూసేద్దాం..

25
పవన్ కోసమే టైటిల్.?
Image Credit : Asianet News

పవన్ కోసమే టైటిల్.?

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, నిర్మాత దిల్ రాజు ఈ అర్జున టైటిల్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ కోసం రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

Related Articles

Related image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Related image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
35
ఆ ఇద్దరు ఒకరు డైరెక్టర్.?
Image Credit : instagram

ఆ ఇద్దరు ఒకరు డైరెక్టర్.?

ఈ సినిమాకు అనిల్ రావిపూడి లేదా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. అర్జున టైటిల్ పవన్ కళ్యాణ్ కోసమే అయితే, ఇది మైథలాజికల్ టచ్ ఉన్న సోషల్ కాన్సెప్ట్‌తో రూపొందవచ్చని అంటున్నారు. అయితే, ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

45
ఉస్తాద్ భగత్ సింగ్ వేసవికి రిలీజ్
Image Credit : X

ఉస్తాద్ భగత్ సింగ్ వేసవికి రిలీజ్

ప్రస్తుతానికి, పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత దిల్ రాజుతో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకు, ప్రజాసేవకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. వరుసగా జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

55
పవన్ నెక్స్ట్ సినిమా సంగతేంటి.?
Image Credit : instagram

పవన్ నెక్స్ట్ సినిమా సంగతేంటి.?

మరోవైపు దిల్ రాజుతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నిర్మాతలకు కూడా పవన్ డేట్స్ ఇచ్చారని, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అప్పుడెప్పుడో ప్రకటించిన సినిమా కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ తన తదుపరి ప్రాజెక్ట్‌లను ఎలా ప్లాన్ చేస్తారో వేచి చూడాలి. అటు అభిమానులు మాత్రం పవన్ సినిమా అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
బాలీవుడ్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
సుడిగాలి సుధీర్ ఎంత పిసినారో తెలసా? రూపాయి కూడా ఖర్చు పెట్టడా? ఆటో రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved