గేమ్ ఛేంజర్ కోసం డిప్యూటీ సీఎం వస్తున్నారు, మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకే వేదికపై పవన్, శంకర్, చరణ్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన మాసివ్ ప్రమోషన్స్ రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 21న డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
Game Changer
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన మాసివ్ ప్రమోషన్స్ రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 21న డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రం గేమ్ ఛేంజర్. ఆంధ్రప్రదేశ్ లో కూడా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
ఏపీలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ జనవరి 4 ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాదు మెగా అభిమానులు ఉక్కిరి బిక్కిరయ్యే క్రేజీ అప్డేట్ వచ్చింది. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా నిజంగా మెగా అభిమానులు పండగ చేసుకునే వార్తే.
కొత్త ప్రభుత్వం వచ్చాక ఏపీలో భారీ సినిమా ఈవెంట్ జరగలేదు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీలో నిర్వహిస్తుండడం.. పైగా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానుండడంతో ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి, వైజాగ్ లాంటి నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
వెన్యూ ఫిక్స్ అయ్యాక ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. ఏర్పాట్లు తప్పనిసరిగా భారీ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు కాబట్టి సెక్యూరిటీ పటిష్టంగా ప్లాన్ చేస్తారు. ఒకే వేదికపై చాలా కాలం తర్వాత రాంచరణ్, పవన్ కనిపించబోతున్నారు. వీరితో కలసి డైరెక్టర్ శంకర్ కూడా స్టేజిపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్.. రాంచరణ్ నాయక్ మూవీ ఆడియో లాంచ్ కి హాజరయ్యారు. ఆ తర్వాత రంగస్థలం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నారు.
మెగా ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. సంధ్య థియేటర్ ఉదంతంతో ప్రీమియర్ షోలు ఇక ఉంటాయా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే గేమ్ ఛేంజర్ చిత్రానికి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉంటాయని దిల్ రాజు కంఫర్మ్ చేశారు. మొత్తంగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ చిత్రం కోసం ఒక రేంజ్ లో ప్లానింగ్ చేస్తున్నారు.