పవన్ కళ్యాణ్ వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న ప్రభాస్ డైరెక్టర్ ? నిజమెంత?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి రిటైర్ అవ్వబోతున్నారా? తన వారసుడు అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారా? అందుకోసం దర్శకుడిని కూడా సలెక్ట్ చేసుకున్నారా? నిజమెంత?

పవన్ కళ్యాణ్ బిజీ బిజీ
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చినా.. తన టాలెంట్ తో ఇండస్ట్రీలోపవర్ స్టార్ గా ఎదిగాడు పవన్ కళ్యాణ్. తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. సినిమాలతో పాటు రాజకీయాల్లోను తనదైన ప్రభావం చూపిస్తూ వస్తోన్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రాజకీయాలతో పాటు మూవీ కెరీర్‌ను కూడా బాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా మారిన ఆయన, త్వరలో రిలీజ్ కాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'ఓజీ' తో సినీ ఇండస్ట్రీని ఊపేస్తారనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.
ఓజీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకఎత్తయితే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు మరొక ఎత్త. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తిచేసిన తరువాత సినిమాలకు విరామం ఇచ్చి, పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాలని పవన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందుకోసం తగిన ఏర్పాట్లు కూడా ఆయన చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తన వారసుడు అకీరాను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడని టాక్.
పవన్ వారసుడిని రంగంలోకి దింపుతారా?
ఇదిలా ఉండగా, పవన్ తన కుమారుడు అకిరా నందన్ ను సినిమాల్లోకి పరిచయం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అఫీషియల్ గా సమాచారం లేనప్పటికా.. అకీరా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండటం, స్పెషల్ గా మార్షన్ ఆర్ట్స్ లో ట్రైయినింగ్ తీసుకోవడం, దానితో పాటు యాక్టింగ్ లో కూడా ఆయన మెలకువలు నేర్చుకుంటున్నాడని సమాచారం. అయితే, ఆయన ఎప్పుడు సినీ ఇండస్ట్రీకి అడుగుపెడతాడు అనే విషయమై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
అకీరా బాధ్యత ఆ దర్శకుడిదేనా?
తాజా సమాచారం ప్రకారం, అకిరా నందన్‌ను తెరపై పరిచయం చేసే బాధ్యతను 'ఓజీ' దర్శకుడు సుజీత్ కు అప్పగించాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారని సమాచారం. 'ఓజీ' సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన నేపథ్యంలో, కొత్త తరానికి ఏమి కావాలో సుజీత్‌కు బాగా తెలుసని పవన్ నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తన కుమారుడి కెరీర్‌ను ప్రారంభించే బాధ్యతను అతనికే అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నారట.
అకీరా నందన్ కు ప్రత్యేక శిక్షణ
ఇప్పటివరకు మీడియా ముందు పెద్దగా కనిపించని అకిరా నందన్, అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే ప్రతీసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నారు. పవన్ అభిమానులు కూడా ఆయనను తండ్రికి తగ్గ బాడీ లాంగ్వేజ్, హావభావాలతో ఉన్నాడని అభిప్రాయపడుతున్నారు. అయితే అకిరా లాంచ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. సుజీత్ చేతిలోనే ఈ బాధ్యత ఉంటుందా లేదా వేరే దర్శకుడు ఉంటారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ పాలనాపరమైన బాధ్యతలతో బిజీ అవుతోన్న నేపథ్యంలో, తన వారసుడిని సినీ రంగానికి పరిచయం చేయడంపై గట్టిగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.