- Home
- Entertainment
- త్రివిక్రమ్ కాదు పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తి ఎవరు?
త్రివిక్రమ్ కాదు పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తి ఎవరు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎన్నో స్నేహాలు ఉన్నాయి. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్, అలీ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కాని త్రివిక్రమ్ కంటే ముందు పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ బిజీ బిజీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినా సరే రీసెంట్ గా తన పెండింగ్ సినిమాలపై ఫోకస్ చేశారు. వరుసగా వాటిని కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభించింది. ఇక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయడానికి ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడికి సబంధించిన సమాచారం వైరల్ అవుతోంది. అందరు త్రివిక్రమ్ మాత్రమే పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారు. కానీ పవన్ కు మరో ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అతను ఎవరో తెలుసా?
KNOW
పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు
ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. అయితే ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది. లేదా గతంలో ఆలీ పేరు వినిపించేది. కాని పనవ్ కు మరో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని మీకు తెలుసా? ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో ఆ వ్యక్తి ఉన్న త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో పవన్ సరసన ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? అతను ఎవరో కాదు పవన్ ప్రాణ స్నేహితుడు ఆనంద్ సాయి. చాలా మందికి తెలియదు పవన్ కళ్యాణ్ ఆనంద్ సాయి బెస్ట్ ఫ్రెండ్స్ అని.
యాదాద్రి ఆలయానికి డిజైన్ అందించిన ఆనంద్ సాయి
ఆనంద్ సాయి ఎవరు అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఆనంద్ సాయి ప్రమఖ ఆర్ట్ డైరెక్టర్. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, 2014లో వచ్చిన ఎవడు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. అంతకు ముందు నుంచి పవన్ తో ఆనంద్ సాయికి స్నేహం ఉంది. ఆ తరువాత 2015లో పవన్ నటించిన గోపాల గోపాల సినిమాలో పవన్ లుక్‌కు సంబంధించి స్కెచ్ వర్క్ చేశారు. సినిమాలకే పరిమితం కాకుండా, ఆనంద్ సాయి ఇతర ప్రాజెక్టులకూ తన సేవలు అందించారు. ముఖ్యంగా, తెలంగాణలో యాదాద్రి ఆలయ పునః నిర్మాణానికి గుడి డిజైన్ చేసిన ఘనత ఆయనకే దక్కింది.
పవర్ స్టార్ వెంటే నడుస్తున్నఆనంద్ సాయి
ఆనంద్ సాయి తన కెరీర్ స్టార్టింగ్ నుంచి పవన్ కు చాలా దగ్గరగా ఉన్నారు. పవన్ వెంట నడుస్తూ ప్రతీ విషయంలో పవన్ కు సపోర్ట్ చేస్తూ వచ్చారు. పవన్ ఎక్కడికి వెళ్లినా, ఏ ప్రాజెక్ట్ అయినా పవన్ పక్కనే ఆనంద్ ఉంటారు. రాజకీయాలకైనా, సినిమాలకైనా పవన్ కు అండగా నిలిచిన ఆయన, ఇప్పటికీ అదే స్థాయిలో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. కాని పవన్ కళ్యాణ్ అంటే వెంటనే త్రివిక్రమ్ మాత్రమే గుర్తుకు వస్తారు. ఆనంద్ సాయి పవన్ స్నేహానికి సంబంధించిన విషయం చాలా
ఓజీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. వచ్చే నెల 25న పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ కాబోతోంది. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.