- Home
- Entertainment
- Pawan Kalyan: ఫ్యాన్స్ కి బిగ్ షాక్... సినిమాలకు పవన్ గుడ్ బై... చివరి చిత్రం కానున్న హరి హర వీరమల్లు!
Pawan Kalyan: ఫ్యాన్స్ కి బిగ్ షాక్... సినిమాలకు పవన్ గుడ్ బై... చివరి చిత్రం కానున్న హరి హర వీరమల్లు!
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాలు చేయకూడని నిర్ణయించుకున్నారనేది విశ్వసనీయ సమాచారం.

pawan kalyan
2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ (Pawan kalayn) కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మెజారీటీ సీట్లు సాధించి సీఎం అవ్వకున్నా.. కొన్ని సీట్లు గెలిచి హంగ్ వచ్చేలా చేయాలి అనుకున్నారు. ఆ విధంగా కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఊహించారు. ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి. జనసేన పార్టీ కేవలం ఒక్క ఏంఎల్ఏ సీటు గెలిచింది. అధినేత పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.
pawan kalyan
కాగా 2019 చివర్లో పవన్ మరలా సినిమాల్లోకి కమ్ బ్యాక్ ప్రకటించారు. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేస్తే తప్పేంటి? నాకు తెలిసింది ఇదే? పార్టీ కోసం, కుటుంబం కోసం సినిమాలు చేయక తప్పదని వెల్లడించారు. కమ్ బ్యాక్ తర్వాత పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు విడుదల చేశారు.
pawan kalyan
వీటితో పాటు హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ మూవీ ప్రకటించడం జరిగింది. వినోదయ సిత్తం మూవీ అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ... ఇది కూడా ఆయన అప్ కమింగ్ చిత్రాల లిస్ట్ లో ఉంది. వీటిలో హరి హర వీరమల్లు మాత్రమే షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
ఇక ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కువ సమయం లేదు కాబట్టి నిరంతరం ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. అటు అధికార పార్టీ సైతం గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు టీడీపీతో పొత్తు విషయమై సందిగ్ధత కొనసాగుతుంది. ఎవరితో పొత్తు పెట్టుకున్నా సీఎం అభ్యర్థి నేనే అంటూ పవన్ పరోక్షంగా తెలియజేశారు. టీడీపీ దీనికి ససేమిరా ఒప్పుకోదు కాబట్టి, బీజేపీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్లాలనే ప్రణాళికలు వేస్తున్నారు.
పొత్తుల సంగతి ఎలా ఉన్నా సంస్థాగతంగా జనసేనను బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు హడావుడి చేస్తే ప్రయోజనం ఉందని గ్రహించి సుదీర్ఘ ప్రణాళిక వేస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు. దీనికి ముహూర్తం కూడా పెట్టారు.
pawan kalyan
అక్టోబర్ 5 దసరా పండుగ నాడు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. తిరుపతి నుండి ఆయన యాత్ర ప్రారంభం కానుంది. దాదాపు ఆరు నెలలు నిరవధికంగా పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర సాగనుంది. యాత్ర ముగింపు రోజు రెండు రాష్ట్రాలను ఉద్దేశిస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రణాళిక ఇది.
అక్టోబర్ అంటే... యాత్ర మొదలు కావడానికి మిగిలింది మూడున్నర నెలల సమయం మాత్రమే. పవన్ యాత్ర 2023 మార్చి లో ముగుస్తుంది. కాబట్టి ఈ మూడు నెలల్లో సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. పరిస్థితులు గమనిస్తుంటే భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి చిత్రాలు అటకెక్కినట్లే.
కారణం 2024లో ఎన్నికలు జరిగినా... యాత్ర ముగిశాక పవన్ కి ఉండేది ఏడాది సమయం మాత్రమే. ఈ ఏడాది కాలంలో పొత్తుల కసరత్తు చేయాలి. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక వంటి అనేక వ్యవహారాలు ఉంటాయి. ఏ విధంగా చూసినా పవన్ ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే ఛాన్స్ లేదు.
pawan kalyan
కావున పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే. హరి హర వీరమల్లు ప్రస్తుతానికి ఆయన చివరి చిత్రం కావచ్చు. ఇక 2024 ఎన్నికల ఫలితాలను బట్టి పవన్ కమ్ బ్యాక్ ఇచ్చేది లేనిదీ ఆధారపడి ఉంటుంది. తాజా అంచనాల ప్రకారం పవన్ సినిమాలకు విరామం ప్రకటించనున్నారు.