- Home
- Entertainment
- OG: అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్‌లకు పవన్ కళ్యాణ్ ఝలక్.. అక్కడ అన్ని రికార్డులు బ్రేక్
OG: అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్‌లకు పవన్ కళ్యాణ్ ఝలక్.. అక్కడ అన్ని రికార్డులు బ్రేక్
పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` మూవీ మ్యానియా స్టార్ట్ అయ్యింది. అమెరికాలో ప్రీమియర్స్ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

భారీ హైప్‌తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ `ఓజీ`
పవన్ కళ్యాణ్ చివరగా `హరి హర వీరమల్లు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఇప్పుడు `ఓజీ` కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి ప్రారంభం నుంచే ఈ మూవీకి భారీ హైప్ ఉంది. ఆ తర్వాత గ్లింప్స్ వచ్చాక ఆ హైప్ మరింతగా పెరిగింది. పవన్ ఎక్కడ పబ్లిక్ మీటింగ్‌లకు వెళ్లినా, ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ అరుస్తూ గోల చేస్తూ వచ్చారు.
సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్న `ఓజీ`
ఇది సినిమాపై ఉన్న క్రేజ్‌ని తెలియజేస్తుంది. ఈ క్రమంలో తాజాగా `ఓజీ` టైమ్ వచ్చింది. ఇది రిలీజ్‌కి రెడీ అవుతుంది. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
యూఎస్ అడ్వాన్స్ సేల్స్ లో `ఓజీ` సరికొత్త రికార్డ్
`ఓజీ` యూఎస్ ప్రీమియర్స్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. తాజాగా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుంది. గత రికార్డులను బ్రేక్ చేసి దూసుకుపోతుంది. యూఎస్‌ఏ కేవలం మూడు రోజుల్లోనే ఇతర స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు అత్యంత ఫాస్ట్ గా ఐదు లక్షల డాలర్లకుపైగా ప్రీమియర్స్ సేల్స్ సాధించిన మూవీగా `ఓజీ` నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఇది ఐదు లక్షల డాలర్లు(నాలుగున్నర కోట్లు) దాటడం విశేషం. 308 లొకేషన్లలో, 1127 షోస్‌లో 17049టికెట్స్ సేల్స్ తో ఈ రికార్డ్ ని సొంతం చేసుకుంది `ఓజీ` మూవీ.
`పుష్ప 2`, `కల్కి`, `దేవర` రికార్డులు బ్రేక్
ఈ నేపథ్యంలో ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే ఇంతటి భారీ వసూళ్లని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పొందిన సినిమాగా `ఓజీ` రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఇది ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. అంతకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ `కల్కి 2898 ఏడీ` 3లక్షల డాలర్లని సాధించి మొదటి స్థానంలో ఉంది. అలాగే `పుష్ప 2` రెండు లక్ష 88 వేల డాలర్లతో అల్లు అర్జున్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక లక్షా 37వేల డాలర్లతో ఎన్టీఆర్ `దేవర` మూడో స్థానంలో నిలిచింది. ఇక లక్షా తొమ్మిది వేల డాలర్లతో ప్రభాస్ `సలార్` నాల్గో స్థానానికే పరిమితం అయ్యింది. ఇప్పుడు `ఓజీ` మొదటి ప్లేస్‌కి రావడంతో వీటి స్థానాలు పడిపోయాయి.
ఓవర్సీస్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా `ఓజీ`?
ఇలా అడ్వాన్స్ సేల్స్ లో పవన్ కళ్యాణ్ ముందున్నారని చెప్పొచ్చు. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే ఇక మున్ముందు ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి. మొత్తానికి ప్రీమియర్స్ లో `ఓజీ` సినిమా సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. దీంతోపాటు ఫస్ట్ డే రోజు కూడా ఇది భారీ ఓపెనింగ్స్ ని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 24నే యూఎస్‌లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. రాత్రి 12 గంటలకు(మన ఇండియన్ టైమ్ ప్రకారం) ఈ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి.